బూర నర్సయ్య గౌడ్

బూర నర్సయ్య గౌడ్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. వృత్తిరిత్యా వైద్యుడైన నర్సయ్య, లాప్రోస్కోపిక్, స్థూలకాయం, జీర్ణశయాంతర మొదలైనదానిలో వైద్యం చేశాడు. నరసయ్య 20,000 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు.

బూర నర్సయ్య గౌడ్
బూర నర్సయ్య గౌడ్


ఎంపి
పదవీ కాలం
2014 - 2018
ముందుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తరువాతకోమటిరెడ్డి వెంకటరెడ్డి
నియోజకవర్గంభువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-02) 1959 మార్చి 2 (వయసు 65)
సూర్యాపేట, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతంహిందు

జననం - విద్యాభ్యాసం

బూర నర్సయ్య గౌడ్ 1959, మార్చి 2న తెలంగాణలోని సూర్యాపేటలో జన్మించాడు. అతను ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తిచేశాడు.

వృత్తి జీవితం

ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (HILLS) కి డైరెక్టర్ గా ఉన్నాడు. అందేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నాడు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నాడు. తెలంగాణలోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నాడు.

రాజకీయ జీవితం

తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన టీఆర్‌ఎస్‌లో 2013 జూన్‌ 2న చేరి, 2014 లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందాడు. స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.[1][2][3][4]

బూర నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[5] ఆయన 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌, బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు.[6][7]

2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్బంగా బీజేపీ 2024 మార్చి 02న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ పేరును అధిష్టానం ప్రకటించింది.[8][9]

ఫెల్లోషిప్స్

బూర నర్సయ్య గౌడ్ వివిథ సంస్థలనుండి ఫెల్లోషిప్స్ పొందాడు.[10]

  • ఫెల్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ సర్జన్స్ (ఎఫ్.ఎ.ఐ.ఎస్)
  • ఫెల్లో ఇంటర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఎఫ్.ఎ.సి.ఎస్)
  • ఫెల్లో మినిమల్ ఆక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎమ్.ఎ.ఎస్)

పురస్కారాలు

  • 1989 లో కేంద్ర ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక సర్జికల్ నైపుణ్యము అవార్డు[10]
  • 1990 లో ఉత్తమ సర్జన్ అవార్డు[10]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ