బిపాషా బసు

భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది.

బిపాషా బసు (జ. 1979 జనవరి 7) ఒక భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె వివాహానంతరం బిపాషా బసు సింగ్ గ్రోవర్ గా పిలువబడుతోంది. [4] ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించినా, తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఈమె అనేక పురస్కారాలను పొందింది. ఈమెను మీడియా తరచుగా సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ ఉంటుంది.

బిపాషా బసు
బిపాషా బసు
జననం (1979-01-07) 1979 జనవరి 7 (వయసు 45)[1]
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుబోనీ [2]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి[3]

ఢిల్లీలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన బిపాషా 1996లో గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో గెలుపొంది తరువాత ఫ్యాషన్ మోడల్‌గా వృత్తిని విజయవంతంగా కొనసాగించింది. దానితో ఈమెకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఈమె 2001లో "అజ్‌నబీ అనే థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రతికూల పాత్రతో సినిమారంగంలో అడుగు పెట్టింది. ఆ పాత్ర ఈమెకు ఉత్తమ నటి (మొదటి సినిమా) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈమె ప్రధాన పాత్ర "రాజ్" అనే హారర్ సినిమాలో తొలిసారి నటించింది. తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. "జిస్మ్", "కార్పొరేట్", "నో ఎంట్రీ", "ఫిర్ హేరాఫేరీ", "ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్", ధూం -2, "రేస్", "రాజ్-3D", "బచ్‌నా ఏ హసీనో", "ఆత్మ", "క్రియేచర్ -3D", "అలోన్" వంటి అనేక సినిమాలలో ఈమె తన నటనను ప్రదర్శించింది. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్‌లో నటించింది.

ప్రారంభ జీవితం, మోడలింగ్ వృత్తి

బిపాషా బసు 1979, జనవరి 7న ఒక బెంగాలీ కుటుంబంలో ఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి హీరక్ బసు ఒక సివిల్ ఇంజనీరు. తల్లి మమత గృహిణి. ఈమెకు బిదిషా బసు అనే అన్నయ్య, విజేత బసు అనే చెల్లెలు ఉన్నారు. ఢిల్లీలో ఈమె నెహ్రూప్లేస్‌లో 8వ యేడు వచ్చేవరకు నివసించింది. అక్కడ ఏపిజె ఉన్నత పాఠశాలలో చదివింది. [5] ఆమె కుటుంబం తరువాత కోల్‌కతాకు మారింది. అక్కడ ఈమె భవన్స్ విద్యామందిర్‌లో చదివింది.[6] పాఠశాలలో ఈమె లీడర్‌గా ఎన్నికై 'లేడీ గుండా'గా పేరు తెచ్చుకుంది.[7] ఈమె 12వ తరగతి వరకు సైన్స్ ప్రధాన అంశంగా చదివింది. తరువాత కామర్స్ సబ్జెక్టుకు మారింది.

ఈమెను మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియా 1996లో కోల్‌కాతాలోని ఒక హోటల్ లో చూసి మాడలింగ్ చేపట్టమని సలహా ఇచ్చింది.[8]ఆ ఏడాది ఈమె ఫోర్డ్ కంపెనీ నిర్వహించిన గోద్రెజ్ సింథాల్ సూపర్ మోడల్ పోటీలో విజయం పొంది, భారతదేశం తరఫున మయామిలో జరిగిన "ఫోర్డ్ మోడల్స్ సూపర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్" పోటీలో పాల్గొనింది.[9][10]

సినిమా రంగం

ఐ.ఐ.ఎఫ్.ఎ ఫ్యాషన్ ఎక్‌స్ట్రావెంజా 2015లో బిపాషా బసు

ఈమె పాల్గొన్న గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్ న్యాయనిర్ణేతలలో ఒకరైన వినోద్ ఖన్నా తన కుమారుడు అక్షయ్ ఖన్నా సరసన "హిమాలయ్ పుత్ర" సినిమాలో నటించడానికి ఈమెను ఆహ్వానించాడు. అయితే వయసు తక్కువగా ఉందనే కారణంతో ఈమె ఆ పాత్రను తిరస్కరించింది. దానితో ఆ పాత్ర అంజలా జవేరీకి దక్కింది. తరువాత జయాబచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ జె.పి.దత్తా దర్శకత్వంలో నటిస్తున్న "ఆఖరీ ముఘల్" అనే సినిమాలో నటింపజేయడానికి బిపాషాను ఒప్పించింది. [11] అయితే దత్తా మరో స్క్రిప్టుతో అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్‌లతో రెఫ్యుజీ అనే సినిమా నిర్మాణం చేపట్టడంతో ఆఖరీ ముఘల్ సినిమా రద్దయింది.[12] రెఫ్యుజీ చిత్రంలో సునీల్ శెట్టి సరసన నటించడానికి ఈమెను సంప్రదించారు కానీ ఈమె తిరస్కరించింది.[8]

చివరకు 2001లో అక్షయ్ కుమార్ హీరోగా అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వెలువడిన "అజ్నబీ" అనే సినిమాతో సినిమారంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఈమె నటించిన దుష్టపాత్రకు విమర్శకులనుండి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ నూతననటి అవార్డు లభించింది.[8]

2002లో రాజ్ సినిమాతో ఈమెకు ప్రధాన పాత్రలు లభించడం మొదలయ్యింది.[13]

2017 హెల్త్ మ్యాగజైన్‌పై బిపాషా ముఖచిత్రం.

ఈమె జాన్ అబ్రహాం, బాబీ డియోల్, మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, పరేష్ రావెల్, కరణ్ సింగ్ గ్రోవర్ వంటి నటుల సరసన నటించింది. విక్రం భట్, సంజయ్ గద్వీ, డేవిడ్ ధావన్, రామ్ గోపాల్ వర్మ, జయంత్ సి పరాన్జీ, కె. విజయ భాస్కర్, అమిత్ సక్సేనా, రోహిత్ శెట్టి, మహేష్ మంజ్రేకర్, విశాల్ భరద్వాజ్, ఆదిత్య చోప్రా, ఋతుపర్ణ ఘోష్, భూషణ్ పటేల్ వంటి దర్శకుల సినిమాలలో నటించింది. ఈమె చిత్రపరిశ్రమలో 15 సంవత్సారాలకు పైగా నిలదొక్కుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఒకరు.

ఈమె సినిమాలలో నటించడంతో పాటు 2010 నుండి "లవ్ యువర్ సెల్ఫ్", "బ్రేక్ ఫ్రీ", "అన్లీష్" అనే ఫిట్‌నెస్ డివిడిలను విడుదల చేసింది. వీటిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యం, బరువు తగ్గుదల మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చింది.

వ్యక్తిగత జీవితం

భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో బిపాషా

బిపాషా "రాజ్" సినిమాలో తన జోడీ అయిన డినో మోరియాతో 1996 నుండి సంబంధాలను నెరిపింది. 2002లో వారిద్దరూ విడిపోయారు. తరువాత "జిస్మ్" సినిమా నిర్మాణ సమయంలో సహ నటుడు జాన్ అబ్రహాంతో డేటింగ్ ప్రారంభించింది. 2011 ఆరంభం వరకూ వీరిద్దరి మధ్యా సంబంధాలు కొనసాగాయి.[14][15][16] మీడియా ఈ జంటను "సూపర్ కపుల్"గా అభివర్ణించింది.[17]

2014లో ఈమె నటుడు హర్మన్ బవేజాతో సంబంధమున్నట్లు అంగీకరించింది.[18] అదే యేడాది డిసెంబరులో తాము విడిపోయినట్లు ప్రకటించింది.[19] 2015లో "అలోన్" సినిమా సహనటుడైన కరణ్ సింగ్ గ్రోవర్తో డేటింగ్ ప్రారంభించింది. వారిద్దరూ 2016 ఏప్రిల్ 30వ తేదీన వివాహం చేసుకున్నారు.[20]

ఫిల్మోగ్రఫీ

విడుదలైన సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుభాషవివరణ
2001అజ్‌నబీసోనియా బజాజ్/నీతాహిందీతొలి సినిమా
2002టక్కరి దొంగపనసతెలుగు
2002రాజ్సంజనా భరద్వాజ్హిందీహీరోయిన్‌గా మొదటి సినిమా
2002ఆంఖేఁరైనాహిందీప్రత్యేక పాత్ర
2002మేరే యార్ కీ షాదీ హైరియాహిందీ
2002చోర్ మచాయే షోర్రంజితహిందీ
2002గునాప్రభా నారాయణ్హిందీ
2003తుఝే మేరీ కసమ్‌గిరిజహిందీప్రత్యేక పాత్ర
2003జిస్మ్సోనియా ఖన్నాహిందీ
2003ఫుట్‌పాత్సంజనా శ్రీవాత్సవ్హిందీ
2003రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములాబిపాషా బసుహిందీ
2003జమీన్నందినీ రాయ్హిందీ
2004ఇష్క్ హై తుమ్‌ సేఖుష్బూహిందీసూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా.
2004ఎయిత్బార్రియా మల్హోత్రాహిందీ
2004రుద్రాక్ష్గాయత్రిహిందీ
2004రక్త్దృష్టీ నాయర్హిందీ
2004మధోషిఅనుపమా కౌల్హిందీ
2005చెహరామేఘహిందీ
2005సచిన్మంజుతమిళం
2005విరుద్ధ్: ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్-హిందీప్రత్యేక పాత్ర
2005బర్సాత్అన్నా వీర్వాణిహిందీ
2005నో ఎంట్రీబాబీహిందీ
2005అపహరణ్మేఘా బసుహిందీ
2005శిఖర్నటాషాహిందీ
2006హమ్‌ కో దీవానా కర్ గయేసోనియా బెర్రీహిందీ
2006డర్‌నా జరూరీ హైవర్షహిందీరామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం.
2006ఫిర్ హేరా ఫేరీఅనూరాధహిందీ
2006అలగ్బిపాషా బసుహిందీప్రత్యేక పాత్ర
2006కార్పొరేట్నిసిగంధ దాస్‌గుప్తాహిందీ
2006ఓంకారబిల్లో చమన్‌బహార్హిందీ
2006జానే హోగా క్యాఅదితిహిందీ
2006ధూమ్-2సోనాలి బోస్/మోనాలి బోస్హిందీ
2007నెహ్లే పె దేహ్లాపూజహిందీ
2007నో స్మోకింగ్-హిందీ
2007ఓం శాంతి ఓంబిపాషా బసుహిందీ
2007గోల్రుమానాహిందీ
2008రేస్సోనియా మార్టిన్హిందీ
2008బచ్‌నా ఏ హసీనోరాధిక/శ్రేయ రాథోడ్హిందీ
2008రబ్ నే బనాదీ జోడీ-హిందీ
2009ఆ దేఖే జరాసిమీ ఛటర్జీహిందీ
2009ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్జాన్వీ చోప్రాహిందీ
2009షొబ్ చరిత్రోం కాల్పొనిక్రాధికా మిత్రబెంగాలీ
2010పంఖ్నందినిహిందీ
2010లమ్హాఅజీజాహిందీ
2010ఆక్రోష్గీతహిందీ
2011దమ్‌ మారో దమ్జోయీ మెండోంకాహిందీ
2012ప్లేయర్స్రియాథాపర్హిందీ
2012జోడీ బ్రేకర్స్సోనాలీ అగ్నిహోత్రిహిందీ
2012రాజ్-3Dశయన శేఖర్హిందీ
2013రేస్ - 2సోనియా మార్టిన్హిందీ
2013ఆత్మమాయా వర్మహిందీ
2013ది లవర్స్తులజ నాయక్ఇంగ్లీషు
2014హం షకల్స్మిస్తీహిందీ
2014క్రియేచర్-3Dఆహనా దత్హిందీ
2015అలోన్సంజన/అంజనహిందీ

పురస్కారాలు

బిపాషా బసు తన 17 యేళ్ల సినిమా అనుభవంలో ఎన్నో అవార్డులను గెలుపొందింది. మొత్తం 31 అవార్డులను కైవసం చేసుకోగా మరో 46 సందర్భాలలో ఈమె పేరు అవార్డు కొరకు ప్రతిపాదించబడింది.

ఈమె గెలుచుకున్న అవార్డులలో కొన్ని ముఖ్యమైనవి:

  1. 2001లో "అజ్నబీ" చిత్రంలో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతననటి అవార్డు.
  2. 2003లో "రాజ్" సినిమాలో డినో మోరియాతో కలిసి జీ సినిమా డైనమిక్ జంట అవార్డు.
  3. 2006లో "కార్పొరేట్" చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు.
  4. 2006లో "కార్పొరేట్" చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా ఆనందబజార్ పత్రిక అవార్డు.
  5. 2010లో "షొబ్ చరిత్రో కాల్పొనిక్" బెంగాలీ చిత్రంలోని నటనకు డర్బన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు.
  6. 2012లో "దమ్‌ మారో దమ్‌" చిత్రంలో నటనకు స్టార్‌డస్ట్ ఉత్తమ నటి (థ్రిల్లర్ సినిమా) అవార్డు.
  7. 2013లో స్టార్‌డస్ట్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మొదలైనవి.

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ