బాలకృష్ణ శర్మ నవీన్

భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు

బాలకృష్ణ శర్మ (1897 డిసెంబర 8-1960 ఏప్రిల్ 29) నవీన్ అనే కలంపేరుతో హిందీ సాహిత్యంలో కవిగా ప్రసిద్ధి చెందిన ఒక భారత స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త.[1] అతను కాన్పూర్ నియోజకవర్గానికి మొదటి లోక్‌సభ సభ్యుడుగా[2][3] 1957 నుండి మరణించే వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.[4] అతను గణేష్ శంకర్ విద్యార్థి తర్వాత ప్రతాప్ దినపత్రిక సంపాదకుడిగా, అధికారిక భాషల సంఘం సభ్యుడిగా పనిచేశాడు.[5] అతని కవితా సంకలనాలలో కుంకుమ్, రష్మిరేఖ, అపాలక్, క్వాసి, వినోబా స్థావన్, ఊర్మిళ, హమ్ విష్‌పేయి జనమ్ కే, మరణానంతరం చివరిగా ప్రచురించబడ్డాయి. సాహిత్యంలో అతను చేసిన కృషికి భారత ప్రభుత్వం 1960లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[6] 1989లో అతని జ్ఞాపకార్థం భారత తపాలా స్మారక ముద్రను విడుదల చేసింది.[7]

బాలకృష్ణ శర్మ నవీన్
1989 లో భారతదేశపు స్టాంప్‌పై నవీన్
జననం(1897-12-08)1897 డిసెంబరు 8
మరణం1960 ఏప్రిల్ 29(1960-04-29) (వయసు 62)
వృత్తిస్వాతంత్ర్య ఉద్యమకారుడు
కవి
రాజకీయ నాయకుడు
జర్నలిస్ట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందీ సాహిత్యం, హిందీ పద్యాలు
తల్లిదండ్రులుజమానదాస్ శర్మ
రాధాబాయి
పురస్కారాలుపద్మభూషణ్

జీవిత చరిత్ర

బాలకృష్ణ శర్మ1897 డిసెంబరు 8న భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లా, భ్యానా అనే చిన్న గ్రామంలో, జమానదాస్ శర్మ, రాధాబాయిల దంపతులకు నిరాడంబరమైన ఆర్థిక కుటుంబంలో జన్మించాడు.[5][8] ఇంట్లో పేదరికం కారణంగా, అతను తన 11 వ ఏట మాత్రమే షాజపూర్‌లోని ఒక స్థానిక పాఠశాలలో తన ప్రాథమిక విద్యను ప్రారంభించాడు. ఉజ్జయిని వెళ్లి అక్కడ మెట్రిక్యులేషన్ చదివి అతను1917లో ఉత్తీర్ణుడయ్యాడు.ఆసమయంలో ప్రఖ్యాత కవి మఖన్‌లాల్ చతుర్వేదిని కలిసే అవకాశం అతనికి లభించింది.అతను గణేష్ శంకర్ విద్యార్థికి మార్గదర్శ నాయకత్వం వహించాడు. తరువాత గణేష్ శంకర్ విద్యార్థి ప్రతాప్ పత్రిక ఎడిటర్‌గా చేరాడు.[9] కొత్త వ్యక్తులును కలుసుకున్న సంబంధాలు, బాలకృష్ణ శర్మ నవీన్ స్థావరాన్ని కాన్పూర్‌కు మార్చడానికి సహాయపడ్డాయి. అతను గ్రాడ్యుయేట్ స్టడీస్ (బిఎ) కోసం కాన్పూర్ క్రైస్ట్ చర్చి కళాశాలలో చేరాడు. అతను కాన్పూర్ కళాశాలలో చదివే రోజుల్లో తన జీవితంలో ఒక మలుపు తిరిగింది. అతను సహాయ నిరాకరణోద్యమం పాల్గొన్నాడు. అది 1921లో తన కళాశాల చదువును విడిచిపెట్టి రాజకీయాలకు పూర్తి సమయం జీవితాన్ని ఉపయోగించేలాగున తీసుకునేలా చేసింది.[8]

శర్మ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా ఉన్న సమయంలో 1921 నుండి 1944 వరకుగల మధ్యకాలంలో ఆరుసార్లు బ్రిటిష్ ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. ప్రభుత్వం ప్రమాదకరమైన ఖైదీగా ప్రకటించింది.[10] హిందీభాషా దినపత్రిక  ప్రతాప్‌తో ఉన్న అనుబంధం ద్వారా అతను తన పాత్రికేయ వృత్తిని కొనసాగించాడు.వార్తాపత్రిక ఎడిటర్ గణేష్ శంకర్ విద్యార్థి 1931 మార్చిలో మరణించిన తరువాత, అతను దానికి ఎడిటర్‌గా ఎంపికయ్యాడు.[11].1947 భారత స్వాతంత్ర్యం తరువాత, అతను పార్టీ జాతీయ రాజకీయాలను చేపట్టాడు. భారత జాతీయ కాంగ్రెసు (ఐ.ఎన్.సి) తో తన పొత్తును కొనసాగించాడు. అతను 1951-52 మొదటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాన్పూర్ దక్షిణ ఎటావా జిల్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందిన చంద్రశేఖర్‌ని 26,500 ఓట్ల తేడాతో ఓడించి. దాదాపు 50 శాతం ఓట్లు సాధించాడు.[2] 1957లో, అతను మరణించే వరకు రాజ్యసభ సభ్యుడుగా ఆ పదవిలో కొనసాగాడు.[12] రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు అతని వక్తృత్వ నైపుణ్యాలు అతనికి కాన్పూర్ సింహాన్ని సంపాదించిపెట్టాయి. 1955 లో భారత ప్రభుత్వం అధికారిక భాషల సంఘం ఏర్పాటు చేసినప్పుడు, అతను దానికి సభ్యుడిగా ఎంపికయ్యాడు.[13] అతను నేపాల్, మారిషస్, యుఎస్‌ఎతో సహా అనేక దేశాలను సందర్శించిన సాంస్కృతిక ప్రతినిధి బృందంలో సభ్యుడుగా ఎంపికయ్యాడు.[14]

శర్మ కళాశాలలో చదివేరోజులలో నవీన్ అనే కలంపేరునుండి దేశభక్తి ఆరాధన ప్రతిబింబింబించే అనేక పద్యాలు రాశాడు [15] కుంకుమ్, రష్మిరేఖ, అపాలక్, క్వాసి, వినోబా స్థావన్, ఊర్మిళ వంటి ప్రచురించిన అనేక సంకలనాలను అందించాడు.అతను హిందీ భాష సాహిత్య ప్రభ పత్రిక సంపాదకుడుగా పనిచేసాడు.[16] అతను రాజ్యసభ సభ్యుడుగా పనిచేస్తున్నప్పుడు 1960 ఏప్రిల్ 29న అతని మరణానికి కొన్ని నెలల ముందు,1960లో భారత ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ మూడవ అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది.[6] అతని మరణానంతరం జ్ఞానపీఠ్, మరికొన్ని కవితలు సంకలనం చేయబడ్డాయి.అవి హమ్ విష్‌పేయ్ జనమ్ కే పేరుతో ప్రచురించబడ్డాయి.[5][8] అతని గద్య రచనలు, బాలకృష్ణ శర్మ గద్య రచనావలి 5 సంపుటాలు, పద్యాలలో ప్రచురించబడ్డాయి. బాలకృష్ణ శర్మ కావ్య రచనావలి 3 సంపుటాలలో ప్రచురించబడింది.[17] అతని కవితలు మాజీ భారత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయితో సహా చాలా మందిని ప్రభావితం చేసినట్లు నివేదించబడింది. భారత తపాలా శాఖ 1989 లో అతని స్మారక ముద్రతో సత్కరించింది [8] ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ అతని గౌరవార్థం, బాలకృష్ణ శర్మ నవీన్ అవార్డును స్థాపించింది. [18] మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షాజాపూర్‌లోని ఒక కళాశాల , ప్రభుత్వ బాలకృష్ణ శర్మ నవీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల అని అతని పేరును పెట్టింది.[19][20] 2013లో విష్ణు త్రిపాఠి రాసిన బాలకృష్ణ శర్మ నవీన్ జీవిత చరిత్ర పుస్తకంలో అతని జీవితం చరిత్ర రాసి, ప్రచురించబడింది.[21]

ఇది కూడ చూడు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ