బార్మర్ జిల్లా

రాజస్థాన్ లోని జిల్లా

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి.[1] రాజస్థాన్ రాష్ట్రంలో వైశాల్యపరంగా బార్మర్ 2వ స్థానంలో ఉంది.బార్మర్ జిల్లాకు బార్మర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో బలోత్రా, గుడమాలని, బేటూ, సివన, జాసో, చొహతన్ మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో చమురు నిల్వలు వెలువడ్డాయి.

బార్మర్ జిల్లా
बाडमेर जिला
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
డివిజనుజోధ్‌పూర్ విభాగం
ముఖ్య పట్టణంబార్మర్ (రాజస్థాన్)
విస్తీర్ణం
 • మొత్తం28,387 కి.మీ2 (10,960 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం26,03,751
 • జనసాంద్రత92/కి.మీ2 (240/చ. మై.)
 • Urban
6.98 percent
జనాభా వివరాలు
 • అక్షరాస్యత56.53
 • లింగ నిష్పత్తి902
ప్రధాన రహదార్లుఎన్ఎచ్ 15, ఎన్ఎచ్ 112
అక్షాంశ రేఖాంశాలు70°50′N 72°52′E / 70.83°N 72.87°E / 70.83; 72.87-24°58′N 26°32′E / 24.97°N 26.53°E / 24.97; 26.53
Websiteఅధికారిక జాలస్థలి
రాజస్థాన్ పటంలో బార్మర్ జిల్లా స్థానం
రాజస్థాన్ రాష్ట్రంలో బార్మర్ జిల్లా స్థానం

పేరు వెనుక చరిత్ర

13వ శతాబ్దంలో బార్మర్ నగరాన్ని బహద రావు పర్మర్ (పంవర్) లేక బార్ రావు పార్మర్ స్థాపించాడని అందువలన నగరం ముందుగా బహదామర్ అని పిలువబడిందని క్రమంగా అదే బార్మర్‌గా మారిందని భావిస్తారు.

భౌగోళికం

బార్మర్ రాజస్థాన్ పశ్చిమ భూభాగంలో ఉంది. ఇది థార్ ఎడారిలో ఒక భాగంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైసల్మేర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జలోర్ జిల్లా, తూర్పు సరిహద్దులో పాలీ జిల్లా, జోధ్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి. జిల్లా వైశాల్యం 28387.[1] జిల్లా 24,58' నుండి 26. 32' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70, 05' నుండి 72. 52' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[1]

జిల్లాలో ప్రవహిస్తున్న ల్యూనీ నది పొడవు 480 కి.మీ. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో సంగమిస్తుంది. ఇది జలోర్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. వేసవిలో ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుంటుంది. వార్షిక సరాసరి వర్షపాతం 277 మి.మీ ఉంటుంది.

భాషలు

జిల్లాలో ప్రధానంగా రాజస్థానీ భాష వాడుకలో ఉంది. జిల్లాలో హిందీ భాష అధికారభాషగా ఉంది. పర్యాటక అభివృద్ధికి, విద్యాబోధనకు ఆంగ్లభాషకు కూడా ప్రాధాన్యత అధికంగా ఉంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లా జనాభా మొత్తంలో 95.72% మంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు.సింధీ భాషను 3.99% మంది మాట్లాడే వారు ఉన్నారు.[2]

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో మొత్తం జనాభా 2,603,751. వీరిలో 1,369,022 మంది పురుషులు కాగా, 1,234,729 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి బార్మెర్ జిల్లాలో మొత్తం 451,629 కుటుంబాలు నివసిస్తున్నాయి. బార్మర్ జిల్లా సగటు సెక్స్ నిష్పత్తి 902.2011 జనాభా లెక్కలు ప్రకారం 7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 93% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 78.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 54.8%గా ఉంది. బార్మర్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 899 కాగా, గ్రామీణ ప్రాంతాలు 902గా ఉంది.బార్మర్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 501522, ఇది మొత్తం జనాభాలో 19%. 0-6 సంవత్సరాల మధ్య 263356 మగ పిల్లలు, 238166 ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 904, ఇది బార్మర్ జిల్లాలోని సగటు సెక్స్ నిష్పత్తి (902) కంటే ఎక్కువ.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19013,13,102—    
19112,99,518−0.44%
19212,81,438−0.62%
19313,08,264+0.91%
19413,94,529+2.50%
19514,77,282+1.92%
19616,49,794+3.13%
19717,74,805+1.78%
198111,18,892+3.74%
199114,35,222+2.52%
200119,64,835+3.19%
201126,03,751+2.86%
source:[3]

వరద

2006లో జిల్లాలో ఆగస్టు 16-25 మధ్య 549 మి.మీ వర్షపాతం కురిసింది. వరద కారణంగా జిల్లాలోని కవాస్ పట్టణం నీట మునిగింది. పలువురు ప్రాణాలను కోల్పోయారు. పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. కొత్తగా 22 సరసులు ఏర్పడ్డాయి. వీటిలో 6 సరసుల వైశాల్యం 10 చ.కి.మీ. ఉంది. బార్మర్ ప్రాంతంలో ఎదురుచూడని వరద వలన నష్టం భారీ స్థాయికి చేరుకుంది. ప్రాంతీయ పర్యావరణం, మట్టి తీరు, అదనంగా వచ్చి చేరిన నీటిని ఎదుర్కోవటానికి అనుకూలంగా లేదు. వరద ఈ ప్రాంతానికి కొన్నిటికి స్వల్పకాల, కొన్నిటికి దీర్ఘకాల నష్టాన్ని కలిగించింది. మిగిలిన ప్రాంతాలలో కనిపించని నష్టాన్ని కలిగించింది. వరద ప్రజాల జీవితాలను, జీవనోపాధిని తీవ్రంగా బాధించింది.[4]

ఆర్ధికం

బార్మర్ జిల్లాలో ఇసుక దిబ్బలు

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాల (640) లో, వెనుకబడిన 250 జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

సంస్కృతి

బార్మర్ జిల్లా భారతదేశ అతి పెద్ద థార్ ఎడారిలో భాగంగా ఉంది. ఎడారి ప్రాంతంలోని మిగిలిన జిల్లాల మాదిరిగా బార్మర్ జిల్లా జానపద సంగీతం, జానపద నృత్యానికి ప్రత్యేకత కలిగి ఉంది. బార్మర్‌లో భోప (ప్రీస్ట్ గాయకులు) ఉన్నారు. వీరు ఈ ప్రాంతానికి చెందిన ప్రాంతీయ దైవసమానమైన కథానాయకుల గురించిన గీతాలను రూపకల్పన చేస్తుంటారు. మిగిలిన సంగీత కళాకారులలో ముస్లిం ధోలీలు (డ్రమ్మర్లు) ఉన్నారు.వీరంతా జివనోపాధికి పనిచేస్తుంటారు. కళాకారుల కుటుంబాలలో లంగ్వాలు, మంగనీయర్లు ముఖ్యులు.

బార్మర్ ఉడన్ ఫర్నీచర్, బ్లాక్ ప్రింటింగ్ ఇండస్ట్రీకి కూడా ఈ జిల్లాకు ప్రాముఖ్యత ఉంది. గ్రామీణ ప్రజలు వారి ఏడారి జీవితానికి సంబంధించిన ప్రత్యేక అలకరణ సామాగ్రిని తయారు చేసుకునే నైపుణ్యం కలిగి ఉన్నారు. గ్రామస్థులు కొందరు వారి గృహాలను గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించేలా అలకరించుకుంటారు.

జసోల్, జునా బర్మర్, ఖెడ్, కిరడు, మల్లొనాథ్ సంత (జంతువుల సంత), మేవా నగర్ (నకొడా), భీంగొడా, అషోతరా, ఇంద్రోలి, బిరత మాతా ఆలయం, టెంపుల్ కనబ (శీతలా ఫెయిర్) చౌతాన్ ఫెయిర్ కూడా ప్రత్యేకత కలిగినవే.తివారా పశువుల సంతకు ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు హాజరౌతూ ఉంటారు.

పర్యాటక ఆకర్ష్ణణలు

శివన తాలూకాలో ఉన్న పురాతనమైన శివన కోట (గద్ శివానా). ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని భావిస్తున్నారు.

విభాగాలు

2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 2 విభాగాలు ఉన్నాయి: బార్మర్, బల్మొరా[1]

  • జిల్లాలో 11 ఉప విభాగాలు ఉన్నాయి: బార్మర్ (రాజస్థాన్), బలోత్ర, గుదమలని, షెయొ, శివాన, ఛొహ్తన్, బయ్తూ, రంసర్, రాజస్థాన్, రింధరి, సెద్వ,
  • పద్నాలుగు తాలూకా లు: బార్మర్ తాలూకా, బయ్తూ, ఛొహ్తన్, గుధ మలని, పచ్పద్రా, రంసర్ (రాజస్థాన్), షెయొ, శివాన, సందరి, ఢొరిమన్న, గైడ్, రాజస్థాన్, సింధరి, సెద్వ, గద్ర రోడ్, ఢొరిమన.
  • జిల్లాలో 8 గ్రామ పంచాయితీలలో 1,941 గ్రామాలు ఉన్నాయి.

థార్ ఎడారిలో ఆయిల్ లభ్యత

2009లో బార్మర్ జిల్లా ఉన్న చమురు నిల్వలు వెలువడ్డాయి. జిల్లాలో ప్రధాన చమురు నిల్వలు మంగళ, భాగ్యం, ఐశ్వర్య ప్రాంతాలలో వెలువడ్డాయి. 22 సంవత్సరాలలో ఇది అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న ప్రాంతంగా ప్రత్యేకత కలిగి ఉంది.[6] ఇందులో కెయిం సస్థకు 70%, ఒ.ఎన్.జి.సి సంస్థకు 30% భాగస్వామ్యం ఉంది. 2010 మార్చి ఈ ఫీల్డ్ నుండి ఉత్పత్తి 4 నుండి 6.5 బిలియన్ బ్యారెల్స్‌కు అభివృద్ధి చేయబడింది.[7]

అండర్‌గ్రౌండ్ ఎయిర్ బేస్

బార్మర్ జిల్లాలో " ఉత్తర్‌లై మిలటరీ ఎయిర్ బేస్ " ఉంది. ఇది భారతదేశంలోని మొదటి అండర్‌గ్రౌండ్ ఎయిర్ బేస్‌గా గుర్తించబడుతుంది.

సరిహద్దు ప్రాంతాలు, జిల్లాలు

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ