బారు అలివేలమ్మ

బారు అలివేలమ్మ (1897 - 1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

బారు అలివేలమ్మ
రాజమండ్రి స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని బారు అలివేలమ్మ విగ్రహం
జననంసెప్టెంబర్ 1897
మరణం1973 నవంబర్ 13
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిబారు రాజారావు
పిల్లలువెంకట గోవిందరావు, కృష్ణారావు, శేషగిరమ్మ, శారద, శాంత
తల్లిదండ్రులు
  • పత్రి కృష్ణారావు (తండ్రి)
  • పత్రి వెంకూబాయమ్మ (తల్లి)

కుటుంబ నేపథ్యం

అలివేణమ్మ 1897 సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం కాకినాడ.ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు, వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త బారు రాజారావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆమె కుమారుడు వెంకట గోవిందరావు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె 1973 నవంబరు 13 తేదీన మరణించారు.

స్వాతంత్ర్యోద్యమంలో

అలివేలమ్మ కమలా నెహ్రూతో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.[2] విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన నాయకురాలు బారు అలివేలమ్మ.

సంస్మరణ

ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.[3] ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి సబ్ కలెక్టర్ వి.శేషాద్రి ఆవిష్కరించారు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ