బాబు బంగారం

బాబు బంగారం 2016, ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో మారుతి దాసరి[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, నయనతార[4][5][6] ప్రధాన పాత్రల్లో నటించగా, జిబ్రాన్ సంగీతం అందించాడు.[7]

బాబు బంగారం
బాబు బంగారం సినిమా పోస్టర్
దర్శకత్వంమారుతి దాసరి
రచనడార్లింగ్ స్వామి (మాటలు)
స్క్రీన్ ప్లేమారుతి
కథమారుతి
నిర్మాతఎస్. నాగవంశీ
పి.డి.వి. ప్రసాద్
ఎస్. రాధకృష్ణ
(సమర్పణ)
తారాగణందగ్గుబాటి వెంకటేష్
నయనతార
ఛాయాగ్రహణంరిచర్డ్ ప్రసాద్
కూర్పుఎస్.బి. ఉద్ధవ్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
సితార ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదార్లుహరిక & హసిని క్రియేషన్స్
విడుదల తేదీ
12 ఆగస్టు 2016 (2016-08-12)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్28 crore (US$3.5 million)
బాక్సాఫీసు46.2 crore (US$5.8 million)[1]

బాబు బంగారం సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికేట్ పొందింది.[8] తెలుగు సినిమాతోపాటు సెల్వి అనే తమిళ అనువాదం కూడా విడుదలైంది.[9]

కథా నేపథ్యం

తనవల్ల ఎవరూ బాధ పడకూడదని ఆలోచించే జాలి గల పోలీస్ ఆఫీసర్ కృష్ణ (వెంకటేష్) కు కష్టాల్లో ఉన్న శైలజ (నయనతార) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే శైలజను ఇష్టపడి తనకు అండగా ఉండాలనుకుంటాడు. శైలజ బావ బాబ్జీ (పృథ్వీ) ద్వారా తన కుటుంబానికి దగ్గరై శైలజకు ఉన్న ఒక్కో సమస్యను తీరుస్తుంటాడు. ఒకరోజు శైలజ తండ్రి శాస్త్రి (రాధారవి) ఒక కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో శాస్త్రిని చంపడానికి మల్లేశ్ యాదవ్ (సంపత్) ప్రయత్నిస్తుంటాడు. మల్లేశ్ కు ఎమ్మెల్యే పుచ్చయ్య (పోసాని కృష్ణమురళి) ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. శైలజ తండ్రిని మల్లేశ్ యాదవ్ ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, కృష్ణ కావాలనే శైలజ కుటుంబానికి దగ్గరయ్యడా అనేది మిగతా కథ.[10][11]

నటులు

సాంకేతికవర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మారుతి దాసరి
  • నిర్మాత: ఎస్. నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్
  • సమర్పణ: ఎస్. రాధకృష్ణ
  • మాటలు: డార్లింగ్ స్వామి (మాటలు)
  • సంగీతంజిబ్రాన్
  • ఛాయాగ్రహణంరిచర్డ్ ప్రసాద్
  • కూర్పుఎస్.బి. ఉద్ధవ్
  • నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్
  • పంపిణీదారు: హరిక & హసిని క్రియేషన్స్

నిర్మాణం

ఈ చిత్రం 2015, డిసెంబరు 16న హైదరాబాదులో ప్రారంభించబడి, మరుసటి రోజు చిత్రీకరణ ప్రారంభమైంది.[13][14] ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ 2016, ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా విడుదలైంది.[15]

పాటలు

బాబు బంగారం
సినిమా by
జిబ్రాన్
Released24 జూలై 2016 (2016-07-24)
Recorded2016
Genreపాటలు
Length25:01
Labelఆదిత్యా మ్యూజిక్
Producerజిబ్రాన్
జిబ్రాన్ chronology
తూంగ వనం
(2015)
బాబు బంగారం
(2016)
హైపర్
(2016)

ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2016, జూలై 24న హైదరాబాదులో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, సినీ నటుడు నాని, నటి లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు.[16]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మల్లెల వానలా (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రినరేష్ అయ్యర్‌4:05
2."స్నేహితుడో (రచన: శ్రీమణి)"శ్రీమణిరంజిత్4:07
3."దండమే ఎట్టుకుంటం (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్గోల్డ్ దేవరాజు4:08
4."ధిల్లున్న వాడే (రచన: శ్రీమణి)"శ్రీమణిధనుంజయ్, రామీ3:07
5."రాక రాక (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిచిన్మయి, యాజిన్ నిజార్4:15
6."టిక్కు టిక్కంటూ (రచన: కాసర్ల శ్యామ్‌)"కాసర్ల శ్యామ్‌నరేంద్ర, ఉమ నేహ1:42
7."బాబు బంగారం"థీమ్ మ్యూజిక్షబీర్3:14
మొత్తం నిడివి:25:01

విడుదల - స్పందన

2016, ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.[17] 2017లో రివాల్వర్ రాజా పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.[18] 123తెలుగు.కాంలో ఈ చిత్రాన్ని కుటుంబ కథా చిత్రంగా పేర్కొనడమేకాకుండా 3.25 రేటింగ్ కూడా ఇచ్చింది.[19]

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ