బాబాసాహెబ్ పురందరే

బాబాసాహెబ్ పురందరే(29 జూలై 1922 - 15 నవంబర్ 2021)గా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే మహారాష్ట్రకు చెందిన రచయిత. చరిత్రకారుడు. అతని రచనలు ఎక్కువగా 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జీవితానికి సంబంధించిన సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. పూణే పీష్వాల చరిత్రను కూడా బాబాసాహెబ్ పురందరే అధ్యయనం చేశాడు. 1970ల ప్రారంభంలో శివసేనలో బాలాసాహెబ్ థాకరేతో పాటు సీనియర్ పార్టీ నాయకులుగా మాధవ్ దేశ్‌పాండే, మాధవ్ మెహెరేతో పాటు ఆయన గణనీయమైన కృషికి ప్రసిద్ధి చెందాడు.[3] మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2015లో లభించింది.[4] భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ 25 జనవరి 2019న లభించింది.

బాబాసాహెబ్ పురందరే

బల్వంత్ మోరేశ్వర్ పురందరే
జననం
బల్వంత్ మోరేశ్వర్ పురందరే

(1922-07-29)1922 జూలై 29 [1][2]
సాస్వాద్, పూణే, బ్రిటిష్ ఇండియా
మరణం2021 నవంబరు 15(2021-11-15) (వయసు 99)
పుణె, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తిచరిత్రకారుడు, రచయిత, వక్త
జీవిత భాగస్వామినిర్మలా పురందరే (1933-2019)
పిల్లలు3
పురస్కారాలుపద్మ విభూషణ్ (2019)
మహారాష్ట్ర భూషణ్ (2015)

జీవిత చరిత్ర

బాబాసాహెబ్ పురందరే భార్య నిర్మలా పురందరే కూడా ప్రముఖ సామాజిక కార్యకర్త. ఆమె పూణేలో వనస్థలి సంస్థను స్థాపించింది. ఆమె గ్రామీణ మహిళలు, పిల్లల అభివృద్ధికి కృషి చేసింది. ఆమె సోదరుడు శ్రీ గా మజ్‌గావ్కర్, బాబాసాహెబ్ పురందరే లకు సాహిత్య రంగంలో సన్నిహిత సంబందం ఉంది. బాబాసాహెబ్ పురందరేకు ఒక కుమార్తె మాధురీ, ఇద్దరు కుమారులు అమృత్, ప్రసాద్ ఉన్నారు. వీరందరూ మరాఠీ సాహిత్య రంగంలో సేవలందిస్తున్నారు. మాధురీ పురందరే ప్రసిద్ధ రచయిత్రి మాత్రమే కాక చిత్రకారిణి, గాయని కూడా.

వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన 99 సంవత్సరాల వయసులో పూణేలో 15 నవంబర్ 2021న మరణించాడు.[5][6]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ