బవనక సందీప్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
బవనక సందీప్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బవనక పరమేశ్వర్ సందీప్
పుట్టిన తేదీ (1992-04-25) 1992 ఏప్రిల్ 25 (వయసు 32)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010-ప్రస్తుతంహైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీఫస్ట్లిస్టు-ఎట్వంటీ20
మ్యాచ్‌లు584838
చేసిన పరుగులు3,6311,343734
బ్యాటింగు సగటు44.8232.7528.23
100s/50s7/210/80/2
అత్యధిక స్కోరు203 నాటౌట్9674 నాటౌట్
వేసిన బంతులు1,487783321
వికెట్లు12187
బౌలింగు సగటు72.0832.8854.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు010
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు000
అత్యుత్తమ బౌలింగు4/575/262/14
క్యాచ్‌లు/స్టంపింగులు41/–28/–19/–
మూలం: Cricinfo, 6 మే 2020

బవనక పరమేశ్వర్ సందీప్, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్-క్లాస్ క్రికెటర్ గా హైదరాబాద్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు.[1] 2017-18 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున నాలుగు మ్యాచ్‌లలో 400 పరుగులు చేసి, అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[2]

2018 జూలైలో 2018-19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టులో ఎంపికయ్యాడు.[3] 2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తరపున బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 3,000వ పరుగును సాధించాడు.[4]

జననం

సందీప్ 1992 ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

ఫస్ట్-క్లాస్

రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ లో భాగంగా 2010, నవంబరు 10 నుండి 13 వరకు రాంచీలో జార్ఖాండ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్ లో 232 బంతుల్లో 144 పరుగులు చేశాడు.[5] ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 203 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.

లిస్టు-ఎ

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2011, ఫిబ్రవరి 11న పాలక్కడ్ లో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] లిప్టు-ఎ క్రికెట్ లో 96 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ సాధించాడు.

ట్వంటీ20

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా 2013, మార్చి 17న షిమోగాలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] ట్వంటీ20 క్రికెట్ లో 74 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.

మూలాలు

బయటి లింకులు

మార్గదర్శకపు మెనూ