ప్రపంచ రేబీస్ దినోత్సవం

లూయిస్ పాశ్చర్ జ్ఞాపకర్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దిన

ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న నిర్వహించబడుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని గ్లోబల్ అలయన్స్ ఫర్ రాబిస్ కంట్రోల్ అనే లాభాపేక్షలేని సంస్థ చేత నిర్వహించబడుతున్న ఈ దినోత్సవం రోజున రేబీస్ వ్యాధి నియంత్రణ, నివారణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగిస్తారు.[1] ఐక్యరాజ్యసమితిచే గుర్తింపుపొందిన[2] ఈ దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ,[3] పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్,[4] జంతు ఆరోగ్య ప్రపంచ సంస్థ, యుఎస్ సెంటర్స్ వంటి అంతర్జాతీయ మానవ, పశువైద్య ఆరోగ్య సంస్థ[5]లచే ఆమోదించబడింది.

ప్రపంచ రేబీస్ దినోత్సవం
ప్రపంచ రేబీస్ దినోత్సవ లోగో
ఫ్రీక్వెన్సీప్రతి సంవత్సరం సెప్టెంబరు 28
తరువాతిసెప్టెంబరు 28, 2023

లూయిస్ పాశ్చర్ జ్ఞాపకర్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుగుతుంది. లూయిస్ పాశ్చర్ తన స్నేహితుల సహకారంతో, మొదటి సమర్థవంతమైన రేబీస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. మనుషులు, జంతువులపై రేబీస్ ప్రభావం గురించి అవగాహన పెంచడం, రేబీస్ వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.

చరిత్ర

ప్రపంచ ఆరోగ్య సంస్థ, పాన్ అమెరికన్ ఆరోగ్య సంస్థ, జంతు ఆరోగ్య ప్రపంచ సంస్థల సహ-సహకారంతో అమెరికాలోని అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం, అలయన్స్ ఫర్ రాబిస్ కంట్రోల్ సంస్థల భాగస్వామ్యంలో 2007, సెప్టెంబరు 8న తొలిసారిగా ఈ ప్రపంచ రాబిస్ దినోత్సవం జరిగింది. 2009లో మూడు ప్రపంచ రేబీస్ దినోత్సవాలు జరిగిన తరువాత, 100 దేశాలకు పైగా రేబీస్ నివారణ, అవగాహన కార్యక్రమాలు జరిగాయని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ల మందికి రేబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించబడిందని, దాదాపు 3 మిలియన్ కుక్కలకు టీకాలు వేసినట్లు తెలిసింది.[6]

అంతర్జాతీయంగా ప్రభుత్వ సంస్థలు, విద్యావేత్తలు, ఎన్జిఓ సంస్థలు, వ్యాక్సిన్ తయారీదారులు 2011లో చేసిన సమీక్షలో రేబీస్ నివారణకు సహాయపడటానికి, వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ దినోత్సవం ఉపయోగకరమైన వేదికగా గుర్తించారు. తరువాత సంవత్సరాల్లో, ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కూడా రేబీస్ నిర్మూలనపై విధానాలు, ప్రణాళికలు, పురోగతిని ప్రకటించే రోజుగా ఉపయోగించుకున్నాయి.

2013లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థలు మొదట ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కనైన్-మెడియేటెడ్ రేబీస్‌ను ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాలని పిలుపునిచ్చాయి.[7] ఇది ఆగ్నేయాసియా దేశాల రేబీస్ ఎలిమినేషన్ స్ట్రాటజీ అసోసియేషన్‌లో చేర్చబడింది.[8] 2015లో జరిగిన మొదటి పాన్-ఆఫ్రికన్ రేబీస్ కంట్రోల్ నెట్‌వర్క్ సమావేశంలో అక్కడ ప్రాతినిధ్యం వహించిన 33 ఆఫ్రికన్ దేశాలు ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని రాబిస్ న్యాయవాద అవకాశంగా పరిగణించాలని సిఫార్సు చేశాయి.[9] 2007 నుండి ఫిలిప్పీన్స్ లో ప్రపంచ రేబీస్ దినోత్సవం జాతీయ, స్థానిక ప్రభుత్వ స్థాయిలలో గుర్తించబడి, జాతీయ రేబీస్ నివారణ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మారింది. 2020 సెప్టెంబరులో కుక్కల మాంస రహిత ఇండోనేషియా (డిఏంఎఫ్ఐ) వంటి జంతు సంక్షేమ సంస్థలు అక్రమ కుక్క మాంసం వ్యాపారం వల్ల కలిగే రేబీస్ వ్యాధి ముప్పును పరిష్కరించడానికి ఇండోనేషియా అధికారులు చర్య తీసుకోవాలని పిలుపునిచ్చాయి.

కార్యక్రమాలు

ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ఎయిర్ ఫీల్డ్ లో ప్రపంచ రేబీస్ దినోత్సవ కార్యక్రమం

ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా రాబిస్ నియంత్రణ పద్ధతులు, నివారణ సాధనాల గురించి అవగాహన పెంచడానికి, ర్యాలీలు, పరుగు పందాలు, బైక్ రైడ్‌లు, కుక్కలకు వేసే టీకా క్లినిక్‌ల గురించి అవగాహన కల్పించడం మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి పదేళ్ళలో వివిధ దేశాల నుండి 1,700కి పైగా కార్యక్రమాలు జరిగాయి. ఆఫ్రికా, ఆసియాలో సంవత్సరాలుగా ఆవగాహన కార్యక్రమాలలో పెరుగుదల ఉంది. ఈ దేశాలలో ఇప్పటికీ రేబీస్ వ్యాధి పెద్ద సమస్యగా మారింది.

ఇవికూడా చూడండి

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ