ప్రతీక్షా లోన్కర్

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి.

ప్రతీక్షా లోన్కర్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళలో నటించింది.[1] డిడిసహ్యాద్రిలో ప్రసారమైన దామిని మరాఠీ టీవి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించి పేరు పొందింది.[2]

ప్రతీక్షా లోన్కర్
జననం1968
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దామిని సీరియల్ లో దామిని పాత్ర

జీవితం విశేషాలు

ప్రతీక్షా లోన్కర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించింది. తండ్రి డాక్టర్, తల్లి ఉపాధ్యాయురాలు. ప్రతిక్షా 10వ తరగతి వరకు పాఠశాల విద్యను పూర్తిచేసిన తర్వాత, కళారంగం మీద అభిరుచితో నాటకరంగంలోకి వెళ్ళింది.[2]

కళారంగం

నటనపై ఉన్న ఆసక్తితో ముంబైకి వెళ్ళి మరాఠీ, హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది. డిడి సహ్యాద్రిలో వచ్చిన దామిని సీరియల్ లో దామిని పాత్ర పోషించింది.[3][4] హిందీ టీవీ సీరియల్ కహానీ నహీ....జీవన్ హై మరాఠీలో వసుధగా రీమేక్ చేయబడింది. ఈ రెండు సీరియల్స్‌లో కూడా ప్రధాన పాత్ర పోషించింది.[5] దూరదర్శన్‌లో ముద్దుపెట్టుకున్న మొదటి మహిళా నటి ప్రతిక్షా. బ్యోమకేష్ బక్షి ఎపిసోడ్‌లో వ్యాంప్‌గా నటిస్తున్నప్పుడు ముద్దు పెట్టుకుంది.

టీవీ సీరియల్స్‌తోపాటు అనేక మరాఠీ, హిందీ సినిమాలలో కూడా నటించింది. 2002లో వచ్చిన భేట్ అనే మరాఠీ సినిమాలో విడాకుల తర్వాత కొడుకు నుండి విడిపోయిన సుధ అనే తల్లి పాత్రలో నటించి అవార్డులు, ప్రశంసలు అందుకుంది.[6] 2007 ఏవ్‌దే సే ఆభాల్‌లో ఒక చిన్న పిల్లవాడికి తల్లిగా నటించింది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఇక్బాల్, దోర్, ఆశేయిన్, మోడ్ అనే నాలుగు సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

మరాఠీ స్క్రీన్ ప్లే రచయిత ప్రశాంత్ దాల్వీని వివాహం చేసుకున్నది.[7][8]

సినిమాలు

సంవత్సరంసినిమా పేరుపాత్రభాష
1997గుడ్గుడీసునీతహిందీ
1998సర్కర్నామమరాఠీ
1999పైజ్ లగ్నాచివైశాలిమరాఠీ
1999బింధాస్త్మరాఠీ
2002భేట్[9]సుధమరాఠీ
2005ఇక్బాల్సైదాహిందీ
2006దోర్గౌరీ సింగ్హిందీ
2006హీ పోర్గి కునాచీశ్రీమతి. పాట్కీమరాఠీ
2007ఖన్నా & అయ్యర్హిందీ
2007ఏవధేసే ఆభల్మరాఠీ
2007హ్యాట్రిక్శ్రీమతి. చవాన్హిందీ
2007నాన్హే జైసల్మేర్నాన్హే తల్లిహిందీ
2007సుర్వంతమరాఠీ
2008మీరాబాయి నాటౌట్నీలిమ ఎం. అచ్రేకర్హిందీ
2008హీరోస్శ్రీమతి. నఖ్వీహిందీ
2008సక్క భౌ పక్క వైరీమరాఠీ
2009కావలెనులక్ష్మిహిందీ
2009వాద రహాడాక్టర్ కేల్కర్హిందీ
2010ది వెయిటింగ్ రూమ్రీమాహిందీ
2010ఖేల్ సాత్ బరాచామరాఠీ
2010లేక్ లడ్కీమరాఠీ
2010ఆశయైన్సోదరి గ్రేస్హిందీ
2011ముంబై కట్టింగ్హిందీ
2011మోడ్శ్రీమతి. రేమండ్హిందీ
2012తుకారాంకంకీమరాఠీ
2012మోక్లా శ్వాసమరాఠీ [10]
2014దుసరి గోష్టమరాఠీ
2016ఫ్యామిలీ కట్టాసుజాతమరాఠీ
2018ఆక్సిజన్అమ్మీగుజరాతీ

నాటకరంగం

పేరుభాషఇతర వివరాలు
లగ్నమరాఠీకమలాకర్ సారంగ్ దర్శకత్వం
చార్ చౌగీమరాఠీచంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం
యెల్కోట్మరాఠీశ్యామ్ మనోహర్ నాటకం, చంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం[11]
డాక్టర్ తుమ్హి సుధ. . .మరాఠీచంద్రకాంత్ కులకర్ణి దర్శకత్వం [12]
ఆంహి సౌ కుముద ప్రభాకర్ ఆప్టేమరాఠీవీరేన్ ప్రధాన్ దర్శకత్వం

అవార్డులు

  • 2003 – మహారాష్ట్ర టైమ్స్ (మాతా) భేట్ కోసం సన్మాన్[13][14]
  • 2003 – భేట్ కోసం మరాఠీ చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్ స్క్రీన్ అవార్డు 
  • 2007 – పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏవ్‌దే సే ఆభాల్ కోసం ఉత్తమ నటి పురస్కారం[15]
  • 2008 – ఏవదే సే ఆభాల్ సినిమాలో ఉత్తమ నటి పురస్కారం[16]
  • ప్రింట్ వ్యూ పబ్లికేషన్స్, లయన్స్ క్లబ్ ద్వారా వైభవ్ పురస్కారం[17][18]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ