ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్. తెలుగు, హిందీ చిత్రాలలో నటించారు.

ప్రగ్యా జైస్వాల్
2023లో ప్రగ్యా జైస్వాల్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)

వ్యక్తిగత జీవితం

జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది. కళ, సంస్కృతిరంగంలో ఆమె సాధించిన విజయానికిగాను 2014, జనవరి 22న కోసం సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం అందుకుంది.

ఫెమినా మిస్‌ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని ‘మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌’, ‘మిస్‌ డాన్సింగ్‌ క్వీన్‌’, ‘మిస్‌ ఫ్రెండ్‌ ఆఫ్‌ ఎర్త్‌’ టైటిళ్లను గెలుచుకుంది.‘దవ్‌’, ‘డాబర్‌ వాటికా’, ‘మిలీనియమ్‌ హైపర్‌ మార్కెట్‌ ఫర్‌ దుబాయ్‌’, ‘రిలయన్స్‌ డిజిటల్‌’, ‘ఎఫ్‌బీబీ’ వంటి ఎన్నో పాపులర్‌ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేసింది.

సినిమా జీవితం

సి.సి.ఎల్.-4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో

2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం లభించింది. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇచ్చింది. అయితే, ఆసినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. క్రిష్ తరువాతి చిత్రమైన కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.

డోవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, FBB (బిగ్ బజార్ వద్ద ఫ్యాషన్), డాబర్ వాటిక యాంటీ చుండ్రు షాంపూ, దుబాయ్, UAE కోసం మిలీనియం, హైపెర్ మార్కెట్, హెల్త్ డ్రింక్, మలబార్ గోల్డ్ మొదలైన సంస్థలకు బ్రాండ్ అంబాడిజర్ గా చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది.

అభిరుచులు

ప్రగ్య చక్కటి గాయని. నృత్యమంటే ఎంతో ఇష్టం. హీరోల్లో చిరంజీవి, అల్లుఅర్జున్‌, నాగార్జున అంటే ప్రత్యేక అభిమానం, హీరోయిన్లలో అనుష్క, మాధురీ దీక్షిత్‌లను ఆరాధిస్తుంది. ఇష్టమైన రంగులు నలుపు, తెలుపు, ఎరుపు. ఫేవరెట్‌ డెస్టినేషన్‌ లండన్‌.

చిత్ర సమహారం

సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2014టిట్టూ ఎం.బి.ఎగుల్షన్హిందీ
2014డేగ /విరట్టుమవితెలుగు/తమిళం
2015మిర్చిలాంటి కుర్రాడువసుంధరతెలుగు
2015కంచెసీతతెలుగు
2017ఓం నమో వేంకటేశాయభావానితెలుగు
2017గుంటూరోడుఅమృతతెలుగు
2017నక్షత్రం (సినిమా)కిరణ్తెలుగు
2017జయ జానకీ నాయకాఫల్గుణాతెలుగు
2018ఆచారి అమెరికా యాత్రతెలుగు
2018సైరాతెలుగు/తమిళం
2021అఖండతెలుగు[1]

పురస్కారాలు

సంవత్సరంఅవార్డుసినిమా పేరు
2016జీ తెలుగు అప్సర అవార్డు "ఫైండ్ ఆఫ్ ది ఇయర్"కంచె
18వ ఉగాది పురస్కారం - ఉత్తమ తొలి చిత్ర నటి
సినిమా అవార్డ్స్ 2016 – ఉత్తమ తొలి చిత్ర నటి
ఫిలింఫైర్ అవార్డు 2016[2] – ఉత్తమ తొలి చిత్ర నటి (తెలుగు)
సైమా అవార్డు 2016 – ఉత్తమ తొలి చిత్ర నటి (తెలుగు)

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ