పోహ్రాదేవి తీర్థ క్షేత్రం

పోహ్రాదేవి (हिन्दी: पोहरा देवी, Pohra Devi) బంజారా సమాజ తీర్థ క్షేత్రం. బంజారా కాశీ గా ప్రసిద్ధి.[1]ఇది మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, మనోరా తాలుకాలోని ఉంది. ఇచ్చట బంజారా సమాజ ప్రజల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్ సమాధి, జగదాంబ మాతా పురాతన ఆలయం ఉంది.[2][3][4][5]

పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
బంజారా కాశీ గా ప్రసిద్ధి
బంజారా కాశీ గా ప్రసిద్ధి
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్ is located in Maharashtra
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
మహారాష్ట్ర రాష్ట్రంలొ ఉనికి
భౌగోళికాంశాలు :20°19′43″N 77°54′47″E / 20.32861°N 77.91306°E / 20.32861; 77.91306
పేరు
ఇతర పేర్లు:బంజారా కాశీగా ప్రసిద్ధి
ప్రధాన పేరు :పోహ్రాదేవి దేవాలయం
దేవనాగరి :पोहरादेवी
సంస్కృతం:పోహ్రాదేవి
మరాఠీ:पोहरादेवी
ప్రదేశం
దేశం: భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:వాషిమ్ మనోరా తాలుకా
స్థానికం:పోహ్రాదేవి / పౌరాగడ్
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:శ్రీ రామనవమి పోహ్రాదేవి జాతర
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారత
కట్టడాల సంఖ్య:పది
ఇతిహాసం
నిర్మాణ తేదీ:18 వ. శతాబ్ధము

జాతర ప్రారంభం

పోహ్రాదేవి జాతర ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రామనవమి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. జాతర వారం రోజులు పాటు ఉంటుంది.ఈ జాతర దేశంలోనే గొప్ప జాతరలలో ఒకటి. ఇచట మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్నాటక, తమిళనాడు ,గోవా, ఛత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా,పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ మొదలగు రాష్ట్రల నుండి కాక మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి కూడా బంజారా సమాజానికి చెందిన కోట్ల మంది భక్తులు, ఇతర సమాజపు భక్తులు హాజరై సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, అమ్మ జగదాంబ దేవి, నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి సంత్ రామారావు మహారాజ్ దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటారు‌.

ప్రత్యేకతలు

బంజారా సమాజ ప్రజలు తమ జీవితంలో కనీసం ఒక్క సారియైన తప్పకుండా ఈ జాతరను సందర్శించుకుంటారు.వీరితో పాటు కుల మత భేద భావం లేకుండా ఇతర సమాజ ప్రజలు కూడా దర్శించు కుంటారు.ఇచట తమ కుల దైవాలు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి, సంత్ రామారావు మహారాజ్ ఆలయాలను దర్శనం చేసుకొని మొక్క తీర్చుకుంటారు. సంతానం లేని వారు, అనేక సమస్యలతో బాధ పడేవారు, సేవాలాల్ దీక్ష తీసుకున్నవారు,ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు మనసులో మొక్కుకున్న కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. ఆ కోర్కెలు సఫలం అయిన తర్వాత ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు అక్కడికే వెళ్ళి తీర్చుకుంటారు.ఆనంతరం ఉచిత అన్నదాన వసతి గృహాలలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గోంటారు. దేవుని దర్శనంతరం తమ సంస్కృతి సాంప్రదాయాలకు సంబందించిన అనేక అభరణాలు, వస్త్రాలు,భజన సామాగ్రిలు వస్తువులను జాతర లో కోనుకుంటారు.

ఆలయ అభివృద్ధి

పోహ్రాదేవి ఆలయ ప్రాంత అభివృద్ధికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం రూ.593 కోట్లు మంజూరు చేసి ఆలయ ప్రాంత అభివృద్ధి శిలాఫలకానికి భూమి పూజ చేశారు.[6] ప్రభుత్వం నుండి ఆలయానికి ఒకటి నర్ర ఎకరాల భూమిని కేటాయించారు.నగారా (నంగారా) ఆకారంలో నంగారా భవన్ దివ్య, భవ్య మందిరం నిర్మాణం అందులో,మహారాజ్ విగ్రహం, జెండా నిర్మించారు. మ్యూజీయం పనులు, ప్రహారీ గోడ పనులు అందమైన రాజస్థాన్ గులాబి శిలాఫలకాలు ఉపయోగించి పనులు చక చక కొనసాగుతున్నాయి.ఉమ్రిలో సామ్కీమాత,జేతాలాల్ మహారాజ్ మందిర పునర్నిర్మాణం జరుగుతుంది.[7]

విగ్రహ ఆవిష్కరణ

పోహ్రాదేవిలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ గుర్రం పై స్వారి చేస్తూ కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తూ మనకు కన్పించే నూతనంగా బ్రాస్ ధాతుతో తయారు చేసిన ఈవిగ్రహాన్ని నంగారా భవన్ లో తేది:12 ఫిబ్రవరి 2023 లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్,ఆహారం,ఔషధ నిర్వహణ మంత్రి సంజయ్ భావు రాథోడ్ తో కలసి ముఖ్యమంత్రి ఏక్నాథ షిండే మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని మహారాష్ట్రలోని ఎవత్మాల్ జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పకారుడు రాము చౌహాణ్ తయారు చేశారు.11 ఫీట్లు ఎత్తులో 11 ఫీట్లు వెడల్పు ఉన్న ఈ విగ్రహం దాదాపు 15 క్వీంటళ్ళు బరువు ఉంది. ఇందులో 60 శాతం కాపర్ మెటల్, 30 శాతం జింక్,10 శాతం ఇతర లోహాలు, అల్యూమినియం ఉపయోగించి అపురూపంగా తిర్చిదిద్దారు. ఇచటనే 134 అడుగుల స్వేత వర్ణం జెండా (ధోళో జండా)ను కూడా ఆవిష్కరించారు.

స్థానం

పోహ్రాదేవి దేవాలయం విదర్భ ప్రాంతంలోని వాషిమ్ జిల్లాల్లో ఉన్న తీర్థ క్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రదేశము. ఇది కరంజా రైల్వే స్టేషన్ కు 35 కి.మీ దగ్గరలో, అమరావతి రైల్వే స్టేషన్ కు 87 కి.మీ దూరంలో ఉంది.అకోలా విమానాశ్రయానికి 80 కి.మీ దూరంలో ఉంది.డిగ్రేష్ పట్టణానికి సమీపంలో ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ