పోచయ్య కృష్ణమూర్తి

తెలంగాణకు చెందిన భారత క్రికెటర్.

పోచయ్య కృష్ణమూర్తి (12 జూలై 1947 - 28 జనవరి 1999) తెలంగాణకు చెందిన భారత క్రికెటర్.[1] 1971లో వెస్టిండీస్ జట్టుతో 5 టెస్టులు, 1976లో న్యూజిలాండ్ జట్టుతో ఒక అంతర్జాతీయ వన్డే ఆడాడు.[2] పల్లెమోని కృష్ణమూర్తి అని కూడా పిలుస్తారు.

పోచయ్య కృష్ణమూర్తి
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగులెగ్ బ్రేక్
పాత్రవికెట్-కీపర్
కెరీర్ గణాంకాలు
పోటీటెస్ట్ క్రికెట్అంతర్జాతీయ వన్డేఫస్ట్లిస్ట్ ఏ
మ్యాచ్‌లు511084
చేసిన పరుగులు336155844
బ్యాటింగు సగటు5.506.0014.9814.66
100లు/50లు-/--/--/8-/-
అత్యుత్తమ స్కోరు2068222
వేసిన బంతులు--36-
వికెట్లు--0-
బౌలింగు సగటు----
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు----
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు-n/a-n/a
అత్యుత్తమ బౌలింగు----
క్యాచ్‌లు/స్టంపింగులు7/11/1150/682/2
మూలం: [1], 2014 మార్చి 13

జననం

కృష్ణమూర్తి 1947, జూలై 12న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.[3] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశాడు.

క్రీడారంగం

1971లో ఫరోఖ్ ఇంజనీర్ బ్యాకప్‌గా ఇంగ్లాండ్‌లో, 1976లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌లలో కిర్మానీ డిప్యూటీగా పర్యటించాడు. 1967లో అరంగేట్రం చేసిన తరువాత 1970లలో హైదరాబాదు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో మొత్తం 11 స్లాట్లలో బ్యాటింగ్ చేశాడు. సెంచరీ పార్టనర్‌షిప్ బ్యాటింగ్‌లో నంబర్ 1 గా, 11వ స్థానంలో ఉన్న ఏకైక బ్యాట్స్ మన్ ఇతడు.[4]

మరణం

కృష్ణమూర్తి 1999, జనవరి 27న హైదరాబాదులో మరణించాడు.[3]

మూలాలు

బయటి లింకులు