పెరంబలూర్ జిల్లా

తమిళనాడు లోని జిల్లా

దక్షిణభారతదేశ జిల్లాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్ర జిల్లాలలో పెరంబలూరు జిల్లా ఒకటి. జిల్లా ప్రధాననగరంగా పెరంబలూరు ఉంది. జిల్లా వైశాల్యం 1,752 చదరపు మైళ్ళు. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 4,93,646. పెరంబలూరు జిల్లా జాసంఖ్యాపరంగా తమిళనాడు రాష్ట్రంలో చివరి స్థానంలో ఉంది.[3] పెరంబలూరు జిల్లా తమిళనాడు భూ అంతర్గత జిల్లాలలో ఒకటి. పెరంబలూరు జిల్లా ఉత్తర సరిహద్దులో కడలూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తిరుచిరాపల్లి జిల్లా, తూర్పు సరిహద్దులో తంజావూరు జిల్లా, పడమర సరిహద్దులో నమక్కల్, తిరుచిరాపల్లి జిల్లాలు ఉన్నాయి. జిల్లా మొత్తం వ్యవసాయ భూమి వైశాల్యం 3,69,007 హెక్టార్లు, నీటిపారుదల అందుతున్న భూమి వైశాల్యం 71,624 హెక్టార్లు, పెరంబలూరు జిల్లాలోని వేపంతట్టై తాలూకాలోని కొరైయారు గ్రామం వద్ద కొరైయారు నది ప్రవహిస్తుంది.

Perambalur district
பெரம்பலூர் மாவட்டம்
district
Perambalur Ranchankudi Fort
Perambalur Ranchankudi Fort
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
ప్రధాన కార్యాలయంPerambalur
Government
 • Collector & District MagistrateDr Darez Ahamed IAS
విస్తీర్ణం
 • Total1,752 కి.మీ2 (676 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total5,64,511
 • జనసాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
621220
టెలిఫోన్ కోడ్04328
Vehicle registrationTN-46[2]
లింగ నిష్పత్తి0.993 /
అక్షరాస్యత65.88%%
ClimateSemi-arid (Köppen)
Precipitation908 మిల్లీమీటర్లు (35.7 అం.)

భౌగోళికం

పెరంబలూరు జిల్లా మైదానం & కొండలతో నిండి ఉంటుంది. జిల్లా భూభాగం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టితో నిండి ఉంటుంది. జిల్లా అత్యధిక వర్షపాతం 908 - 946.9 మిల్లీమీటర్లు. నైరుతీ ఋతు పవనాలు, ఈశాన్య ఋతుపవనాలు వర్షపాతానికి కారణం ఔతుంటాయి. కావేరీ నదీ ప్రవాహిత ప్రాంతాలలో పెరంబలూరు జిల్లా ఒకటి. జిల్లాలో కావేరీ జలాలు 11,610 హెక్టర్ల వ్యవసాయ భూములకు నీటిని అందిస్తున్నాయి. గొట్టపు బావులు, బావుల ద్వారా 68% వ్యవసాయభూములకు నీరు అందుతూ ఉంది. జిల్లాలో ప్రధాన పంటలలో వరి, వేరుచనగ, చెరుకు, చిరుధాన్యాలు ముఖ్యమైనవి. ప్రస్తుత ప్రధాన పంటగా తమిళనాడు ప్రజల అభిమాన పాత్రమైన చిన్న ఎర్రగడ్డలు పండించబడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో పండించబడుతున్న చిన్న ఎర్రగడ్డలలో 24% పెరంబలూరులో పండించబడుతూ ఉన్నాయి. చిన్న ఎర్రగడ్డల పంటలో పెరంబలూరు తమిళనాడు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. చిన్న ఎర్రగడ్డలు పెరంబలూరు జిల్లాలోని నక్కసేలం, అమ్మాపాళయం, సిరువయలూరు, చెట్టికుళం, కలరాంపట్టి, ఈశానై, అరుమావూరు ప్రాంతాలలో విరివిగా సాగుఅవుతుంది.

ఆర్ధికం

ప్రస్తుతం పెరంబలూరు జిల్లా మొక్కజొన్న (రాష్ట్రంలో 27%), చిన్న ఎర్రగడ్డలు (రాష్ట్రంలో 50%) పంటలలో తమిళనాడులో ప్రథమస్థానంలో ఉంది.[4] పెరంబలూరు సెజ్ 5000 ఎకరాలలో పలు పంటలను ఉత్పత్తిచేసే ప్రణాళికను రూపొందిస్తున్నది. ఈ ప్రణాళిక " ఎస్.ఆర్.ఇ.ఐ ఇంఫ్రాస్ట్రక్చర్ ఫైనాంస్ లిమిటెడ్ " సంస్థ " తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలెప్మెంటు కార్పొరేషన్ " (టి.ఐ.డి.సి.ఒ) భాగస్వామ్యంతో అత్యున్నత సాంకేతను ఉపయోగించి రూపొందించాలని ప్రయత్నిస్తుంది.

పెరంబలూరు " సెజ్ " కడలూర్, పాండిచ్చేరి, చెన్నై నౌకాశ్రయాలను, రైలు మార్గాలను, తిరుచిరాపళ్ళి విమానాశ్రయాలను అనుసంధానం చేస్తున్నది. సెజ్ అత్యున్నత సాంకేతిక కలిగిన పరిశ్రమలను నెలకొల్పడం నిర్వహించడం, రిపేరు చేయడం మొదలైన కార్యక్రమాలను చేపట్టనున్నది. బయోటేక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సంస్థలు, వస్త్రతయారీ, తోలు పరిశ్రమలకు తోడ్పాటు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అతంర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేస్తూ అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సెజ్ దేశంలోని ప్రధాననగరాలను రోడ్డు, నౌకా, వాయు మార్గాలతో అనుసంధానిస్తూ ఉంది. సెజ్ పరీక్ష, గుర్తింపు పత్రాలు, గిడ్డంగి నిర్మాణం, అవసరమైన చోట మౌలిక వసతుల నిర్మాణ సౌకర్యాలు అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అదనంగా నివాస, రిక్రియేషన్ కేంద్రాలను నిర్మించాలని ప్రయత్నిస్తుంది. ఆక్సిస్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఎస్.బి.ఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఔ.ఒ.బి, ఇండియన్ బ్యాంక్ పెరంబలూరులో తమ శాఖలను ఆరంభించాయి.

విభాగాలు

పెరంబలూరు జిల్లా పరిపాలనా నిర్వహణ కొరకు 3 తాలూకాలుగా విభజించబడింది. అవి వరుసగా పెరంబలూరు, కున్నం, వేపంతట్టై. అదనంగా జిల్లా 4 ఉప విభాలుగా బ్లాకుల పేరుతో విభజించబడింది. పెరంబలూరు, వేపంతట్టై, వేపూరు, ఆలత్తురు. జిల్లాలో 121 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో గ్రామస్వపరిపాలన పద్ధతి భారతీయ పంచాయితీ విధానం అమలు జరుగుతున్నది. అలాగే జిల్లాలో 4 నగర పంచాయితీలు ఒక పురపాలకం ఉన్నాయి. డాక్టర్ . డారెజ్ అహమ్మద్ (ఐ.ఎ.ఎస్, ఎం.బి.బి.ఎస్) పెరంబలూరు జిల్లా కలెక్టరుగా బాధ్యత వహిస్తున్నారు.

గణాంకాలు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,81,738—    
19111,97,214+0.82%
19212,05,343+0.40%
19312,06,731+0.07%
19412,33,200+1.21%
19512,66,569+1.35%
19612,86,739+0.73%
19713,40,306+1.73%
19813,82,499+1.18%
19914,51,032+1.66%
20014,93,646+0.91%
20115,65,223+1.36%
ఆధారం:[5]
మతాల ప్రకారం పెరంబులూరు జిల్లా జనాభా (2011)[6]
మత వివరంశాతం
హిందూ
  
92.29%
ముస్లిం
  
5.79%
క్రిష్టియన్లు|
  
1.82%
మతం అవలంబించనివారు
  
0.10%

2011లో గణాంకాలను అనుసరించి పెరంబలూర్ జిల్లా జనసంఖ్య 564,511,[3] ఇది దాదాపు సోలోమన్ ఐలాండుకు సమానం.[7] అలాగే అమెరికాలోని వయోమింగ్ నగర జనసంఖ్యకు సమానం.[8] 640 భారతదేశ జిల్లాలలో తిరువారూర్ 536వ స్థానంలో ఉంది.[3] జిల్లా జనసాంద్రత చదరపు కిల్లోమీటరుకు 323.[3] 2001-2011 గణాంకాలను అనుసరించి కుటుంబనియంత్రణ శాతం 14.36%.[3] స్త్రీ పురుష నిష్పత్తి 1006:1000.[3] అలాగే అక్షరాస్యత శాతం 74.68%. 2011 అనుసరించి 564,511 జనసంఖ్య -. ఇందులో పురుషుల సంఖ్య 281,436, స్త్రీలసంఖ్య 283,075. 1991 నుండి 2001 జనసంఖ్య పెరుగుదల 9.45% ఉండగా.2001 నుండి 2011కు ఈ సంఖ్య 14.36% పెరిగింది. పెరంబలూరు వైశాల్యం 1,750 చదరపు కిలోమీటర్లు. 2001లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 282 ఉండగా 2011లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 323కు చేరింది. 2001 అక్షరాస్యత శాతం 66.07 2011 అక్షరాస్యత శాతం 74.68 ఉంది. పురుషుల అక్షరాస్యత 83.39%, స్త్రీ అక్షరాస్యత 66.11%. 2001 పురుషుల అక్షరాస్యత 77.89%, స్త్రీ అక్షరాస్యత 54.43%. 2001లో అక్షరాశ్యుల సంఖ్య 286,197. 2011లో పెరంబలూరు మొత్తం అక్షరాశ్యుల సంఖ్య 379,797. పురుషుల అక్షరాస్యత సంఖ్య 210,313, స్త్రీ అక్షరాస్యత సంఖ్య 169,484 .

2001లో 6 సంవత్సరాల కంటే చిన్నవారి సంఖ్య 55,950. 2011లో 6 సంవత్సరాల కంటే చిన్నవారి సంఖ్య 60,478. 2001లో 6 సంవత్సరాల కంటే చిన్నవారిలో బాలాల సంఖ్య 29,245, బాలికల సంఖ్య 26,705. 2011 బాల బాలికల నిష్పత్తి 1000:937 ఉండగా 2011లో బాల బాలికల నిష్పత్తి 1000:913 ఉంది. తమిళనాడు జనసంఖ్యలో పెరంబలూరు జనసంఖ్య 0.78%.

విభాగాలు

పరిపాలనా ప్రయోజనం కోసం జిల్లాను పెరంబలూరు తాలూకా, కున్నం తాలూకా, అలత్తూర్ తాలూకా, వేప్పంతట్టై తాలూకా అనే నాలుగు తాలూకాలుగా, పెరంబలూర్, వేప్పంతట్టై, వేప్పూర్, అలత్తూర్ అనే నాలుగు పంచాయితీ బ్లాకులుగా విభజించారు. జిల్లాలో 121 గ్రామ పంచాయతీలు, నాలుగు పట్టణ పంచాయతీలు (కురుంబలూర్, అరుంబావూరు, పూలంబాడి, లబ్బాయికుడికాడు ), ఒక పురపాలక సంఘం (పెరంబలూరు) ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ