పూజా బేడి

భారతీయ సినీ నటి

పూజా బేడి (జననం 1970 మే 11) ఒక భారతీయ నటి, టెలివిజన్ టాక్ షో హోస్ట్. ఆమె వార్తాపత్రికల కాలమిస్ట్ కూడా. ఆమె రియాలిటీ టెలివిజన్ షోలు ఝలక్ దిఖ్లా జా, నాచ్ బలియే, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్‌లలతో ప్రజాదరణ పొందింది.

పూజా బేడీ
2019లో పూజా బేడీ
జననం (1970-05-11) 1970 మే 11 (వయసు 54)[1]
వృత్తినటి, టెలివిజన్ వ్యాఖ్యాత, రిలేషన్ షిప్ కాలమిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1991–2020
జీవిత భాగస్వామి
ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా
(m. 1994; div. 2003)
పిల్లలు2, అలయ ఎఫ్ తో సహా
తల్లిదండ్రులు

బాల్యం

భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ప్రొతిమా బేడీ, చలనచిత్ర నటుడు కబీర్ బేడీలకు బొంబాయిలో పూజా బేడీ జన్మించింది.[2] ఆమె బోహేమియన్ ప్రగతిశీల కళాత్మక వాతావరణం అని పిలిచే దానిలో పెరిగింది.

కెరీర్

బాలీవుడ్ చిత్రాలలో 1991 నుండి 1995 వరకు పూజా బేడి నటించింది. ఆమె అనేక వాణిజ్య ప్రకటనలు, ప్రచారాలలో కూడా కనిపించింది. ముఖ్యంగా కామసూత్ర కండోమ్ ప్రచారంతో ఆమె అందరికి గుర్తుండిపోయింది. ఈ ప్రకటనను ఆమోదించిన ఆమె ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి కృషి చేసినట్టయింది.[3] ఆమె జగ్ ముంధ్రా చిత్రం విషకన్య (1991)తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె జో జీతా వోహీ సికిందర్ (1992)లో అమీర్ ఖాన్‌తో కలిసి నటించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్థాన్ టైమ్స్, మిడ్ డే వార్తాపత్రికలతో ఆమె కాలమిస్ట్‌గా చేసింది. అలాగే ఎల్'ఆఫీషియల్, ఫెమినా, ది వీక్‌తో సహా అనేక పత్రికలతో వ్యాసాలు రాసింది.[4]

వ్యక్తిగత జీవితం

పూజా బేడీ 1990లో పరిచయం అయిన పార్సీ, ఖోజా సంతతికి చెందిన గుజరాతీ ముస్లిం అయిన ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకుంది. వీరి వివాహం 1994 మే 6న జరిగింది. ఆ తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి నూర్జహాన్ అని పేరు మార్చుకుంది.[5][6][7] వారికి ఇద్దరు సంతానం కుమార్తె అలయా ఫర్నిచర్‌వాలా, కుమారుడు ఒమర్ ఫర్నిచర్‌వాలా. 2003లో పూజా బేడి, ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాలు విడాకులు తీసుకున్నారు.[8] 2019 ఫిబ్రవరిలో తిరిగి ఆమెకు మానెక్ కాంట్రాక్టర్ అనే పార్సీతో నిశ్చితార్థం జరిగింది.[9]

ఫిల్మోగ్రఫీ

YearTitleRoleDirector
1991విషకన్యప్రధాన పాత్రజగ్ ముంద్రా
1992జో జీత వోహి సికందర్సపోర్టింగ్ రోల్మన్సూర్ ఖాన్
1993లూటరేధర్మేష్ దర్శన్
చిట్టెమ్మ మొగుడుమోహన్ బాబుతో కలిసి నటించింది
ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీమహేష్ భట్
1995ఆటంక్ హాయ్ ఆటంక్అతిథిదిలీప్ శంకర్
2011శక్తిఫక్తూనిమెహర్ రమేష్
2020కామెడీ కపుల్జోహ్రానచికేత్ సమంత్

టెలివిజన్

YearShowRole
2006ఝలక్ దిఖ్లా జా 1పోటీదారు
2007నాచ్ బలియే 3
2008బిగ్ బాస్ 2హోస్ట్
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1పోటీదారు
2011మా ఎక్స్ఛేంజ్
బిగ్ బాస్ 5
2020మసాబ మసాబగీతా చోప్రా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ