పుష్యమి నక్షత్రము

  • నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం.
నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
పుష్యమిశనిదేవస్త్రీమేకపిప్పిలిమధ్యనీరుకాకిభృహస్పతికటకం

పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రశరీరశ్రమ
సంపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిధన లాభం
విపత్తారఅశ్విని, మఖ, మూలకార్యహాని
క్షేమ తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢక్షేమం
ప్రత్యక్ తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢప్రయత్న భంగం
సాధన తారరోహిణి, హస్త, శ్రవణంకార్య సిద్ధి, శుభం
నైత్య తారమృగశిర, చిత్త, ధనిష్ఠబంధనం
మిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం
అతిమిత్ర తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రసుఖం, లాభం

పుష్యమి నక్షత్రము

  • 1 వ పాదము - కర్కాటక రాశి
  • 2 వ పాదము - కర్కాటక రాశి.
  • 3 వ పాదము - కర్కాటక రాశి.
  • 4 వ పాదము - కర్కాటక రాశి.

పుష్యమి నక్షత్రము గుణగణలు

పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనమ్ వచ్చిన తరువాత జీవితము అదృష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాతముగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మమ్చి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదాల వలన సమాజంలో అప్రతిష్ఠకు లోనౌతారు. వారి సలహాల వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రమ్గములో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

చిత్ర మాలిక

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ