పంజాబీ వస్త్రధారణ

పురాతన పంజాబు ప్రాంతంలో ప్రజలు పత్తినూలుతో చేసిన వస్త్రాలను ధరించేవారు. స్త్రీపురుషులు ఇరువురు ధరించే పైదుస్తులు మోకాలును తాకుతూ ఉంటాయి. రెండుభుజాను కలుపుతూ స్త్రీలు దుపట్టా అనే వస్త్రాన్ని ధరిస్తుంటారు.స్త్రీపురుషులురువురు నడుంచుట్టూ ఒక వస్త్రాన్ని ధరిస్తుంటారు. తలకు మఫ్లర్ ధరిస్తారు. [1] ఆధునిక పంజాబీ దుస్తులు ఈ శైలిలో తయారు చేయబడుతున్నా. అయినప్పటికీ దీర్ఘకాల చరిత్రలో ఈ దుస్తులు అనేకరూపాంతరాలు చెందాయి.

1890లలో లాహోర్ లోని పంజాబీ వస్త్రధారణ

19-20 శతాబ్ధాలలో పంజాబీ ప్రాంతం నూలు వస్త్రాల ఉత్పత్తి అభివృద్ధి చెందింది. లుంగి, ఖెస్, దతాహి, చద్దర్, కోస్టింగ్, షర్టులు (చొక్కాలు), తెరలు, సిసి, తెహ్మత్, దుర్రీలు, తువ్వాలు, డస్టర్లు, పత్కాలు తయారుచేయబడ్డాయి.ఇవి హోషిపూర్, గుర్‌దాస్‌పూర్, పెషావర్, లాహోర్, ముల్తాన్, [2]అమృతసర్, లూధియానా, ఝంగ్, షహ్పూర్ (పాకిస్థాన్), జలంధర్, ఢిల్లీ, గుర్గావ్ రోహ్తక్, కర్నల్, రెవారి, పానిపట్ నగరాలలో మొదలైనవి ఉత్పత్తి చేయబడుతున్నాయి[3]పంజాబీ దుస్తులకు నేతపరిశ్రమ సంపాన్నతను అధికం చేసింది. దుస్తులు పంజాబీ ప్రజల సంప్రదాయాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.[4][5] వైవిధ్యమైన పంజాబీ పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, వివాహాది సంప్రదాయ వేడుకలో విభిన్నమైన దుస్తులు ధరిస్తుంటారు. వీటితో విభిన్నమైన సంప్రదాయ దుస్తులు ఆభరణాలు సాధారణం.[6][7]

సుథాన్

ప్రాచీన స్వస్థానకు రూపాంతరమైన సుథాన్ ను పంజాబ్ ప్రాంతంలో సుథానా అని కూడా పిలుస్తారు.

[8]

స్వస్థానా అనేది కాళ్లకు వేసుకునే ప్యాంట్ వంటిది. మౌర్యుల కాలం (322–185 బిసి) నుంచే ఈ స్వస్థానా రకపు వస్త్రాలు వాడుకలో ఉన్నాయి.

[9]

ఉత్తర భారతదేశంలో 1-3 శతాబ్దాలలోని కుషాన్ సామ్రాజ్యపు సమయం నుండి వాడుకలో ఉంది.

[10]

4-6 శతాబ్దాల్లోని గుప్త సామ్రాజ్య కాలంలో కూడా స్వస్థాన్ వాడేవారు.

[11]

క్రీ.పూ 7వ శతాబ్దంలో హర్ష రాజు కాలంలో కూడా వాడేవారు.

[12] స్వస్థానా వస్త్రాలకు సరైన రూపాంతరమే ఈ పంజాబీ సుథాన్. ఈ ప్యాంటును ఆడవాళ్ళూ, మగవాళ్ళూ చిన్ని చిన్ని తేడాలతో వాడుతుంటారు. ప్రధానంగా మాత్రం ఆడవాళ్ళు కుర్తా లేదా కుర్తీతో వేసుకుంటారు. పంజాబీ గాగ్రాతో కలిపి కూడా వాడుతుంటారు. చోగా (రోబ్), సుథాన్ ను కలిపి కూడా కట్టుకుంటుంటారు.

కుర్తా

పక్క బొత్తాలతో ఉండే కుర్తాలు 11శతాబ్దం నుంచి ఉన్నట్టుగా చెబుతుంటారు.

[13]

ఉత్తర భారతంలో స్త్రీలు కుర్తకాను ధరిస్తుంటారు. కుర్తకా చిన్న షర్టు మాదిరిగా ఉంటుంది. వీటికి చేతులు మోచేతుల దాకా ఉంటాయి.

[14]

ఆధునిక పంజాబీ కుర్తాలానే ఉంటాయి ఈ కుర్తకాలు. వీటిని ఇప్పటికీ పంజాబ్ ప్రాంతంలో స్త్రీలు అలాగే పురుషులు ధరిస్తుంటారు.

[15] కుర్తా తయారీకి జమా, పంజాబీ అంగర్ఖా ప్రేరణగా ఉంది. కుర్తా సల్వారు, సుథాన్, తెహ్మత్, లుంగి, ధోవతి, పంజాబీ గాగ్రా, జీంస్ దుస్తులతో కలిపి ధరిస్తుంటారు.

ముల్తానా కుర్తీ

పాకిస్థాన్ పంజాబ్ కి చెందిన ముల్తాన్ ప్రాంతానికి చెందిన డిజైన్లతో కుట్టబడిన కుర్తాలను ముల్తానా కుర్తీ అంటారు.[16] స్థానిక అజ్రక్ ప్రింట్లను కూడా వీటి తయారీలో వాడతారు.

పంజాబీ ఫూల్కారీ కుర్తా

పంజాబీప్రాంతంలోని ఫూల్కారీ ఎంబ్రాయిడరీ పనితనంతో పంజాబీ ఫూల్కారీ కుర్తా తయారు చేస్తారు.[17]

పంజాబీ బాంధినీ కుర్తా

పంజాబ్ ప్రాంతంలోని చోలిస్టన్ ఎడారిలో బాంధినీ రకపు అద్దకం చాలా ప్రసిద్ధమైనది.[18] ఈ బాంధినీ ప్రింటులను కుర్తాలపై వాడుతుంటారు.

ముక్తసరీ కుర్తా

పంజాబీ ప్రాంతపు సంప్రదాయ కుర్తాని ముక్తసరీ కుర్తాలంటారు. మోకాలు వరకు ఉండే ఈ కుర్తాలు, [19] పొడవులో చిన్నగా ఉంటాయి.[20] పంజాబ్ లోని ముక్త్ సర్ ప్రాంతంలో తయారు చేసే ఈ కుర్తాలు ఆధునికమైనవి. ఇవి స్లిం ఫిట్ డిజైన్లలో లభిస్తాయి. యువ రాజకీయ నాయకుల్లో ఈ రకపు కుర్తాలు చాలా ప్రసిద్ధం.[21]

సల్వార్ దుస్తులు


పంజాబీ ప్రాంతంలోని మహిళలు ధరించే సంప్రదాయ దుస్తులను సల్వార్ పంజాబీ సూట్ అంటారు. కుర్తా లేక కమీజ్, స్ట్రెయిట్ కట్ సల్వార్ కలిపి పంజాబీ సూట్ అంటారు. 

పంజాబు ప్రాంతంలోని కొంతమంది పురుషులు కూడా పంజాబీ దుస్తులను ధరిస్తుంటారు.ఆఫ్ఘనిస్తాన్, బలూచీ స్థాన్‌లో పంజాబీ దుస్తులను వైవిధ్యమైన రీతిలో తయారు చేస్తారు.[22] అయినప్పటికీ వీటిని పంజాబీ దుస్తులనే వ్యవహరిస్తారు. [23][24] కమీజును స్ట్రెయిట్, ఫ్లాట్ కట్‌తో సైడ్ స్లిట్‌తో తయారు చేస్తారు.[25] (which is a local development as earlier forms of kameez did not have side slits).[26] సల్వార్ పైన వెడల్పుగా ఉండి పాదాల వద్ద బిగుతుగా ఉంటుంది.[27] పంజాబీ సల్వార్ కూడా స్ట్రైట్, గేదరింగ్ ముతకవస్త్రంతో తయారు చేయబడుతుంది. గ్రామీణప్రాంతాలలో పంజాబీ దుస్తులను ఇప్పటికీ సుథాన్ అని అంటారు.[28] భరతదేశంలోని ముంబయి, సింధ్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా పంజాబీ దుస్తులు ప్రాబల్యత సంతరించుకున్నాయి.[29][30][31] ఇవి ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ప్రాబల్యత సంతరించుకున్నాయి.[32] అక్కడ కూడా వీటిని పంజాబీ దుస్తులు అని అంటారు. [33]

పంజాబీ తంబా, కుర్తా

పంజాబీ పంచకట్టుని పంజాబీ తంబా (తెహ్మాట్) లేక లచ్చా అంటారు. తంబా శైలిలో ఒకే రంగుకల అంచులేని పంచలు ఉంటాయి. లచ్చా శైలి పంచలు అంచులు, పలువర్ణాలతో ఉంటాయి.[34]

కుర్తి

ఆధునిక ఉపయోగాలలో షార్ట్ కుర్తాను కుర్తీ అంటున్నారు. అయినప్పటికీ కుర్తీ అనే పదం పైదుస్తులను మాత్రమే వర్తిస్తుంది. ఇది సైడ్ స్లిట్స్ లేకుండా నడుము వరకు ఉంటుంది. ఇది కుర్తీ అనే షార్ట్ పత్తినూలు దుస్తులు పంజాబుప్రాంతంలో క్రీ.పూ 2వ శతాబ్దంలో పాలించిన సుంగా సామ్రాజ్యం పాలనాకాలంలో వాడుకలో ఉందని విశ్వసిస్తున్నారు.[35][36] పొడవు తక్కువగా ఉండే పంజాబీ అంగా శైలి దుస్తులను కూడా పంజాబీ కుర్తీ అంటారు.[37] పంజాబీ కుర్తాను పురుషులు, స్త్రీలు పంజాబీ సుథాన్, గాగ్రాతో ధరిస్తుంటారు.

పతోహర్

పంజాబు (పాకిస్తాన్) ప్రాంతంలో వాడుకలో ఉన్న ఒక విధమైన సల్వార్‌ను పతోహరీ సల్వార్ అంటారు. .[1]ఇది పురాతన శైలి పంజాబీ సిథాన్ మాదిరిగా వెడల్పుగా, కొన్ని మడతలు కలిగి ఉంటుంది. కమీజు కూడా వెడల్పుగా ఉంటుంది. సంప్రదాయమైన హెడ్ స్కార్ఫ్ పెద్దదిగా ఉంటుంది.[38] చాదోర్, ఫూల్కారీలా ఇది పంజాబు ప్రాంతం అంతటా వాడుకలో ఉంది.[1]

చోళా

చోళా అంటే గౌనులా ఉంటుంది. చీలమండలం వరకు ఉండే ఈ దుస్తులను స్త్రీపురుషులు ఇరువురూ ధరిస్తారు.[39] or fall just below the knees. The traditional chola is closed by loops[40] ఇది భుజాలపైన కట్టడానికి అనువుగా ఉంటుంది. దీనికి సైడ్ స్లిట్ ఉండదు. ప్రాంతీయంగా వాడుకలో ఉన్న పైదుస్తులలో చోళా ఒకటి.[41] ఆధునిక చోళా దుస్తులలో గొంతుకు క్రిందగా ఓపెన్, బటన్లు ఉంటాయి. దీనిని కుర్తాలా ధరిస్తుంటారు.[42] హిమాచల ప్రదేశ్‌లో దోరా అనే బెల్ట్ ధరిస్తారు.[43]

చోగా

చోగా పొడవైన చేతులతో ముందు ఓపెన్‌తో నడుము వరకు ఉంటుంది.[44]

పంజాబీ. సుతాన్ సూట్

పంజాబీ సుథాన్ [45], కుర్తా దుస్తులకు దీర్ఘకాల చరిత్ర ఉంది. పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న స్వస్థానా అనే బిగుతైన ట్రౌజర్ల ఆధునిక రూపమే పంజాబీ సుథాన్.[12][46] and was worn with the tunic called varbana[47] ఇది బిగుతుగా ఉంటుంది. పంజాబీ సుథాన్ తయారుచేయడానికి సంప్రదాయవర్ణాల కలయికతో సిల్క్ గడులతో తయారుచేయబడిన సుసీ అనే వస్త్రాలతో తయారుచేయబడుతుంటాయి.[48] 20 గజాల వస్త్రంతో వేలాడే ముడతులతో ఈ దుస్తులు తయారుచేయబడుతుంటాయి.[49] సుథాన్ చీలమండలం వద్ద బిగుతుగా ఉంటుంది.[50][51] సుథాన్ సల్వార్ దుస్తుల కంటే వైవిధ్యంగా ఉంటుంది.[1] కొన్ని విధాలైన పంజాబీ సిథాన్లు మోకాలు కింద నుండి బిగుతుగా ఉంటుంది. హెడ్ కార్ఫ్‌గా ఫూలుకారి, చదోర్, ఆధునిక దుపట్టాలను ధరిస్తుంటారు.

పంజాబీ గాగ్రా

పంజాబీ సూట్ ప్రవేశానికి ముందు గాగ్రా దుస్తులు పంజాబీ మహిళల సంప్రదాయదుస్తులుగా ఉండేవి.ఇది ఇప్పటికీ పంజాబు ప్రాంతంలో వాడుకలో ఉంది. ఇందులో హెడ్ స్కార్ఫ్, కుర్తా (కుర్తీ), సుథాన్ (సల్వార్) ఘాగ్రా ఉంటాయి. గుప్తుల కాలంలో ప్రాబల్యత సంతరించుకున్న గాగ్రా మొట్టమొదటిగా చందతకా ప్రాంతంలో రూపుదిద్దుకున్నది. [52] చందతకా అనే పురుషుల అరనిక్కరు [53] కాలక్రమంలో ఘాగ్రాగా రూపాంతరం చెందింది. దీనికి పైభాగంలో స్త్రీలు, పురుషులు గొంతు నుండి నడుము క్రింద వరకు చొక్కాను ధరిస్తుంటారు.[54][55] 7వ శతాబ్దంలో చందతకా ప్రబలమైన స్త్రీల దుస్తులుగా వాడుకలో ఉంది.[56]

పంజాబీ జుటి

పంజాబీ జుట్టీ అంటే పంజాబులో తయారు చేయబడుతున్న షూ. వీటిలో పాటియాలా వంటి విభిన్న ప్రాంతీయరీతులు ఉంటాయి.[57] పొతారీ షూ, పట్టు ఎంబ్రాయిడరీ చేయబడిన వైవిధ్యమైన షూలు ఉంటాయి.[58]

పాటియాలా సల్వార్

పాటియాలా మహిళల ఆదరాభిమానాలు చూరగొన్న పాటియాలా సల్వార్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి.

సరైకీ సల్వార్ దుస్తులు

పంజాబు వస్త్రధారణలో సరైకీ సల్వార్ దుస్తులు ప్రాధాన్యత వహిస్తాయి. వీటిలో ముల్తానీ సల్వార్, బహవల్పురి సల్వార్ వంటి విభిన్న రీతులు ఉంటాయి.

బహవల్పురి సల్వార్ సూట్

బహవల్పురి సల్వార్ [59] ఇవి మొదటిసారిగా పంజాబు (పాకిస్తాన్) లోని బహవల్పూర్‌లో రూపొందించబడి ఉపయోగంలోకి తీసుకురాబడ్డాయి.బహవల్పూర్ సల్వార్ చాలా వెడల్పుగా వదులుగా [60] పలు మడతలతో తయారు చేయబడి ఉంటాయి.[61] పత్తినూలు, పట్టునూలు మిశ్ర్తితమై బంగారు జతారు గడులతో తయారు చేయబడిన వస్త్రాలను (సుఫీ అంటారు) బహల్పూర్ సల్వారు దుస్తులు రూపొందించబడుతుంటాయి. [62] ఇలాంటి మిశ్రిత వస్త్రాలకు షుజాఖానీ అనే మరోపేరు కూడా ఉంది.[63] బహవల్పూర్ సల్వార్‌తో బహవల్పూర్ కమీజు పంజాబీ కుర్తా (చోళా) ను ధరిస్తుంటారు.[64]

ముల్తానీ సల్వార్ సూట్

దస్త్రం:Arabic women.jpg
ਪੰਜਾਬੀ ਕੁੜਤਾ

ముల్తానీ సల్వార్ (హ్గైరేవాలి లేక సరైకీ ఘైరే వాలి) వాడకం పంజాబు లోని ముల్తానీలో ఆరంభం అయింది. ఇది నడుము చుట్టూ చాలా వెడల్పుగా ఉంటుంది. ఇది సింధీ కంచా సల్వారును పోలి ఉంటుంది. ఇవి రెండూ ఇరాక్లో ధరించే పాంటలూన్ సల్వార్ నుండి రూపొందించబడ్డాయి.[66] సా.శ.. 7వ శతాబ్దంలో ఇవి పంజాబు ప్రాంతంలో ప్రవేశపెట్టబడ్డాయి.[67][68][69] ముల్తానీ సల్వార్ చాలా వెడల్పుగా వదులుగా [70]పంజాబీ సుథాన్ లాగా పూర్తి సైజులో ఉంటుంది.[71] వీటి మీద పంజాబీ ప్రాంతానికి ప్రత్యేకమైన పంజాబీ కమీజు, చోళా దుస్తులను ధరిస్తారు.[72]

ఫాబ్రిక్ అద్దకం, ఎంబ్రాయిడరీ

ప్తాంతీయంగా తయారు చేయబడే వర్ణాలతో ముల్తాన్‌లో నూలు, ఇతర వస్త్రాల మీద చేయబడే అచ్చులతో చేయబడే అద్దకం చాలా ప్రాబల్యత సంతరించుకుంది.[73] దీనిని ముల్తానీ చింట్ అని కూడా అంటారు.[74] చోలిస్తాన్, బహవల్పూర్, ముల్తాన్ లలో టై - డైయింగ్ ఈ ప్రాంతంలో పనితనానికి ప్రసిద్ధి చెందాయి. [75] పంజాబులో చేసే ముల్తానీ కాలాబతన్ ఎంబ్రాయిడరీ [76] దీనిని సన్నని వైరును ఉపయోగించి తయారు చేస్తుంటారు. పంజాబులోని ఇతర ప్రాంతాలలో కూడా ఈ డిజైన్ ప్రసిద్ధి చెందింది. కాలాబతన్ సుర్ఖ్ బంగారు జలతారు ఎర్రని, ఆరంజ్ వర్ణ పట్టువస్త్రాలపై బంగారు జలతారు ఉపయోగించి తయారు చేస్తుంటారు. కాలాబతన్ పని తెల్లని వస్త్రాల మీద వెండి జలతారు ఉపయోగించి తయారు చేస్తుంటారు.బంగారు జలతారు ఉపయోగించి ఖరీదైన చిక్కని డిజైన్ (కార్ చాబ్), తిలా కార్ (కార్ చికెన్) అనే రెండు విధానాలైన వస్త్రాలు తయారు చేస్తుంటారు.కార్ చాబ్ డైజైన్లు కార్పెట్, శాడిల్ వస్త్రాలు తయారీకి వాడుతుంటారు. కార్ చికెన్ పని దుస్తుల తయారీకి ఉపయోగిస్తుంటారు. పంజాబు ప్రాంతంలో ముఖేష్ ఎంబ్రాయిడరీ కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో ముఖేష్ బతీ - హుయీ, ట్విస్టెడ్ టింసెల్, ముఖేష్ గొక్రూ, చిక్కటి డిజైన్ రూపొందించడానికి వెడల్పైన బంగారు జలతారు ఉపయోగిస్తారు.ఇనుప తీగలను ఉపయోగించి ముఖేష్ బతిహుయి పనిచేస్తుంటారు.[77] లూధియానా, అమృతసర్ తెల్లని ఎంబ్రాయిడరీ వస్త్రాలకు ప్రసిద్ధి. బంగారు, వెండి జలతారుతో చేసే ఈ వస్త్రాలతో చోగాలు, ఫతుహి తయారుచేస్తారు.[1] కాంగ్రా రుమాలు తయారీకి ప్రసిద్ధి. వీటిని కాంగ్రా రుమాలు అంటారు. మతసంబంధిత దృశ్యాలతో ఈ రుమాలు తయారు నేయబడుతూ ఉంటుంది.[1] ఈ రుమాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలో కూడా తయారు చేస్తుంటారు.

ఫూల్కారి

పంజాబు ప్రాంతంలో ఫూల్కారీ ఎంబ్రాయిడరీని అధికంగా షాల్, మఫ్లర్ల మీద చేస్తుంటారు.

చౌప్, సుబర్

పెండ్లికుమార్తెలు సాధారణంగా రెండు విధాలైన చౌప్, సుబర్ ధరిస్తుంటారు. చౌప్ ఎంబ్రాయిడరీ వస్త్రానికి రెండివైపులా చేస్తుంటారు. దీనిని వస్త్రానికి నాలుగు అంచులలో చేస్తుంటారు.[1] సుబర్ ఎంబ్రాయిడరీ వస్త్రానికి నాలుగు మూలలు, మధ్యభాగంలో చేస్తుంటారు.[78]

తిల పత్రా

నువ్వుగింజలు చల్లినట్లు ఉండే ఎంబ్రాయిడరీని తిలపత్రా (నువ్వుల ఆకులు) అంటారు.[1] తిలపత్రా అంటే నువ్వు ఆకు అని అర్ధం. [79]

నీలక్

నీలక్ ఫూల్కారీ నీలి, నల్లని నేపథ్యం కలిగిన వస్త్రం మీద పసుపు, ముదురు ఎరుపు దారాలతో సరిగను మిశ్రితం చేసి చేయబడుతుంది.[1]

ఘూంఘట్ బాఘ్

ఘూంఘట్ బాఘ్ ఎంబ్రాయిడరీ మూస్థానం పాకిస్తాన్‌లోని రావల్పిండి. ఘూంఘట్ బాఘ్ ఎంబ్రాయిడరీ పని చిక్కగా చేయబడిన ఉంటుంది. మేలిముసుగు కొరకు వినియోగించే ఈ వస్త్రం తల మీదుగా వేసుకుని ముఖం క్రిందకు లాగుకుంటారు.[1]

చామాస్

రోహ్తక్, గురుగావ్, హిస్సార్, ఢిల్లీలలో చామాస్ ఫూలుకారీ ప్రసిద్ధం. చామాస్ ఫూల్కారీలో అద్దాలను పసుపు, బూడిదరంగు, బ్లూ వర్ణదారాలతో బంధించి తయారు చేస్తారు.[1]

దక్షిణ, నైరుతీ పంజాబు ప్రాంతానికి చెందిన ఫూల్కారి ఆఫ్

దక్షిణ, నైరుతీ పంజాబు ప్రాంతానికి చెందిన ఫూల్కారి జంతువులు, పక్షుల బొమ్మలతో కూడిన ఎంద్రాయిడరీ. ఈ ఎంబ్రాయిడరీని వస్రానికి రెండువైపులా అంచులలో చేస్తారు.[1] ఈ ఎంబ్రాయిడరీ దక్షిణ, నైరుతీ భారతీయ పంజాబు, పాకిస్థానీ ప్రాంతాలలో మొదలైంది.

సెంచి ఫూల్కారి

సెంచి ఫూల్కారీ ఫెరోజ్పూర్ ప్రాంతంలో ప్రాబల్యత సంతరించుకుని ఉంది. సెంచఫూల్కారీ ఎంబ్రాయిడరీలో పక్షులు, ఆభరణాలు (బ్రాస్లెట్లు), చెవికమ్మలు, రింగులు, హారాలు ఉంటాయి.[1]

లౌంచారి

లౌంచారి రెండు భాగాలను కలిపి తయారుచేయబడే పూర్తి సైజు దుస్తులలో ఒకటి. పైభాగాన్ని చోళీ క్రింది భాగం లెహంగా అంటారు.

[80] 

ఇవి హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి.[80]

పంజాబీ ఘుట్టానా

పంజాబీ ప్రాంతంలో పంజాబీ గుట్టానా ప్రాబల్యత సంతరించుకుంది. ఘుట్టానా అంటే పూర్తి సైజు ఫైజమా కంటే పొడవు తక్కువగా బిగుతుగా ఉంటుంది. [81]

వైవిధ్యత కలిగిన ఘుట్టానా ఇప్పటికీ జమ్మూ భూభాగంలో వాడుకలో ఉంది.

చురిదార్ ఫైజామా

ఉత్తరభరతదేశంలో అత్యధికంగా వాడుకలో ఉన్న చురిదార్ సంప్రదాయకంగా ఎప్పుడు మొదలైందో తెలుసుకోవడానికి తగిన కచ్చితమైన ఆధారాలు లభించలేదు. పూర్వపు రాజవంశీకులు చురిదార్ పైజమాను వారి సంప్రదాయదుస్తులలో ఒకటిగా స్వీకరించారు.[83] ఇది పంజాబు ప్రాంతపు సంప్రదాయ దుస్తులైనప్పటికీ సామాన్య ప్రజానీకంలో వీటి వాడకం అధికం. పంజాబులో చురిదార్ స్త్రీపురుషులకు సంప్రదాయదుస్తులుగా ఉన్నాయి.[84] పంజాబు పర్వతప్రాంతాలలో బిగుతుగా ఉండే సుథాన్‌తో చురిదార్ ధరిస్తుంటారు. సంప్రదాయంగా ఫైజమా వదులుగా ఉంటుంది. చురిదార్ ఫైజమా సుథాన్ నుండి రూపొందించబడిందని విశ్వసిస్తున్నారు. ఉపఖండం అంతటా ప్రాబల్యత సంతరించుకున్న చురిదార్ పంజాబులో అభివృద్ధిచేయబడింది.[85][86] చురిదార్ అన్ని వర్ణాలతో తయారుచేయబడుతున్నప్పటికీ సంప్రదాయంగా ఇవి పత్తినూలుతో చేయబడిన నీలివర్ణగడులు, చారలు కలిగిన వస్త్రంతో తయారు చేస్తుంటారు.[87] పూర్తి సైజు గుట్టానా దుస్తులను కూడా చురిదార్ అంటారు.[88] 19వ శతాబ్దంలో సైనికులు లక్నో నుండి బ్రిటిష్ పంజాబు ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వారు పొడవైన గుట్టానా చూసి లక్నోప్రాంతంలో దానిని ప్రవేశపెట్టారు.

జమా

జమా దుస్తులను పంజాబు ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య పాలనలో పురుషులు ధరించారు. వివాహవేడుకలో పెళ్ళిని కుమారుని మేనమామ ధరించే వస్త్రాన్ని జోరాజమా అంటారు. [89] జమా పంజాబీ దుస్తులలో భాగం అయినప్పటికీ వీటిని పెళ్ళి కుమారుడు మాత్రం ధరించడు. ఇందులో భాగంగా ప్రాంతీయశైలిలో జమావార్ అనే గౌను ఉంటుంది.[90][91]

అంగా/అంగరఖా

అంగా లేక అంగరఖా అనబడే ఈ దుస్తులు పొడవుగా శరీరం అంతటా కప్పుతూ భుజం నుండి కాలి వరకు ఉంటాయి.[92][93] and peshwaj) [94] నూలువస్త్రంతో తయారు చేయబడే ఇవి వదులు కోటులా ఉంటాయి.[95] అంగాలను స్త్రీ పురుషులు ఇరువురూ ధరిస్తుంటారు. పురుషులు ధరించే అంగా మోకాలు దిగువకు ఉండి వదులుగా ఉంటాయి.[96] [97] అంగర్కాకు ముందుబటన్లు ఉండవు.[98] సంప్రదాయం అనుసరించి పెళ్ళికుమారులు ధరించే అంగరఖా స్థానంలో ప్రస్తుతం అచ్ఖాన్ చోటు చేసుకుంది. స్త్రీలు ధరించే అంగా కాలి మడమల వరకు పొడవుగా ఉంటుంది.

చంబా అంగర్ఖీ

చంబా జిల్లా అంగర్ఖీ (హిమాచల్ ప్రదేశ్) నడుము వరకు బిగుతుగా ఉండి నడుము నుండి ఆధునిక కాలం స్కర్ట్‌లా వదులుగా ఉంటుంది.అంగర్ఖీ నడుము వద్ద సాష్‌తో బిగుతుగా కట్టబడి ఉంటుంది.[100]

టర్బన్

సంప్రదాయంగా పురుషులు అంగరఖా ధరిస్తుంటారు. బహవల్పూర్ వంటి ప్రాంతాలలో 40 అడుగుల పొడవైన వస్త్రాన్ని తలపాగాగా ధరిస్తుంటారు.[1] ప్రస్తుతం టర్బన్లు వివిధ డిజైన్లలో లభిస్తున్నాయి.

సలూకా

సులుకాను సింధ్, పంజాబు ప్రాంతాలలో ధరిస్తుంటారు.[101] వీటిని ఉత్తరప్రదేశ్ స్త్రీలు కూడా ధరిస్తుంటారు.

ఇవికూడా చూడండి

మూలాలు

మూస:Ethnic Groups of Indiaమూస:Punjab, Pakistanమూస:Punjab, India

మూస:Punjabi clothingమూస:Pakistani clothing

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ