నీమచ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

నీమచ్‌ [1] మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని పట్టణం. ఇది నీమచ్‌ జిల్లా ముఖ్యపట్టణం. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు పట్టణం పక్కగా పోతుంది. పట్టణంలో గ్వాలియర్ సంస్థానం లోని పెద్ద బ్రిటిష్ కంటోన్మెంటు ఉండేది. 1822 లో ఈ పట్టణం సంయుక్త రాజ్‌పుతానా - మాల్వా రాజకీయ ఏజన్సీకి రాజధానిగా ఉండేది. 1895 లో మాళ్వా ఏజెన్సీకి రాజధానిగా మారింది. బ్రిటిష్ కంటోన్మెంటును 1932 లో రద్దు చేసారు. తరువాత దీనిని బ్రిటిష్ మునిసిపల్ బోర్డు నిర్వహించింది. నీమచ్‌ దాదాపు 1: 1 లింగనిష్పత్తి కలిగిన గ్రామం.

నీమచ్
నీమచ్
నీమచ్ is located in Madhya Pradesh
నీమచ్
నీమచ్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°28′35″N 74°52′12″E / 24.476385°N 74.87°E / 24.476385; 74.87
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లానీమచ్
విస్తీర్ణం
 • Total40 కి.మీ2 (20 చ. మై)
Elevation
452 మీ (1,483 అ.)
 • జనసాంద్రత170/కి.మీ2 (400/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
458441
టెలిఫోన్ కోడ్07423
Vehicle registrationMP-44

భౌగోళికం

నీమచ్‌ జిల్లా ఉజ్జయిని విభాగంలో భాగం. ఇది పశ్చిమ, ఉత్తరాల్లో రాజస్థాన్, తూర్పు, దక్షిణాల్లో మంద్‌సౌర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1998 జూన్ 30 న మాండ్‌సౌర్ జిల్లా నుండి విభజించి ఈ జిల్లాను ఏర్పరచారు.

ఈ నగరం మూడు ప్రధాన భాగాలుగా ఉంది: నీమచ్‌ పట్టణం, ఛావనీ, బఘానా.

జనాభా వివరాలు

2011 జనగణన ప్రకారం నీమచ్‌ జనాభా 1,27,000. ఇందులో పురుషులు 53%, స్త్రీలు 47%. నీమచ్‌ అక్షరాస్యత 85%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 62%. నీమచ్‌ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

2011 జనాభా లెక్కల ప్రకారం నీమచ్‌ జిల్లా జనాభాలో 70.31% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 29.69% మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. [2]

నీమచ్ లో మతం
మతంశాతం
హిందూ మతం
  
75%
ఇస్లాం
  
21%
జైన మతం
  
2%
ఇతరాలు†
  
1.50%
క్రైస్తవం
  
.50%
ఇతరాల్లో
సిక్కుమతం (1%), బౌద్ధ మతం (<0.5%) ఉన్నాయి
జనాభా మార్పులు
సంవత్సరం1901191119211931194119511981199120012011
జనాభా6,190 [3]4,9893,9734,3045,1116,41365,800 [4]86,439 [5]112,852128,561

శీతోష్ణస్థితి

నీమచ్‌ మాల్వా ప్రాంతంలో ఉన్న కారణంగా, ఇక్కడి శీతోష్ణస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. మే జూన్లలో గరిష్ట ఉష్ణోగ్రత 46°C కి చేరుకుంటుంది. శీతాకాలంలో, కనిష్ట ఉష్ణోగ్రత 2°C కి చేరుకుంటుంది. నీమచ్‌లో వార్షిక సగటు వర్షపాతం 812 మి.మీ. గరిష్ట వర్షపాతం జూలై, ఆగస్టు నెలలలో సంభవిస్తుంది. అత్యల్ప వర్షపాతం 501.6 మి.మీ. 2007 లో నమోదైంది. గరిష్ట వర్షపాతం 1352 మి.మీ. 2006 లో సంభవించింది. గాలి దిశ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెలలలో నైఋతి నుండి ఉత్తరం వైపుగా ఉంటుంది. మిగిలిన నెలల్లో ఇది ఈశాన్యం నుండి నైరుతి దిశలో ఉంటుంది. [6] [7]

శీతోష్ణస్థితి డేటా - Neemuch (1981–2010, extremes 1901–2008)
నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F)32.8
(91.0)
36.8
(98.2)
41.8
(107.2)
44.6
(112.3)
46.7
(116.1)
46.1
(115.0)
42.2
(108.0)
38.2
(100.8)
39.8
(103.6)
39.4
(102.9)
36.0
(96.8)
32.8
(91.0)
46.7
(116.1)
సగటు అధిక °C (°F)25.0
(77.0)
27.8
(82.0)
33.1
(91.6)
38.0
(100.4)
40.1
(104.2)
37.3
(99.1)
31.8
(89.2)
29.9
(85.8)
32.0
(89.6)
33.9
(93.0)
30.3
(86.5)
26.7
(80.1)
32.2
(90.0)
సగటు అల్ప °C (°F)9.7
(49.5)
12.1
(53.8)
17.1
(62.8)
22.0
(71.6)
25.0
(77.0)
24.9
(76.8)
23.0
(73.4)
22.4
(72.3)
21.6
(70.9)
19.0
(66.2)
14.6
(58.3)
10.7
(51.3)
18.5
(65.3)
అత్యల్ప రికార్డు °C (°F)−1.1
(30.0)
−0.6
(30.9)
4.4
(39.9)
8.9
(48.0)
13.8
(56.8)
15.2
(59.4)
13.3
(55.9)
9.2
(48.6)
15.2
(59.4)
10.6
(51.1)
5.0
(41.0)
0.6
(33.1)
−1.1
(30.0)
సగటు వర్షపాతం mm (inches)2.0
(0.08)
1.0
(0.04)
0.9
(0.04)
1.6
(0.06)
5.4
(0.21)
66.9
(2.63)
202.0
(7.95)
281.0
(11.06)
90.9
(3.58)
16.0
(0.63)
4.1
(0.16)
0.8
(0.03)
672.6
(26.48)
సగటు వర్షపాతపు రోజులు0.20.20.10.20.73.88.510.75.01.00.40.130.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST)40322522264368766540383843
Source: India Meteorological Department[8][9]

రవాణా సౌకర్యాలు

రైలు

నీమచ్‌ అజ్మీర్ - రత్లాం బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్ . నీమచ్‌ రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ వారు 1880 లో నిర్మించారు. దీనికి రత్లాం, నాజ్డా ద్వారా ఉజ్జయినికి, రాజస్థాన్‌లోని కోట, బుంది, చిత్తోర్‌గఢ్ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఇది రత్లం నుండి సుమారు 140 కి.మీ., చిత్తోర్‌గఢ్ నుండి 60 కి.మీ. దూరంలో ఉంది. నీమచ్‌ నుండి జావాద్, సింగోలి, కోట వరకు ప్రత్యేక రైలు మార్గం కోసం ఒక సర్వేను 2014 లో తాత్కాలిక రైలు బడ్జెట్‌లో ఆమోదించారు. [10]

రోడ్డు మార్గాలు

జిల్లా లోని ప్రదేశాల తోను, మధ్యప్రదేశ్ రాష్ట్రం, పొరుగున ఉన్న రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ప్రదేశాల తోనూ పట్టణాన్ని కలిపే రోడ్లతో పాటు, జాతీయ రహదారి 79 కూడా నీమచ్‌ గుండా పోతుంది. జాతీయ రహదారి 79 అజ్మీర్, చిత్తోర్, రత్లామ్‌లతో కలుపుతుంది. రాష్ట్ర రహదారి, పట్టణాన్ని రాజస్థాన్ లోని ఉదయపూర్ తో కలుపుతుంది. జాతీయ రహదారి మినహా, సింగోలి, మానసా వెళ్లే జిల్లా రహదారులను రాష్ట్ర పిడబ్ల్యుడి చూసుకుంటుంది. నగర రహదారులను మునిసిపల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ