నితిన్ బోస్

నితిన్ బోస్ (1897 ఏప్రిల్ 26 - 1986 ఏప్రిల్ 14) భారత చలనచిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్. స్క్రీన్ రైటర్ కూడా. కలకత్తాలో జన్మించిన ఆయన న్యూ థియేటర్స్‌తో కలిసి 1930 - 40 దశకాలలో బెంగాలీ, హిందీ ద్విభాషా చిత్రాలను రూపొందించాడు. ఆ తరువాత బొంబాయికి వెళ్లి బాంబే టాకీస్, ఫిల్మిస్తాన్ బ్యానర్లలో దర్శకత్వం వహించాడు.

నితిన్ బోస్
2013లో భారతదేశం స్టాంపుపై నితిన్ బోస్
జననం(1897-04-26)1897 ఏప్రిల్ 26
దాష్‌నగర్, హౌరా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారతదేశం)
మరణం1986 ఏప్రిల్ 14(1986-04-14) (వయసు 88)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తిచిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1930–1972

ప్లేబ్యాక్ గానం భారతీయ చలనచిత్రాలలో 1935లో నితిన్ బోస్ దర్శకత్వం వహించిన చిత్రాలతో ప్రారంభమైంది. మొదటి సారి బెంగాలీ చిత్రం భాగ్య చక్రలో, అదే సంవత్సరం దాని హిందీ రీమేక్ ధూప్ ఛాన్‌లో

విజయవంతమైంది. ఆ తరువాత గంగా జమునతో ప్లేబ్యాక్ సింగింగ్ అత్యంత ప్రసిద్ధి చెందింది.

జీవితం తొలి దశలో

నితిన్ బోస్ బెంగాలీ పారిశ్రామిక వేత్త హేమేంద్ర మోహన్ బోస్, మృణాళిని కుమారుడు. మృణాళిని సోదరుడు రచయిత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, తండ్రి కవి సుకుమార్ రే కాగా తాత సినీ దర్శకుడు సత్యజిత్ రే. నితిన్ బోస్‌కు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. స్వతహాగా గొప్ప ఫోటోగ్రాఫర్ అయిన అతని తండ్రి తన కొడుకును అదే రంగంలో ప్రోత్సహించాడు.[1]

అవార్డులు

జాతీయ చలనచిత్ర అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

  • ఉత్తమ దర్శకుడు - గంగా జమున (నామినేట్ చేయబడింది)

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ