అక్కినేని నాగ చైతన్య

వికీపీడియా నుండి
(నాగ చైతన్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigationJump to search
అక్కినేని నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య
జననం (1986-11-23) 1986 నవంబరు 23 (వయసు 37)
హైదరాబాద్ భారత దేశం
నివాస ప్రాంతంIndia చెన్నై, భారతదేశం
వృత్తిసినిమా నటుడు
ప్రసిద్ధినటుడు
మతంహిందూ
తండ్రిఅక్కినేని నాగార్జున
తల్లిలక్ష్మి

నాగ చైతన్య (జననం: 1986 నవంబరు 23) నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.

సినీ జీవితం

నాగ చైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్. ఈ సినిమా ద్వారా నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియ, నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన ఏ మాయ చేశావే చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో సుధీర్ వర్మ దర్శకత్వంలో 'దోచేయ్' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2016లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసమే శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017లో రారండోయ్ వేడుక చూద్దాం మళ్ళీ ఘన విజయం సాధించింది. 2018లో విడుదల అయిన శైలజారెడ్డి అల్లుడు విజయం సాధించింది. 2018లో విడుదల అయిన సవ్యసాచి సినిమా ప్లాప్ అయింది. 2019లో సమంత అక్కినేని తో నటించిన మజిలీ చిత్రంతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2019 డిసెంబర్ లో తన మామయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామా సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

హైదరాబాదు లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. పాఠశాలలో చదువుకున్నాడు. తన పాఠశాల బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, నటి అనుష్కకి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు. అయితే, తనతోపాటు 'ఏం మాయ చేసావే', 'మనం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతను 2017, 6 అక్టోబర్ న వివాహం చేసుకున్నాడు. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీగియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.[1]

నాగార్జునతో చైతన్య, అమల

నటించిన చిత్రాలు

సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుభాషగమనికలు
2009జోష్సత్యతెలుగువిజేత, ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నూతన నటుడు
నంది అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు.
2010విణ్ణైతాండి వరువాయాకార్తీక్ తొలి చిత్రం జెస్సిలో కథానాయకుడిగాతమిళంఅతిథి పాత్ర
ఏ మాయ చేసావేకార్తీక్తెలుగుపేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
2011100% లవ్బాలుతెలుగు
దడవిశ్వతెలుగు
బెజవాడశివ కృష్ణతెలుగు
2013ఆటోనగర్ సూర్యసూర్యతెలుగు
తడాఖాకార్తీక్తెలుగుతమిళ చిత్రం వేట్టైకి పునఃనిర్మాణం
మనంనాగార్జునతెలుగు
2014ఒక లైలా కోసంకార్తీక్తెలుగు
2015దోచేయ్చందుతెలుగు
2015కృష్ణమ్మ కలిపింది ఇద్దరినిఅతనిగానేతెలుగుఅతితి పాత్రలో
2015అటాడుకుందంరాఅతనిగానేతెలుగుఅతితి పాత్రలో
2016ప్రేమమ్విక్రంతెలుగు
2016సాహసం శ్వాసగా సాగిపోడి.సి.పి. రజినికాంత్ మురళిధర్తెలుగు
2017రారండోయ్ వేడుక చూద్దాంశివతెలుగు
2017యుద్ధం శరణంఅర్జున్తెలుగు
2018సవ్యసాచితెలుగు
2018శైలజారెడ్డి అల్లుడుతెలుగు
2019వెంకీ మామకెప్టెన్ కార్తీక్ శివరాం వీరమాచినేని/కార్తీక్తెలుగు
2020లవ్ స్టోరీరేవంత్తెలుగు
2022బంగార్రాజుచిన్న బంగార్రాజు[2]
థ్యాంక్యూఅభి[3]
లాల్ సింగ్ చద్దాబుబ్లుహిందీ[4]
2023కస్టడీఏ. శివతమిళ్
తెలుగు
[5]

వెబ్ సిరీస్

సంవత్సరంపేరుపాత్రగమనికలుమూలాలు
2023దూతసాగర్[6]

వంశవృక్షం


మూలాలు


మార్గదర్శకపు మెనూ