దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు, మలయాళ, తమిళ భాషల సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. సెకండ్ షో (2012) అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఆయన రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ (2012) జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోద చిత్రంగా పురస్కారం లభించింది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన వాయై మూడి పేశవుం (2014) తో తమిళ సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ తొలిచిత్ర నటుడు పురస్కారాన్ని రెండుసార్లు 2012లో సెకండ్ షో సినిమాకి మలయాళంలోనూ, 2014లో వాయై మూడి పేశవం సినిమాకి తమిళంలోనూ అందుకున్నారు.[2] 2015లో చార్లీ నటనకు కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాల్లో ఉత్తమ నటుడు అవార్డు పొందారు.

దుల్కర్ సల్మాన్
2013లో 60వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవంలో దుల్కర్ సల్మన్
జననం28 July 1986 (1986-07-28) (age 37)[1]
కొచ్చి, కేరళ, భారతదేశం
విద్యాసంస్థపర్డ్యూ విశ్వవిద్యాలయం
వృత్తిసినిమా నటుడు, నేపథ్య గాయకుడు, వ్యాపారస్తుడు
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅమల్ సూఫియా (వివాహం.2011)
తల్లిదండ్రులుమమ్ముట్టి
సల్ఫాత్

ప్రారంభ జీవితం

దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు మమ్ముట్టి, సల్ఫాత్ లకు జన్మించారు. కొచ్చి, కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పొందారు.[3] చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు.[4][5]

సినీ కెరీర్

దర్శకుడు శ్యాంప్రసాద్ రీతు సినిమాలో దుల్కర్ కు ఓ పాత్ర చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆపైన తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తన తొలి మలయాళం సినిమాలో పాత్ర ఇచ్చారు. ఐతే సల్మాన్ ఆ అవకాశాలను నిరాకరించారు. సినిమాలకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు సినిమాల గురించి స్వల్పకాలపు కోర్సు చేశారు.[3]

2011లో, దుల్కర్ తన స్నేహితుడు శ్రీనాథ్ రాజేంద్రన్ తొలి సినిమా సెకండ్ షోలో నటించేందుకు అంగీకరించారు, ఆ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించారు. సెకండ్ షో సినిమా విజయవంతమై 100 రోజులు పూర్తిచేసుకుంది.[6] రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ 2012లో మలయాళ సినిమా రంగంలో ప్రధానమైన వ్యాణిజ్యపరమైన విజయం పొందడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. సెకండ్ షో సినిమాకి ఉత్తమ తొలిచిత్ర నటునిగా పురస్కారాన్ని పొంది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్రానికి నామినేట్ అయ్యారు.[7][8]

అతని మూడవ చిత్రం తీవ్రం క్రైమ్ థ్రిల్లర్లో భార్య మృతికి కక్ష తీర్చుకునే పాత్రలో నటించారు, ఆ సినిమా 2012 నవంబరు 16. ఇతడు అతిథి పాత్రలో నటించిన మలయాళ సినిమా అన్ మరియ కలిప్పిలను తెలుగులో పిల్ల రాక్షసిగా విడుదలైంది.

దుల్కర్ శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వంలో కురుప్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కేరళలోని సుకుమార కురుప్ అనే నేరస్తుడి జీవిత కథ ఆధారంగా రూపొందించబడినది.[9] మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమా చేస్తున్నారు.[10]

తెలుగులో అనువాదమై సినిమాలు

తెలుగు సినిమాలు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ