దినుకా హెట్టియారాచ్చి

శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెటర్

దినుకా హెట్టియారాచ్చి, శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రాణించాడు. 2001 నుండి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడనప్పటికీ, శ్రీలంక దేశీయ సీజన్‌లలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు. 234 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో సరిగ్గా 1,000 వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీధరన్, రంగనా హెరాత్ తర్వాత మైలురాయిని సాధించిన శ్రీలంక మూడవ బౌలర్ గా రికార్డు సాధించాడు.

దినుకా హెట్టియారాచ్చి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దినుక్ సులక్షణ హెట్టియారాచ్చి
పుట్టిన తేదీJuly 15, 1976 (1976-07-15) (age 47)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 86)2001 మార్చి 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీటెస్ట్ఫస్ట్-క్లాస్లిస్ట్ ఎట్వంటీ20
మ్యాచ్‌లు123413619
చేసిన పరుగులు1,69137751
బ్యాటింగు సగటు9.557.698.50
100లు/50లు0/00/00/0
అత్యుత్తమ స్కోరు48*3325
వేసిన బంతులు16246,4655,991317
వికెట్లు21,00020826
బౌలింగు సగటు20.5023.5419.0811.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు07130
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు01800
అత్యుత్తమ బౌలింగు2/368/266/433/0
క్యాచ్‌లు/స్టంపింగులు0/–55/–15/–1/–
మూలం: ESPNcricinfo, 2017 మార్చి 31

జననం

దినుకా హెట్టియారాచ్చి 1976, జూలై 15న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[2]

దేశీయ క్రికెట్

1995లో తమిళ్ యూనియన్ తరపున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అండర్-13 నుండి అండర్-19 వరకు, సీనియర్ స్థాయివరకు ప్రతి స్థాయిలో క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు, ఇన్వెంటివ్ బ్యాటింగ్ తో కొలంబో కోల్ట్స్‌లో రాణించాడు. అయిన్నప్పటికీ సెలెక్టర్లు హెరాత్, నిరోషన్ బండారతిల్లెకే వైపు మొగ్గు చూపారు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్

1997 శ్రీలంక పర్యటనలో, 1998 దక్షిణాఫ్రికా పర్యటనలో, 1999లో అబుదాబిలో పాకిస్థాన్‌తో జరిగిన ట్రై-సిరీస్‌లో హెట్టియారాచ్చికి అవకాశం లభించింది. జింబాబ్వేతో ఆడిన తరువాత దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడటానికి ఎంపికయ్యాడు. 2001లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో తన ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆడాడు.[4]

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ