దతియా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

దతియా జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం, దతియా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పురాతన పట్టణాన్ని దంతవక్త్రుడు పాలించినట్లుగా మహాభారతంలో ఉంది. ఈ పట్టణం గ్వాలియర్ నుండి 69 కి.మీ, న్యూ ఢిల్లీ నుండి దక్షిణంగా 325 కి.మీ., భోపాల్‌కు ఉత్తరాన 320 కి.మీ. దూరంలో ఉంది. ఝాన్సీ నుండి 34 కి.మీ. ఓర్చా నుండి 52 కి.మీ. దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం గ్వాలియర్ వద్ద ఉంది. ఇది పూర్వం బ్రిటిష్ రాజ్‌లో సంస్థానం. దతియా గ్వాలియర్ సమీపంలో, ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో ఉంది.

దతియా
పట్టణం
రాజ్‌గఢ్ కోట
రాజ్‌గఢ్ కోట
దతియా is located in Madhya Pradesh
దతియా
దతియా
Coordinates: 25°40′N 78°28′E / 25.67°N 78.47°E / 25.67; 78.47
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాదతియా
Elevation
420 మీ (1,380 అ.)
జనాభా
 (2011)
 • Total1,00,466
 • జనసాంద్రత292/కి.మీ2 (760/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
475661
టెలిఫోన్ కోడ్917522
ISO 3166 codeMP-IN
Vehicle registrationMP-32
Websitehttp://datia.nic.in

పాత పట్టణం చుట్టూ రాతి గోడ, అందమైన రాజభవనాలు, తోటలు ఉన్నాయి. 17 వ శతాబ్దపు వీర్ సింగ్ దేవ్ ప్రాసాదం, ఉత్తర భారతదేశంలోని హిందూ నిర్మాణ శైలికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఈ పట్టణం ధాన్యాలు, పత్తి ఉత్పత్తులకు వాణిజ్య కేంద్రంగా ఉంది. చేనేత ఒక ముఖ్యమైన పరిశ్రమ. దతియాలో అనేక ముఖ్యమైన మైలురాళ్ళు ఉన్నాయి. 1614 లో రాజా వీర్ సింగ్ దేవ్ నిర్మించిన ఏడు అంతస్తుల భవనం ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న హిందూ తీర్థయాత్రా స్థలం . పీతాంబర దేవి సిద్ధపీఠం, బగళాముఖి దేవి ఆలయం, గోపేశ్వర్ ఆలయంతో సహా అనేక ఆలయాలు ఉన్నాయి. దతియా ప్రవేశద్వారం వద్ద ఉన్న పీతాంబర పీఠం ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం. ఈ తీర్థయాత్రా స్థలం సుమారు దతియా బస్ స్టేషన్ నుండి 1 కి.మీ., ఢిల్లీ-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న దతియా రైల్వే స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది.

భౌగోళికం

దతియా 25°40′N 78°28′E / 25.67°N 78.47°E / 25.67; 78.47 వద్ద [1] సముద్ర మట్టం నుండి 302 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా వివరాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] దతియా జనాభా 1,00,466. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. దతియా సగటు అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 60%. దతియా జనాభాలో 15% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు