తొట్టెంపూడి వేణు

సినీ నటుడు

తొట్టెంపూడి వేణు ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.[5]

తొట్టెంపూడి వేణు
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వేణు
జననం
తొట్టెంపూడి వేణు

(1976-06-04) 1976 జూన్ 4 (వయసు 48)[1]
ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లువేణు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిఅనుపమా చౌదరి[2]
పిల్లలుఒక కుమార్తె, కుమారుడు[3]
తల్లిదండ్రులు
  • తొట్టెంపూడి సుబ్బారావు (మ. 2024 జనవరి 29)[4] (తండ్రి)

తొట్టెంపూడి వేణు గారు ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం పెరిదేపి గ్రామంలో జన్మించారు. పెరిగింది మాత్రం ఒంగోలు, విజయవాడ, మదురై లో.వేణు తండ్రి కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పూర్తి చేసి అధ్యపకుడిగా విజయవాడ, చెన్నై, మదురైలో పనిచేశారు. మదురై లోని ప్రముఖ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ పొందారు.వేణు సోదరి చిన్నమ్మ గారు, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, ప్రస్తుత టి.ఆర్.ఎస్ నేత నామా నాగేశ్వరరావు సతీమణి.వేణు మదురైలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి కర్ణాటక లోని ధార్వాడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.

స్వయంవరం విజయం తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన వేణు గారు ఎక్కువగా తన సొంత బ్యానర్ ఎస్.పి ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. చిరునవ్వు తో, హనుమాన్ జుంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తరువాత మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.వేణు కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు. వేణు 2013 లో రామాచారి అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా తరువాత బిజినెస్ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. 9 ఏళ్ళ తర్వాత 2022 లో రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు అనే చిత్రంలో నటించాడు.[6]వేణు గారి భార్య అనుపమ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.బి.ఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరమని ఆహ్వానించి న కుటుంబ బాధ్యతలకే తన ప్రాధాన్యత ఇస్తూ వేణు గారి చిత్ర నిర్మాణ సంస్థ ఎస్.పి ఎంటర్టైన్మెంట్స్ కు మార్కెట్ హెడ్ గా పనిచేశారు.[7]

నటించిన సినిమాలు

సంవత్సరంపేరుపాత్రసహ నటులుదర్శకుడుగమనిక
1999స్వయంవరంవేణులయకె. విజయ భాస్కర్నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
2000మనసుపడ్డాను కానీవేణురమ్యకృష్ణ, రాశికె.వీరు
2000చిరునవ్వుతోవేణుషహీన్ ఖాన్జి. రాంప్రసాద్
2001వీడెక్కడి మొగుడండి?వేణుశృతి రాజ్, గీతు మోహన్ దాస్ఇ.వి.వి.సత్యనారాయణ
2000దుర్గప్రతాప్రోజాఆర్.కె. సెల్వమణి
2000పొట్టు అమ్మన్ ప్రతాప్రోజాకె.రాజరత్నం
2001హనుమాన్ జంక్షన్శతృఅర్జున్, జగపతి బాబు, లయ, స్నేహ, విజయ లక్ష్మిఎం.రాజా
2002ప్రియనేస్తమాసూర్యమాళవికఆర్. గణపతి
2002మళ్ళీ మళ్ళీ చూడాలిపవన్జననిపవన్స్ శ్రీధర్
2003కళ్యాణ రాముడుకల్యాణ రాముడుప్రభుదేవా, నిఖితజి. రాంప్రసాద్
2003పెళ్ళాం ఊరెళితేసుబ్బురక్షిత, సంగీత, శ్రీకాంత్ఎస్వీ కృష్ణారెడ్డి
2003పెళ్ళాంతో పనేంటిమధులయ, కల్యాణిఎస్. వి. కృష్ణారెడ్డి
2004ఖుషీ ఖుషీగాశ్రీకుమార్జగపతి బాబు, రమ్యకృష్ణ, నిఖిత, సంగీతజి. రాంప్రసాద్
2004చెప్పవే చిరుగాలివేణుఆషిమా భల్లా, అభిరామివిక్రమన్
2005సదా మీ సేవలోతిలక్శ్రీయనీలకంఠ
2006ఇల్లాలు ప్రియురాలువేణుదివ్య ఉన్నిభాను శంకర్
2006శ్రీకృష్ణ 2006వెంకటేశ్వర్లుగౌరి ముంజల్, శ్రీకాంత్విజయేంద్ర ప్రసాద్
2007బహుమతివెంకటరమణసంగీతఎస్వీ కృష్ణారెడ్డి
2007అల్లరే అల్లరిఆనంద్అల్లరి నరేష్, పార్వతి మెల్టన్ముప్పలనేని శివ
2007యమగోల మళ్ళీ మొదలైందిజూనియర్ చిత్రగుప్తశ్రీకాంత్, మీరా జాస్మిన్, రీమా సేన్శ్రీనివాస రెడ్డి
2008దీపావళివేణుఆర్తి అగర్వాల్, మేఘ నాయర్హరిబాబు
2008చింతకాయల రవిరవి స్నేహితుడువెంకటేష్, అనుష్కయోగి
2009గోపి గోపిక గోదావరిగోపికమలినీ ముఖర్జీవంశీ
2011మాయగాడులీలాకృష్ణచార్మిదిలీప్ పోలన్
2012దమ్ముఎన్టీఆర్ బావఎన్టీఆర్, త్రిష, కార్తీకబోయపాటి శ్రీను
2012రామాచారిరామాచారికమలినీ ముఖర్జీ, ఆలీ, రఘు బాబుఈశ్వర్
2021రామారావు ఆన్‌ డ్యూటీ

వెబ్​ సిరీస్‌

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ