తొట్టిగ్యాంగ్

2002 లో విడుదలైన తెలుగు చలనచిత్రం

తొట్టిగ్యాంగ్ 2002, డిసెంబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, అల్లరి నరేష్,[1] సునీల్, అనిత, గజాలా[2] నాయికానాయకులుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

తొట్టిగ్యాంగ్
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనఇ.వి.వి. సత్యనారాయణ
నిర్మాతఇ.వి.వి. సత్యనారాయణ
తారాగణంప్రభు దేవా
అల్లరి నరేష్
సునీల్
అనిత
గజాలా
ఛాయాగ్రహణంలోగనాథం శ్రీనివాసన్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
ఇవివి సినిమా
విడుదల తేదీ
డిసెంబరు 6, 2002
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

నరేష్‌, ప్రభుదేవా, సునీల్‌ ఒక తొట్టిగ్యాంగ్‌. శవాలను తరలించడం, కుక్కలను పట్టుకోవడం వీరి పని. గజాలాను చూడగానే ప్రభుదేవా ప్రేమిస్తాడు. కానీ గజాలా ఛీ కొడుతుంది. నరేష్‌ మంచితనం చూసి ఆమె అతన్ని ప్రేమిస్తుంది. చిన్నప్పుడు తను ప్రేమించిన వెంకటలక్ష్మిని తప్ప ఎవర్నీ ప్రేమించలేనని నరేష్‌ చెప్పుతాడు. గజాలా వెంటనే ఓ కథ అల్లి, వెంకటలక్ష్మికి ఇప్పటికే పెళ్ళి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పుతుంది. దీంతో స్నేహితులిద్దరిని వదిలేసి గజాలాతో సింగుతుంటాడు. ఫ్రెండ్‌ను దూరం చేసిన గజాలాపై కక్ష సాధించేందుకు ప్రభుదేవా, సునీల్‌లు ప్లాన్‌ వేస్తారు. ఈలోపు వారికి వెంకటలక్ష్మి (అనిత) పరిచయమవుతుంది. సొంత బావ తనను 'పూజకు పనికి రాని పువ్వు'గా చేయడంతో వెంకటలక్ష్మి సన్యాసిగా మారాలని నిశ్చయించుకుంటుంది. కానీ ఈ పువ్వును నరేష్‌ చెవ్విలో పెడుతామని శపథం చేసి గజాలాను కిడ్నాప్‌ చేస్తారు. ఇక గజాలా వీరిని ముప్పుతిప్పలు పెట్టి నరేష్‌కు దగ్గరవుతుంది, అనితను నరేష్‌ పెళ్ళిచేసుకుంటాడా లేదా అనేది మిగతా కథ.

నటవర్గం

పాటలు

పాటపేరుగాయకులునిడివి
నువ్వే కావాలిఎస్. పి. చరణ్, సుమంగళి04:28
ఓ ఓ సోదరారంజిత్05:26
వెచ్చని వెచ్చని దేహంరాజేష్, కె. ఎస్. చిత్ర05:22
ఓరినాయనోసాందీప్, కల్పన05:15
గుండెల్లో నువ్వేదేవిశ్రీ ప్రసాద్, ఫెబి05:23
కన్నెపిల్ల అరె కన్నెపిల్లకార్తిక్, మాతంగి జగదీష్05:28

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ