తెలుగు సినిమా

భారత దేశం లో తెలుగు భాషా చిత్రాలు
(తెలుగు సినిమాలు నుండి దారిమార్పు చెందింది)

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. కోస్తాంధ్రలో ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు.[1]

తెలుగు సినిమా పితామహుడు - రఘుపతి వెంకయ్య నాయుడు
భారతీయ సినిమా
వెండితెర సందడి
తెలుగు సినిమా
• తెలుగు సినిమా వసూళ్లు
• చరిత్ర
• వ్యక్తులు
• సంభాషణలు
• బిరుదులు
• రికార్డులు
• సినిమా
• భారతీయ సినిమా
ప్రాజెక్టు పేజి

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం, తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక చిహ్నమైన లేపాక్షి నంది ని స్ఫూర్తిగా తీసుకొనబడింది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్ర్ం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్ లో 1953 మార్చి 14 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలింని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006, 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.

చరిత్ర

(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా చరిత్ర)

1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగు (భక్త ప్రహ్లాద), తమిళ (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథిహెచ్.ఎమ్.రెడ్డి. సురభి నాటక సమాజం వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.[3]

1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా భక్త ప్రహ్లాదతో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.

ఈ కాలంలో ప్రతిభను కనపరచిన దర్శకులలో కొందరు సి.పుల్లయ్య (లవకుశ), సిహెచ్.నరసింహారావు (సీతా కళ్యాణం), హెచ్.వి.బాబు (కనకతార), పి.పుల్లయ్య (తిరుపతి వెంకటేశ్వర మహాత్మ్యం), సిహెచ్.నారాయణమూర్తి (మార్కండేయ).

వాణిజ్య వైఖరి

(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా వసూళ్లు)

వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చింది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ ఉంది. 1992లో చిరంజీవి నటించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన ఘరానా మొగుడు బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా నిలచింది..

పరిశ్రమ

మూలా నారాయణస్వామి, బి.నాగిరెడ్డిలు 1948 లో చెన్నై కేంద్రంగా విజయ వాహినీ స్టూడియోస్ స్థాపించారు. భక్తప్రహ్లాద (సినిమా)తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఎల్.వి.ప్రసాద్ కుడా చెన్నై యే కేంద్రంగా 1956 లో ప్రసాద్ స్టూడియోస్‌ని స్థాపించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమని, నందమూరి తారక రామారావు హయాంలో చెన్నై నుండి హైదరాబాదుకు తరలించటంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు.

అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాదు చేరి, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. దగ్గుబాటి రామానాయుడు, రామోజీరావు లచే నిర్మించబడ్డ ఫిలిం స్టూడియోలు విరివిగా సినీ నిర్మాణం చేయటంతో బాటు పలువురికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పలు తెలుగు చిత్రాలు హిందీ, తమిళం లలో పునర్నిర్మించబడ్డట్టే, పలు హిందీ, తమిళ, మలయాళ చిత్రాలు తెలుగులో పునర్నిర్మింపబడ్డాయి. అయితే కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు నేరుగా అనువదించబడటమే కాక ఆయా భాషలలో కంటే తెలుగులోనే అధిక విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి.

భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.

సదరన్ డిజిటల్ స్క్రీన్స్ చే మార్కెటింగ్ చేయబడే యూ ఎఫ్ ఓ మూవీస్ అనే డిజిటల్ సినిమా నెట్వర్క్ సంస్థ చాలా మటుకు తెలుగు సినిమాలని డిజిటైజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ శిక్షణా సంస్థ, రామానాయుడు ఫిలిం స్కూల్, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా లు భారతదేశంలోనే అతిపెద్ద శిక్షణా కేంద్రాలు.

గణాంకాలు

2006 లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం.

2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విడుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.

2004 వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.

టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబంధించిన చార్టు మిలియన్ రూపాయిలలో :

సం.టాలీవుడ్ బాక్సాఫీస్
1980819
19851,526
19903,333
19957,985
200014,011
200523,044

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 1 శాతం తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చింది.

కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం

తమిళ చలనచిత్ర పరిశ్రమ కోలీవుడ్ అని పేరు పొందినది. యాభై, అరవై దశకంలో స్టూడియోలు మద్రాసు మహానగరంలో వుండటం వలన తెలుగు, తమిళ సినిమాకి మంచి సంబంధం ఉంది. నేటికి అనేక తెలుగు చలనచిత్రాలు తమిళంలో, తమిళ చలనచిత్రాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం మామూలూ. అలాగే తెలుగు తారలు తమిళంలో నటించటం తమిళ తారలు తెలుగులో నటించడం సహజం. తారలు త్రిష, ఇలియానా 123 లక్షల వరకు; శ్రియ, జెనీలియా, సదా, భూమిక చావ్లా, ఛార్మి (వీళ్ళంతా ముంబాయికి సంబంధించిన వాళ్ళు) 150 నుండి 160 లక్షల వరకు తీసుకుంటారు. నయన తార, ఆసిన్, అనుష్క వంటి వారు నటించే రోజులు బట్టి 130 నుండి 140 లక్షల వరకు తీసుకుంటారు.

టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు. తెలుగువాడైన విద్యాసాగర్ కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, శంకర్ వంటి దర్శకులు, ఎ.ఎమ్.రత్నం వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.

ఒక పక్క టాలీవుడ్ కోలీవుడ్ మధ్య కొన్ని దశకాలుగా సంబంధం వున్నటైతే టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వున్నా సంబంధం మొన్న మొన్నటిదిగా లెక్క వెయ్య వచ్చు. ఎనభై దశకాల దాకా టాలీవుడ్లో హిట్ అయ్యిన హిందీ చిత్రాలను తెలుగులో రిమేక్ చెయ్యడం దాకానే పరిమితమైనది. తొంభై దశకంలో తెలుగు రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున ఖుదా గవః, క్రిమినల్ లాంటి హిట్ చిత్రాలలో నటించారు. క్రితం పదేళ్లుగా హిందీ అభినేత్రులు తెలుగు సినిమాలో నటించడం మామూలూ అయ్యింది. అంజల జావేరీ, కత్రినా కైఫ్ వంటి అభినేత్రులు తెలుగులో నటించారు. అలాగే తెలుగు సినీఘనత ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రo రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి.

ప్రత్యేకతలు

(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా ప్రత్యేకతలు)

నిర్మాణ వ్యయం

తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాధారణంగా ఒక్కో సినిమాకు 7 నుండి 40 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి 12 నుండి 60 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే 60 నుండి 90 కోట్ల వరకు వ్యాపారం జరగోచ్చు.

అభిమానులు

ప్రముఖ టాలీవుడ్ నటీనటులందరికీ దక్షిణ భారతదేశంలో అభిమానులున్నారు.

విశేషాలు

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెరవలి గ్రామంలో సినిమా హాలు

సంవత్సరాల వారిగా విడుదలైన సినిమాల సంఖ్య

సంవత్సరముడైరెక్ట్‌ చిత్రాలుడబ్బింగ్‌ చిత్రాలుమొత్తము
193111
193222
193355
193433
193577
19361212
19371010
19381010
19391212
19401414
19411515
194288
194366
194466
194555
19461010
194766
194877
194977
195017219
195122123
195225126
195324428
19543030
195519322
195621526
195727734
1958201232
1959251641
1960381553
1961262955
1962262046
1963271340
1964261339
1965321850
1966333063
1967451964
1968572077
1969441155
1970591776
1971652085
1972561571
1973611071
1974601070
1975591372
1976642286
1977711687
1978811495
19799526121
198011324137
19819826124
19828847135
198310432136
198411751168
198511469183
198612244166
198712132153
198811028138
19898958147
19907690166
19919947146
199210742149
19938849137
19948474158
19957962141
19966473137
19977948127
19987745122
19996582147
200014340183
200120683289
2002114
20039526121
200412157178
200512962191
200611088198
మొత్తము**338315054888

** ఈ మొత్తాలు 2000 సంవత్సరము వరకే కూడినవి.

వీటిని చూడండి

ప్రధాని ప్రశంస

తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు చిత్ర పరిశ్రమను ప్రశంసించారు. 2022 ఫిబ్రవరి 5న హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. [5][6]

మూలాలు

వనరులు

బయటి లింకులు


తెలుగు సినిమాలు
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |
తెలుగు సినిమాలుసినిమా
1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983 | 1984 | 1985 | 1986 | 1987 | 1988 | 1989 | 1990 | 1991 | 1992 | 1993 | 1994 | 1995 | 1996 | 1997 | 1998 | 1999 | 2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011 | 2012 | 2013 | 2014|2015| 2016 | 2017|2018 | 2019 | 2020|2021|2022|2023|2024|2025|2026|2027|2028|2029|2030 |
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ