తుపాక్ షకుర్

తుపాక్ అమరు షకుర్ (ఆంగ్లం:Tupac Amaru Shakur; 1971 జూన్ 16 - 1996 సెప్టెంబరు 13) అమెరికన్ రాపర్. ఆయన ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన రాపర్లలో ఒకడిగా పరిగణించబడతాడు.[1][2] ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్లకు పైగా రికార్డ్‌లను విక్రయించిన సంగీత కళాకారులలో ఆయన ఒకడు. ఆయన తన సంగీతంతో సమకాలీన సామాజిక సమస్యలను పరిష్కరించడం, అసమానతకు వ్యతిరేకంగా క్రియాశీలతకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఆయనను 2పాక్, మకవేలి అని కూడా పిలుస్తారు.

తుపాక్ షకుర్
జననం
లిసానె పారిష్ క్రూక్స్

(1971-06-16)1971 జూన్ 16
న్యూయార్క్, అమెరికా
మరణం1996 సెప్టెంబరు 13(1996-09-13) (వయసు 25)
లాస్ వెగాస్, నెవాడా, అమెరికా
మరణ కారణంహత్య
ఇతర పేర్లు
  • 2Pac
  • Pac
  • 2Pacalypse
  • Makaveli
  • MC New York
వృత్తి
  • రాపర్
  • పాటల రచయిత
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు1989–1996
జీవిత భాగస్వామి
కైషా మోరిస్
(m. 1995; ann. 1996)
తల్లిదండ్రులు
  • అఫెని షకుర్
  • బిల్లీ గార్లాండ్
బంధువులు
  • ముతులు షకుర్ (సవతి తండ్రి)
  • అస్సత షకుర్ (సవతి అత్త)
  • మోప్రేమ్ షకుర్ (సవతి సోదరుడు)
  • కాస్ట్రో (బంధువు)
సంతకం

ఆయన న్యూయార్క్ నగరంలో బ్లాక్ పాంథర్ పార్టీ సభ్యులైన తల్లిదండ్రులకు జన్మించాడు. తల్లి అఫెని షకుర్ వద్ద పెరిగిన ఆయన 1984లో బాల్టిమోర్‌కు, 1988లో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మకాం మార్చాడు. 1991లో తన తొలి ఆల్బం 2పాకాలిప్స్ నౌ(2Pacalypse Now) విడుదల చేసాడు. ఆయన రాప్ తో వెస్ట్ కోస్ట్ హిప్ హాప్‌లో ప్రధాన వ్యక్తిగా మారాడు.[3][4] ఆ తరువాత ఆల్బమ్‌లు స్ట్రిక్ట్లీ 4 మై N.I.G.G.A.Z... (1993), మీ ఎగైనెస్ట్ ది వరల్డ్ (1995)లతో ఆయన మరింత విమర్శనాత్మక, వాణిజ్య విజయాన్ని సాధించాడు.[5] ఆయన డైమండ్ సర్టిఫైడ్ ఆల్బమ్ ఆల్ ఐజ్ ఆన్ మి (1996), హిప్-హాప్ చరిత్రలో మొదటి డబుల్-లెంగ్త్ ఆల్బమ్.[6]

ఆయన తన సంగీత వృత్తితో పాటు, జ్యూస్ (1992), పొయెటిక్ జస్టిస్ (1993), ఎబోవ్ ది రిమ్ (1994), బుల్లెట్ (1996), గ్రిడ్‌లాక్డ్ (1997), గ్యాంగ్ రిలేటెడ్ (1997) చిత్రాలలో నటుడిగా కూడా ప్రసిద్ధిచెందాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ