తిరువల్లవాయ్

తిరువల్లవాయ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువల్లవాయ్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నారాయణన్(నావాయ్ ముకుందన్)
ప్రధాన దేవత:మలర్ మంగై తాయార్
దిశ, స్థానం:దక్షిణ ముఖము
పుష్కరిణి:శెంగమల పుష్కరిణి
విమానం:వేద విమానం
కవులు:భంగిమనమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:లక్ష్మీదేవికి గజేంద్రునకు

విశేషాలు

మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై "ఆసృశంస్యము" అనే గుణమును ప్రకాశింపజేసిరి.

సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దు:ఖ సముద్రమును దాటించు నావవంటివాడు ఈస్వామి "ఆవానడి యానివనెన్నరుళాయే" వీడు నా దాసుడని నన్ను దయజూడుమా! అని ఆసృశంస్య గుణమును (9-8-7) ప్రకాశింపజేసిరి.

పేరువెనుక చరిత్ర

ఇచట "నవాయుఱైకిన్ఱ" "నావగా వసించుచున్నట్టివాడు" అని పేర్కొనుటచే ఈ దేశమునకును తిరునావాయ్ అను నామము వచ్చింది.

సాహిత్యం

శ్లో. శ్రీమచ్చెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే
   నావాయ్ నామని వేద మందిర వరే యా మ్యాఅసనాలంకృత:
   లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
   త్యాస్తే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేణ నారాయణ:||

పాశురాలు

పా. కోవాగియ;మావలియై నిలజ్కొణ్డాయ్
    తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే!
    నావా యుఱైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
    ఆవా వడియా నివ నెన్ఱరుళాయే.
        నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-8-7.

వివరాలు

ప్రధాన దైవం పేరుప్రధాన దేవి పేరుతీర్థంముఖద్వార దిశభంగిమకీర్తించిన వారువిమానంప్రత్యక్షం
నారాయణన్ (నావాయ్ ముకుందన్) -మలర్ మంగై తాయార్శెంగమల పుష్కరిణిదక్షిణ ముఖముకూర్చున్నసేవ భంగిమనమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్వేద విమానంలక్ష్మీదేవికి గజేంద్రునకు

చేరే మార్గం

షోరానూర్ నుండి కళ్లికోట పోవు మార్గములో గల "ఎడకోలమ్" నకు 1 కి.మీ. దూరమున గలదు. షోరానూర్ నుండి బస్‌లో కుట్టీపురంచేరి అక్కడ నుండి వేరుబస్సులోను చేరవచ్చును. వసతులు స్వల్పము

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ