తారే జమీన్ పర్

హిందీ సినిమా

తారే జమీన్ పర్ (హిందీ: तारे ज़मीन पर; తెలుగు అధికారిక పేరు: నేల మీద తారలు[2]) 2007లో విడుదలై పేరుగాంచిన చిత్రం. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థయైన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర కథాంశం ముందుగా రచయిత, సృజనాత్మక దర్శకుడు అయిన అమోల్ గుప్తే, ఆయన భార్య దీపా భాటియా ఆలోచనల్లో రూపుదిద్దుకుంది.[3] శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రసూన్ జోషి పాటల రాశాడు. చిత్రంలో కనిపించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ టాటా ఎలెక్సి లిమిటెడ్ సంస్థకు చెందిన విజువల్ కంప్యూటింగ్ లాబ్స్, 2D యానిమేషన్ వైభవ్ స్టూడియోలు రూపొందించాయి.[4][5] ధీమంత్ వ్యాస్ శీర్షిక యానిమేషన్ లో పాలుపంచుకున్నాడు.[6][7] తారే జమీన్ పర్ ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్ళలో 2007 డిసెంబరు 21న విడుదలైనది. భారతీయ తర్జుమా DVD ముంబాయిలో 2008 జూలై 25న విడుదలైనది. లైక్ స్టార్స్ ఆన్ ఎర్త్ అనే పేరుతో ఒక అంతర్జాతీయ ప్రచురణ DVD 2010 జనవరి 12న విడుదలైంది.[2] వాల్ట్ డిస్నీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్తర అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలలో పంపిణీ చేయడానికి హోమ్ వీడియో హక్కులను కొనుగోలు చేసింది. ఒక అంతర్జాతీయ స్టూడియో భారతీయ చిత్రం వీడియో హక్కులను కొనుగోలుచేసింది ఇదే ప్రథమం.[8]

తారే జమీన్ పర్
తారే జమీన్ పర్ పోస్టర్
దర్శకత్వంఆమిర్ ఖాన్
అమోల్ గుప్తే
రచనఅమోల్ గుప్తే
నిర్మాతఆమిర్ ఖాన్
కిరణ్ రావు
తారాగణందార్శీల్ సఫారీ
ఆమిర్ ఖాన్
టిస్కా చోప్రా
విపిన్ శర్మ
ఛాయాగ్రహణంసేతు
కూర్పుదీపా భాటియా
సంగీతంశంకర్-ఎహసాన్-లాయ్
పంపిణీదార్లుఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
యూటీవీ సాఫ్ట్‌వేర్ కమ్యూనికేషన్స్
వాల్ట్ డిస్నీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీ
డిసెంబరు 21, 2007
సినిమా నిడివి
165 నిమిషాలు.
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్12 కోట్ల రూపాయలు
బాక్సాఫీసు131 కోట్ల రూపాయలు[1]

ఈ చిత్రం ఎనిమిదేళ్ళ బాలుడు ఇషాన్ (దార్శీల్ సఫారీ) కథను చెప్తుంది. ఒక అధ్యాపకుడు (అమీర్ ఖాన్) అతనికి డిస్లెక్సియా (ఒక రకమైన మానసిక సమస్య) ఉందని గుర్తించేదాకా అతను విపరీతంగా బాధపడతాడు. ఈ సినిమా వ్యాపారపరంగానే కాక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది.[9]తారే జమీన్ పర్ 2008లో ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు సాధించింది. అదే సంవత్సరంలో ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.[10] ఢిల్లీ ప్రభుత్వం దీనికి పన్ను మినహాయింపు ప్రకటించింది.[11] గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు కూడా పొందింది.[1]

కథావస్తువు

ఇషాన్ నందకిషోర్ అవస్థి (దార్శీల్ సఫారీ) అనబడే ఎనిమిది సంవత్సరాల బాలుడికి పాఠశాల అంటే అయిష్టం. ప్రతి పాఠ్యాంశం అతనికి కష్టమైనదే. పరీక్షలలో నిరంతరం విఫలమవుతూ ఉంటాడు. అతనికి చలన సమన్వయ నైపుణ్యాలలో కూడా లోపం ఉండటంవల్ల బంతిని తిన్నగా వేయడానికి కూడా చాలా కష్టపడతాడు. అతని అధ్యాపకులు, తోటి విద్యార్థులు అతనికి సహాయం చేయకపోగా, ఎప్పుడూ బహిరంగంగా అవమానపరుస్తూ ఉంటారు. అదేసమయంలో ఇషాన్ అంతర్గత ఊహా ప్రపంచం అద్భుతాలతో కూడి ఉంటుంది. అది ఎవ్వరూ గుర్తించినట్టూ, మెచ్చుకున్నట్టూ కనిపించదు. అది ఇంద్రజాలమైన నేలల రంగులు, చేతనాయుతమైన జంతువులతో కూడి ఉంటుంది. ఆరంభంలో ఎవరూ తెలుసుకోలేక పోయినప్పటికీ, అతను చిత్రకళలో అభిరుచి కలిగి ఉంటాడు.

ఇంట్లో పరిస్థితి కూడా అంతకన్నా ఏమీ బాగుండదు. అతని తండ్రి, నంద కిషోర్ అవస్థి (విపిన్ శర్మ) కార్యదీక్ష గల అధికారి. ఇతను తన కొడుకుల వద్దనుంచి ఉన్నతమైన ఫలితాలను ఆశిస్తూ ఉంటాడు. అతని తల్లి, మాయా అవస్థి (టిస్కా చోప్రా) ఒక గృహిణి. ఇషాన్ ఉత్తీర్ణుడు కావడానికి సహాయం చేయలేక ఆమె తన అసమర్ధతతో నిరంతరం విసిగిపోతూవుంది. ఇషాన్ అన్నయ్య యెహాన్ (సాచెట్ ఇంజనీర్) ఒక విజయవంతమైన విద్యార్థి/క్రీడాకారుడు. ఈ విషయాన్నిఅతని తల్లిదండ్రులు ఎప్పుడూ ఇషాన్ కు గుర్తుచేస్తూ ఉంటారు . ఇషాన్ బడికి వెళ్ళడం లేదని కనుగొన్నతర్వాత, దానికి తోడు చాలా తక్కువ మార్కుల శ్రేణిని పొందాడని తెలిసిన తర్వాత, అతని తల్లితండ్రులు అతను "క్రమశిక్షణ"లో పెట్టడానికి బోర్డింగ్ స్కూలులో ఉంచడం అవసరమని నిశ్చయించుకుంటారు.

ఉత్తమ విద్యార్ధులలో ఒకడైన రాజన్ దామోదరన్ (తనయ్ చెడ్డా) నుంచి సహాయం పొందినప్పటికీ బోర్డింగ్ స్కూలు జీవితం ఇషాన్ని ప్రయోజకుణ్ణి చేయటానికి సహాయపడదు. అసలే కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి రావడం వలన అతను నిరంతరం భయం, వ్యాకులంలో మునిగిపోతాడు. అయినప్పటికీ, కొత్తగా తాత్కాలికంగా వచ్చిన చిత్రలేఖన అధ్యాపకుడు రామ్ శంకర్ నికుంభ్ లేదా "నికుంభ్ సర్" (అమీర్ ఖాన్) ఇషాన్ బోర్డింగ్ పాఠశాలలో నియామకం పొందడంతో పరిస్థితులు మారిపోతాయి. నికుంభ్, తనకన్నా ముందున్న వారిలాగా కఠినంగా కాకుండా ప్రత్యేకశైలిలో బోధించటంవల్ల, త్వరగా విద్యార్థుల అభిమానం చూరగొంటాడు. ఇషాన్ సంతోషంగా లేడని, తరగతి కార్యకలాపాలలో అతను పాలుపంచుకోవటం లేదని ఇతను గమనించటం ఆరంభిస్తాడు (విద్యార్థులు ఉత్సాహంగా భాగం పంచుకునే వాతావరణం తరగతి గదిలో ఏర్పరిచినప్పటికీ). కలత చెందిన నికుంభ్, ఇషాన్ గతంలో చేసిన పనిని పరిశీలిస్తాడు. అతని వైఫల్యానికి కారణం డిస్లెక్సియా అనే మానసిక సమస్యగా గుర్తిస్తాడు.

తారే జమీన్ పర్ యొక్క ప్రోత్సాహక సమావేశంలో అమీర్ ఖాన్.

అతని సెలవుదినం రోజు, నికుంభ్ ఇషాన్ తల్లితండ్రుల దగ్గరకు వెళతాడు. అతని పనిని నిశితంగా పరిశీలించాలని అడుగుతాడు. నిషాన్ చిత్రాల యొక్క సంక్లిష్టతను చూసి అతను నిశ్చేష్టుడౌతాడు. ఇషాన్ చాలా తెలివిగల విద్యార్థి అని అతను తరగతిలోని మిగిలిన విద్యార్థులకన్నా విభిన్నంగా వ్యవహరిస్తాడని నికుంబ్ ఇషాన్ తల్లితండ్రులకు చెబుతాడు. అతను డిస్లెక్సియా గురించి వారికి వివరిస్తాడు. ఇది ఒక నరాలసంబంధిత పరిస్థితే కానీ తక్కువ తెలివితేటలకు చిహ్నంకాదని విశదీకరిస్తాడు. ఇషాన్ ఉత్తీర్ణుడు కావటానికి సహాయపడే అధిక శిక్షణ అతను అందించవచ్చని కూడా వారితో చెప్తాడు. ఈ వాదనను బలపరుస్తూ, ఇషాన్ చాలా చిత్రలేఖనాలలో, సృజనాత్మక కళారూపాలలో అతని కళాత్మక సామర్ధ్యాన్ని నికుంబ్ ముఖ్యాంశాలుగా తెలియజేస్తాడు. అతను చెప్పేదాన్ని స్పష్టం చేయటానికి, నికుంభ్ ఇషాన్ తండ్రిని ఒక బాక్స్ లో ఉన్న జపనీస్ సంఘటనని చదవమని ఒత్తిడి చేస్తాడు. అవస్థి తను ఆవిషయాన్ని చదవలేకపోతున్నానని చెప్తాడు, నికుంభ్ అతనిని కోప్పడతాడు. అలాచేయడం వల్ల, ఇషాన్ రోజువారీ పద్ధతిలో ఏమి పోరాటం చేస్తున్నాడనేది నికుంభ్ వారికి సోదాహరణంగా వివరిస్తాడు.

అతను స్కూలుకి తిరిగి వచ్చింతర్వాత, నికుంభ్ ఒకరోజు డిస్లెక్సియా అంశాన్ని తరగతిలో లేవనెత్తుతాడు. డిస్లెక్సిక్ అని భావింపబడే కొంతమంది ప్రముఖుల జాబితాను అందిస్తాడు: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, లెనార్డో డా విన్సి, వాల్ట్ డిస్నీ, అగాథ క్రిస్టీ, థామస్ ఎడిసన్, పాబ్లో పికాసో, నటుడు అభిషేక్ బచ్చన్ అందులో ఉంటారు. విద్యార్థులు తరగతి గదిని వదిలివెళుతూ ఉంటే నికుంభ్ ఇషాన్ ను ఉండమని అడుగుతాడు. ఆ సమయంలో డిస్లెక్సియాతో తను కూడా అదేవిధమైన కష్టాలను అనుభవించానని నికుంభ్ వెలిబుచ్చుతాడు. నికుంభ్ అదే సమాచారాన్ని స్కూలు ప్రధానోపాధ్యాయుడు (M.K. రైనా)కు అందిస్తాడు. అతను ఇషాన్ కు శిక్షకుడిగా ఉండటానికి అనుమతి కోరతాడు. ప్రధానోపాధ్యాయుడి అనుమతి పొందినతర్వాత, డిస్లెక్సియా రంగంలో నిపుణులచే అభివృద్ధి చేయబడిన ప్రత్యేక పద్ధతులు ఉపయోగించి నికుంభ్ ఇషాన్ కు బోధించటం ఆరంభిస్తాడు. ఇషాన్ త్వరగానే భాషలో, గణితపరమైన నైపుణ్యాలపై మక్కువను అభివృద్ధి చేసుకుంటాడు. అతని ర్యాంకు కూడా వృద్ది చెందుతుంది. సంవత్సరం చివరికి, నికుంభ్ సిబ్బందికి, విద్యార్థులకు ఒక కళా ప్రదర్శన నిర్వహిస్తాడు. ఈ పోటీ న్యాయనిర్ణయం లలితా లజ్మిచే చేయబడింది (తన పాత్రను తానే పోషించుకుంది). ఇషాన్, ప్రత్యేకంగా గమనించదగిన సృజనాత్మక శైలితో విజేతగా ప్రకటింపబడతాడు, అయితే అతని అధ్యాపకుడు నికుంభ్ (అతను ఇషాన్ యొక్క ఛాయాచిత్రాన్ని గీస్తాడు) రెండవస్థానం పొందినట్టు ప్రకటిస్తారు.

ఇషాన్ యొక్క తల్లితండ్రులు అతని అధ్యాపకులని స్కూలు చివరిరోజున కలుస్తారు. అతనిలో వచ్చిన మార్పులకు వారు నివ్వెరపోతారు. ఎందుకంటే అతను అన్ని పాఠ్యాంశాలలో అభివృద్ధిని సాధిస్తాడు. సెలవులకు వెళ్లపోయేముందు, ఇషాన్ పరిగెత్తుకు వచ్చి అతని అధ్యాపకుణ్ణి కౌగలించుకుంటాడు. నిషాన్ నికుంభ్ ను గాలిలోకి ఎగరవేసినప్పుడు అతను ఎగురుతున్నట్లుండే చట్రంలోని నిశ్చల చిత్రంతో ఈ చిత్రం ముగుస్తుంది.

నటీనట వర్గం

నటుడు/నటిపాత్ర
దర్షీల్ సఫారీఇషాన్ అవస్థి
అమీర్ ఖాన్రామ్ శంకర్ నికుంభ్ ("నికుంభ్ సర్")
టిస్కా చోప్రామాయా అవస్థి/తల్లి
విపిన్ శర్మనంద కిషోర్ అవస్థి/తండ్రి
సాచెట్ ఇంజనీర్యోహాన్ అవస్థి/అన్నయ్య
తనయ్ చెడ్డారాజన్ దామోదరన్
M.K. రైనాప్రధానోపాధ్యాయుడు
లలితా లజ్మిస్వీయ పాత్ర (చిత్రలేఖనపోటీ న్యాయనిర్ణేత)
మేఘనా మాలిక్గణితం టీచర్
గిరిజా ఓక్

నిర్మాణం

నిర్మాణానికి ముందు

తారే జమీన్ పర్ చిత్ర యోచన ముందుగా భార్యాభర్తలైన అమోల్ గుప్తే, దీపా భాటియాలకు వచ్చింది. కొంతమంది పిల్లలు ఎందుకు విద్యావిధానానికి అనుగుణంగా ఉండలేకపోతున్నారనేది అర్ధంచేసుకోవాలనే కోరిక నుండి ఇది ఉద్భవించింది. చిత్ర రచన ఒక చిన్న కథ “హై జంప్” పేరుతో ఆరంభమైంది. ఏడేళ్ళ తర్వాత పూర్తిస్థాయి కథగా అభివృద్ధి చేశారు.[3] దీపా భాటియా తర్వాత ది హిందూతో ఇచ్చిన ఒక ముఖాముఖీలో, ఆమెకు ప్రారంభంలో స్ఫూర్తిని ఇచ్చింది డిస్లెక్సియా అంశంకాదని తెలిపారు. బదులుగా, దీనిని జపనీస్ సినీనిర్మాత అకిరా కురొసావా (స్కూలులో ఒక బీద విద్యార్థి) బాల్యంనుండి స్వీకరించినదనీ తెలిపింది. ముందుగా పాఠశాల విద్యావిధానానికి సరిపడని ఒక పిల్లాడి కథను పరిశోధించాలని అనుకుంది.[3] భాటియా ప్రత్యేకంగా నిర్దేశించబడిన అంశాన్ని సూచించాడు. కురొసావా వికసించటం ఆరంభంయ్యింది కేవలం ఒక ఆర్ట్ అధ్యాపకుణ్ణి కలిసి ఆయన కాలాన్ని, దృష్టిలో పడిన తర్వాతే అనేది ఈ అంశం.[3] "ఒక అధ్యాపకుడు ఏవిధంగా విద్యార్థి జీవితాన్ని రూపాంతరం చేయవచ్చు అనే సన్నివేశం స్పూర్తిగా అయ్యింది" అని భాటియా తెలియచేశాడు.[3]

కురొసావా ఆధారంగా చిన్నబాలుడి పాత్ర అభివృద్ధిచేస్తూ, భాటియా, గుప్తే తమలో తామే దిగ్బ్రమచెందినట్లు పేర్కొన్నారు. "అమోల్ సమస్యల గూర్చి ప్రశ్నల ప్రవాహం జరుగుతూ ఉంది, వాటిలో: ఈ పిల్లాడికి ఏమి సమస్య ఉంది? ఆ పిల్లవాడిలో దోషమేమిటి? అతను నిదానంగా నేర్చుకునేవాడా? అతనికి అయిష్టతా, లేక అసమర్ధుడా? ఈ రకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయని, దానికి సరిపోయేన్ని సమాధానాలు లేవని మేము గ్రహించాము.”[3] వారు తీవ్రమైన పరిశోధనలో మునిగిఉన్నారు అది వారిని మహారాష్ట్ర డిస్లెక్సియా సంస్థ,[12] PACE (పిల్లలకు అవసరమైన ఉత్తమ పఠనాంశముల కొరకు ఉన్న తల్లితండ్రులతో ఏర్పడిన సంస్థ) వంటి వాటికి దారితీయించింది. తత్ఫలితంగా, వారు డిస్లెక్సియాను వారి ముఖ్యాంశంగా, కథావస్తువుగా చేయటానికి నిశ్చయించుకున్నారు: “మేము ఇషాన్ కథను సంబోధించటానికి ఇదేమార్గం అని ఆలోచించాం. దీనిలో అభ్యాసనా సామర్ధ్యాలు లేని ఒక బాలుడు, అతన్ని అర్థం చేసుకునే వారు ఎవరూ ఉండకపోవడం” అనే విషయం ఉందని తెలిపారు. స్క్రిప్ట్ ను అభివృద్ధిని చేయటానికి, వారు డిస్లెక్సిక్ పిల్లలతో సమయాన్ని గడపటం ఆరంభించారు. చిత్రరచన చివరిలో వారి గుర్తింపులు జాగ్రత్తగా కాపాడుకున్నారు. గుప్తే జ్ఞప్తికితెచ్చుకుంటూ, “మేము ఎనిమిది లేదా తొమ్మిదిమంది పిల్లలతో ఒక చిన్న ప్రయోగశాలను ఆరంభించాము. ఒక వినోద సమావేశం, వారి కుతూహలాలను, వారి మెదడు ఏవిధంగా కళ, కాగితం, రంగులతో పనిచేస్తుందో గమనించటానికి ఇది ఒక ప్రదేశం అయింది. వారు 'పరిధిని మించి' ఆలోచిస్తున్నారని స్పష్టం అయ్యింది. దీనిని గౌరవించాలి, మర్యాదించాలి, అభినందించాలి."[3]

నిర్మాణం

"అమోల్ రాసింది నా ఉద్దేశ్యంలో అద్భుతమైన, కదిలించే రచన, ఈ సినిమా కోసం అతని తోడ్పాటు రచయితగా పరిమితం అవ్వలేదు. నిర్మాణంకు ముందు మొత్తం పనిఅంతా అతనే చేశాడు ఇందులో ముఖ్యంగా సంగీతం కూర్చే పనికూడా ఉంది [...] సెట్ వద్ద షూటింగ్ జరుగుతున్నంతసేపు సృజనాత్మక దర్శకుడిగా హాజరయ్యారు,, నేను తొలిసారి దర్శకుడిగా ఉండటానికి పెద్ద సహాయం, బలమైన ఉపదేశశక్తిగా ఉన్నారు. దానికోసం, నామీద విశ్వాసం ఉంచి అతని మనస్సుకు ఎంతో దగ్గరగా ఉన్నదాన్ని నాకు ఒప్పగించినందుకు నేను కృతజ్ఞతను తెలియచేస్తున్నాను."
— అమీర్ ఖాన్ [13]

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, అమోల్ గుప్తే మొదటిసారిగా వారు కళాశాలలో ఉన్నప్పుడు కలుసుకున్నారు. గుప్తే నటుడిగా, రచయితగా, చిత్రలేఖకుడిగా అతనికున్న సామర్ధ్యాలకు ఆశ్చర్యపోయానని అమీర్ ఖాన్ తెలిపాడు. గుప్తే, భాటియాలు తారే జమీన్ పర్ అభివృద్ధి చేయటానికి ఏడేళ్ళ సమయాన్ని వెచ్చించారు. మొదట్లో నిర్మాతగా, తర్వాత నటుడిగా, సహ దర్శకుడిగా సినిమా విడుదలకు ముందు మూడేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేశానని అమీర్ ఖాన్ తెలిపాడు. దీనికి ఖాన్ దర్శకుడు కావడం ఇద్దరి మధ్య అవగాహన వల్లే జరిగింది. ఈ చిత్రం రూపకల్పనలో చాలా చోట్ల గుప్తే సహకరించారని ఖాన్ ప్రశంసించాడు.[13][14]

తారే జమీన్ పర్లో ఖాన్ మొదటిసారిగా దర్శకుడు/నటుడుగా రెండు బాధ్యతలు నిర్వహించాడు. ఖాన్ ఈమార్పు సవాలు వంటిదని ఒప్పుకున్నాడు. ఇంకా వివరిస్తూ అతను ఎప్పుడూ దర్శకత్వం చేయాలని అనుకునేవాడినని, అయితే అతను "ఏవిధమైన సంసిద్ధత లేకుండా దీనిలో చేయవలసి వచ్చిందని" తెలిపారు. అయిననూ, "పిల్లల బృందంతో, ముఖ్యంగా దర్షీల్, సాచెట్, తనయ్ చెడ్డా"తో కలిసిపనిచేయటం అదృష్టంగా భావించాడు.[14] ఖాన్ చిత్రం తీసేటప్పుడు పిల్లలలో బాగా కలిసిపోయాడు. పంచగనిలో (చిత్రీకరించిన ప్రదేశం) ఉన్న న్యూ ఎరా హై స్కూల్లోని మొత్తం 43మంది పిల్లలు అతని తరహాలో జుట్టును పెంచుకోవాలని ఆశించారు. ఇతరుల కోర్కెలు తీర్చే స్వభావం ఉన్న అమీర్ వారందరికీ తానే స్వయంగా హెయిర్ స్టైలిస్ట్ గా మారాడు."[15] ఇంకా, బాల నటుల దైనందిన అవసరాలకు ఖాన్ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ చిత్రం అధికార ప్రతినిధి ప్రకారం, "అమీర్ పిల్లల మీద అధిక జాగ్రత్త తీసుకున్నాడు. అతను వారి వివరాల జాబితాను, ఆహారాన్ని, ఇతర కార్యకలాపాలను తయారుచేయటానికి నైపుణ్యంగల ఐదుగురు సిబ్బందిని నియమించుకున్నాడు. అమీర్ వారిని ఒకేసారి రెండుగంటలకన్నా ఎక్కువ పనిచేయించేవాడు కాదు. మధ్యమధ్యలో ఉపాహారముల కోసం తరచుగా విరామాలు ఇచ్చేవాడు. పిల్లలను ఒకే ఆవరణంలో ఉంచకుండా లోపల ప్రదేశాలతోపాటు బాహ్య ప్రదేశాలలో మార్చి మార్చి చిత్రీకరణ చేసేలా ఏర్పాటుచేసుకున్నాము. బాలీవుడ్ పనుల విధానం నుంచి ఇది సేదతీర్చేటి మార్పు" అని చెప్పారు.[15] ఖాన్ కూడా సూచిస్తూ:

పిల్లలతో పనిచేయటం సవాళ్ళతో కూడుకున్నది. ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు పరీక్షించే విధంగా ఉంటుంది. మీ దగ్గర నలభైమంది పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు, వారి అల్లరి, ఇంకా నిర్దేశిత సమయంలో పనిచేయటం అనేది మనకు ముఖ్యమైనది. అందుచేత పిల్లలు సంతోషంగా, సౌకర్యంగా ఉంచటానికి మేము నిశ్చయంగా ఉన్నాము. మేము వారికోసం ఎల్లప్పుడూ వారి దగ్గరే ఉండేవాళ్ళం.[16]

పేరు

అమీర్ ఖాన్ ఒక ముఖాముఖిలో ఈ చిత్రానికి ముందుగా అనుకున్న శీర్షిక తారే జమీన్ పర్ కాదని, తను, అమోల్ గుప్తే, దీపా భాటియా అనేక పేర్ల కోసం చర్చించారని తెలిపారు. సినిమా కొరకు తుది పేరు, ఖాన్ సూచిస్తూ:

తారే జమీన్ పర్ అనే సినిమా పిల్లల విశిష్టతల గురించి తీసినది, పిల్లలయొక్క సామర్ధ్యాలను కొనియాడే సినిమా ఇది. తారే జమీన్ పర్ అనే పేరు, ఆ భావనను సూచిస్తుంది. అనుకూలభావాన్ని కలిగించే ఒక పేరు. అందరు పిల్లలూ ప్రత్యేకమైనవారు, అద్భుతమైనవారు. వారు భూమిమీద నక్షత్రాల వంటివారు. ఈ ముఖ్యమైన దృష్టి పేరుకి కొత్తదనాన్ని ఇచ్చింది.[16]

విడుదల

బాక్స్ ఆఫీస్

బాక్స్ ఆఫీస్ ఇండియా తారే జమీన్ పర్ భారతదేశంలో బాక్స్ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని ప్రకటించింది.[17] ఇది 2007 డిసెంబరు 21న 425 అచ్చులతో భారతదేశం అంతటా విడుదలైనది,[18] 2007లో అతిపెద్ద మొత్తాలను సాధించిన వాటిలో ఐదవస్థానంలో ఉంది.[17] యుకెలో తొమ్మిదవ వారానికి £351,303ల మొత్తాన్ని[19], ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 131 కోట్ల రూపాయలు వసూలుచేసింది.[20]

విమర్శాత్మక స్వీకృతి

తారే జమీన్ పర్ అనే చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. BBC లోని ఇద్దరు విమర్శకులు ఈ చిత్రానికి ఆసక్తికరమైన సమీక్షలు ఇచ్చారు. మనీష్ గజ్జార్ సమీక్షిస్తూ "ఈ చిత్రంలోని దృశ్యాలు మీ హృదయాన్ని తాకుతాయి, మిమ్మలను కదిలిస్తుంది. ఇది మంచి విషయం ఉన్న చిత్రం! " అని పేర్కొన్నాడు.[21] జస్ప్రీత్ పాన్దోహార్ సూచిస్తూ తారే జమీన్ పర్ అనేది "బాలీవుడ్ లో ఎక్కువగా వచ్చే మూస ధోరణి మసాలా చిత్రాలకు దూరంగా ఉంది,", "వినోదంతోపాటు ప్రేరణ కూడా కలిగిన ఒక స్పూర్తిదాయక చిత్రం; ఇది చిత్ర ప్రపంచంలోనే ఒక మెరిసే తార." అని పేర్కొన్నాడు.[22] ది టెలిగ్రాఫ్కు చెందిన ప్రతిమ్ D.గుప్తా తారే జమీన్ పర్ను వర్ణిస్తూ "ఈ చిత్రం మిమ్మలను ఆలింగనం చేసుకుంటుంది, బుజ్జగిస్తుంది, చివరికి ఎదిరిస్తుంది, ఇది మీరు ఇంతకు ముందు చూసిన చిత్రాలకు భిన్నంగా ఉంటుంది" అని పేర్కొన్నాడు.[23] ఇండియా టుడే యొక్క కావేరీ బామ్జై ప్రకటిస్తూ "సూక్ష్మంగా చెప్పాలంటే సంవత్సరం యొక్క ఉత్తమ చిత్రం" అని తెలిపారు.[24] ఈ చిత్రాన్ని ది హిందూ యొక్క సుధీష్ కామత్ కూడా బాగా సిఫారుసు చేశారు, ఆయన తెలుపుతూ ఇది "ఈ సంవత్సరం యొక్క చిత్రం.ఇది కేవలం పరిధి బయట కాదు, సరళంగా ఈ ప్రపంచం బయట ఉంది " అని అన్నారు.[25] దీనితోడూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క నిఖత్ కజ్మి సూచిస్తూ, "ఈ కథ సులభమైనది, హాలులోని ప్రతి పెద్ద, చిన్న వారిని వెంటనే జతచేస్తుంది, ఇంకా చరమాంకం కూడా ముందుగా ఊహించదగినా మీ భావోద్రేకాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కానీ దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన అంశాలు ఏమిటంటే దాని యొక్క సరళత, సున్నితత్వం, దానిలో ప్రదర్శనలు అని చెప్పుకోవచ్చు. ఒకవిధంగా సినీఫక్కీలోలేని ఈ లేఖనం ఏఒక్కరినీ దుష్టులను చేయదు .... పెద్దవాళ్ళు కూడా అజ్ఞానానికి బాధితులే, అని ఒకవిధంగా తెలియచేస్తుంది అన్ని పాఠశాలల వాళ్ళు, అందరు తల్లితండ్రులూ చూడటం తప్పనిసరిచేయాలని మేము సిఫారుసు చేస్తున్నాం."[26] చివరగా, స్క్రీన్ యొక్క అపరాజితా అనిల్ ఈ చిత్రానికి నాలుగు నక్షత్రాల రేటింగ్ ఇచ్చారు ఇంకా ఈ చిత్రం గురించి : "తారే జమీన్ పర్ చూడకుండా ఉండవద్దు. ఎందుకంటే ఇది విభిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఉల్లాసకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతిఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే ఇది ప్రతిఒక్కరూ ఎదగడానికి సహాయపడుతుంది. ఎందుకంటే చాలా అరుదుగా ప్రదర్శనలలో ఇంత పట్టుఉంటుంది., ఇదిఇలా ఎందుకయ్యిందంటే ‘పరిపూర్ణత సాధించిన’నటుడు 'పరిపూర్ణ' దర్శకుడుగా ఆకృతిచెందారు" అని పొగిడారు.[27]

ఇతర విమర్శకులు చిత్రం గురించి వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు. చిత్రరచన గురించి, CNN-IBN యొక్క రాజీవ్ మసండ్ వాదిస్తూ ఈ చిత్రం యొక్క వాస్తవమైన బలం దాని యొక్క "శ్లాఘనీయమైన, చొచ్చుకొనిపోయిన, పటిష్టమైన రచనలో ఉంది, ఇది భావోద్వేగమైన, హృదయం బరువెక్కించే అనుభవానికి సహజ ఆకృతిని కల్పించింది." అని తెలిపారు.[28] అయితే గౌతమన్ భాస్కరన్ ది హాలీవుడ్ రిపోర్టర్లో సూచిస్తూ "గొప్ప నటనా ప్రదర్శనలు ఉన్నప్పటికీ, ఈ చిత రచన బలహీనంగా ఉందని" విమర్శించారు.[29] భాస్కరన్, బాలీవుడ్ చిత్రాల మీద తర్వాత ఒక సంచికలో తారే జమీన్ పర్ సినిమాకు దర్శకత్వం, నటన (ముఖ్యంగా డిస్లెక్సిక్ గా నటించిన దార్శీల్ సఫారీ నటన), చిత్రీకరణ సమపాళ్ళలో కుదిరాయని ప్రశంసించాడు.[30] ది హాలీవుడ్ రిపోర్టర్ లోని ఇంకొక విమర్శకురాలు, లిసా ట్సేరింగ్ ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. తారే జమీన్ పర్ను "శక్తివంతమైన, మనసును కదిలించేదిగా" వర్ణించారు.[31] అయితే వెరైటీ యొక్క డెరెక్ కెల్లీ విమర్శిస్తూ ప్రత్యేక అవసరాలు ఉన్న బాలుని యొక్క దుస్థితిని "స్పృశించే భావనతో" చూపించిందని వర్ణించారు." కెల్లీ ఈ చిత్రంకు "ఎక్కువ శ్రద్ధ చూపడం, వాస్తవమైన నాటకం, ఆసక్తికరమైన పాత్రలు లేకపోవడం" వల్ల తనకు నచ్చలేదని ఇంకనూ "ఇది డిస్లెక్సియా అసోసియేషన్ ద్వారా అనుమతి పొంది', చిత్ర ప్రకటనల మీద ఆమోదముద్ర వేసుకోవాలి" అని తెలిపారు.[32]

తారే జమీన్ పర్ని ముడిపెట్టి చక్ దేఇండియాతో 2007 ఉత్తమ చిత్రంకోసం (భారతదేశంలో) అనేకమంది బాలీవుడ్ చిత్రదర్శకులు మధుర్ భండార్కర్, డేవిడ్ ధావన్, రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా, అనురాగ్ బసు, శ్రీరామ్ రాఘవన్ వంటివారు సూచించారు.[9] చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, "తారే జమీన్ పర్ తిరిగి నన్ను నా హాస్టల్ రోజుల్లోకి తీసుకువెళ్ళింది. మీరు కనక డిస్లెక్సియాను తొలగిస్తే, అది నా కథ లాగానే ఉంటుంది. ఈ చిత్రం గాఢంగా నామనస్సును కరిగింపచేసింది దానితో నానోట మాటరాకుండా ఉండిపోయాను. ఈ చిత్రాన్ని చూసినతర్వాత, నన్ను తారే జమీన్ పర్ చూస్తే ఎలా అనిపించింది అని అడిగారు. నేను లోతుగా ఆనందంలో మునిగిఉండటంవల్ల సమాధానం చెప్పలేకపోయాను." [33]

2009 అకాడమీ అవార్డుల యొక్క ఉత్తమ విదేశీ చిత్ర సమర్పణ

2009 అకాడెమి అవార్డుల నామినేషన్ ప్రక్రియలో ఉత్తమ విదేశీచిత్రం విభాగంలో తారే జమీన్ పర్ భారతదేశం తరఫున అధికారిక ప్రవేశం పొందింది.[34] కానీ అది సూక్ష్మ జాబితాలో ఎంపికకాబడలేదు.[35] న్యాయ సహాయక సమితి సభ్యులు, డైరెక్టర్ కృష్ణ షా తారే జమీన్ పర్ యొక్క సంగీతపరమైన ఆకృతి, సాగతీత ఆస్కార్స్ నుండి తిరస్కరించబడడానికి కారణమయ్యాయని చెప్పారు. అతను వ్యాఖ్యానిస్తూ ఈ విమర్శలు అమీర్ ఖాన్ కు తెలియచేశానని చెప్పారు.[36] అమీర్ ఖాన్, తనే స్వయంగా ఒక NDTV ముఖాముఖీలో తెలియచేస్తూ తారే జమీన్ పర్ ఆస్కార్స్ తుది జాబితానుండి తిరస్కరించబడినందుకు "ఆశ్చర్యపోలేదు" అని[37] ఇంకనూ వాదిస్తూ, "నేను చిత్రాలు అవార్డులకోసం చేయను. నేను చిత్రాలు ప్రేక్షకులకోసం చేస్తాను. ఈ చిత్రాన్ని నేను ప్రేక్షకులకోసం చేశాను. ప్రేక్షకులు నిజంగా దీనిని ఇష్టపడ్డారు. భారతదేశం బయట కూడా ప్రేక్షకులు ఇష్టపడ్డారు. నేను ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నానంటే ఈ చిత్రాన్ని ప్రపంచం మొత్తం ఇష్టపడింది, అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది, నేను అధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చేది కూడా దానికే."[38]

ఇతరులుకూడా ఈ నిర్ణయానికి బదులిచ్చారు. స్లమ్ డాగ్ మిల్లియనీర్లో (2009 ఆస్కార్స్ లో అనేక అవార్డులు ) ముఠానాయకుడిగా జావెద్ పాత్ర చేసిన మహేష్ మంజ్రేకర్ మాట్లాడుతూ, "ఆస్కార్స్ చివరిరౌండ్ లో అమీర్ యొక్క తారే జమీన్ పర్ ఎంపికకానందుకు నాకు చాలా విచారంగా ఉంది. అది స్లమ్ డాగ్ మిల్లియనీర్ కన్నా చాలాబావుంది. బోయ్లె, పిల్లల వద్దనుంచి ఏమీతీసుకొవట్లేదు. కానీ, భారతీయ చిత్రాలు అక్కడ తక్కువగా అంచనా వేయబడతాయి."[39] దీనికితోడూ,ది హాలీవుడ్ రిపోర్టర్ యొక్క లిసా ట్స్రింగ్ సూచిస్తూ:

యు.స్., భారతదేశంలో చాందినీ చౌక్ చిత్రం విడుదలయ్యే మూడురోజుల ముందు, అకాడెమి అఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తొమ్మిది చిత్రాలతో దాని తుది జాబితాను ఒక విదేశీ చిత్రంయొక్క ప్రతిపాదనతో సహా ప్రకటించారు. అమీర్ ఖాన్ చే చేయబడిన శక్తివంతమైన, కదిలించే చిత్రం తారే జమీన్ పర్ భారతదేశం యొక్క సమర్పణ చేనప్పటికీ, స్థానం సంపాదించుకోలేదు. బాధాకరంగా, ఈ చిత్రంను ప్రధానస్రవంతిలో అమెరికా ప్రేక్షకులు ఎప్పటికీ చూడలేరు; అయితే చాందినీ చౌక్ అధికప్రచార ప్రోత్సాహాన్ని ఆనందించింది. అదేవిధమైన ఇంద్రజాలంపై తారే జమీన్ పర్ కూడా చేతులుంచినట్లయితే బావుండేది.[31]

అవార్డుల జాబితా

తారే జమీన్ పర్ 2008 లో ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. ఇంకా అనేక అవార్డులను గెలుచుకుంది. వీటిలో మూడు జాతీయ అవార్డులు, ఐదు ఉత్తమ దర్శకుడి (అమీర్ ఖాన్)అవార్డులను గెలుచుకుంది. యువనటుడు దర్షీల్ సఫారీ కూడా అనేక అవార్డులను అందుకున్నాడు విమర్శకుల చే ప్రశంసలు అందుకున్నచిత్రం ఇది.

ఉన్నత లక్షణ ప్రదర్శనలు

ఆడ్రీ హెప్బుర్న్ యొక్క పుట్టినరోజు పండగ

సీన్ హెప్బుర్న్ ఫెర్రెర్ 2009 మే 3న బెర్లిన్లో తారే జమీన్ పర్ యొక్క ప్రత్యేకప్రదర్శన కోసం అమీర్ ఖాన్ ను ఆహ్వానించారు. ఈ ప్రదర్శన ఫెర్రెర్ యొక్క స్వర్గస్తులైన తల్లి హాలీవుడ్లో ప్రజాదరణ పొందిన, ఆడ్రీ హెప్బుర్న్ యొక్క అతిపెద్ద 80వ జన్మదిన వార్షికోత్సవ పండగలో భాగంగా చేయబడింది. అతను ఖాన్ ను యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా లబ్ధిపొందుతున్న "ఆడ్రీ హెప్బుర్న్ చిల్ద్రెన్'స్ ఫండ్" చేరమని అడిగారు. ఫెర్రెర్ తెలియచేస్తూ:

పిల్లల అంతః ప్రపంచం గురించి ఇంతవరకూ చేసిన అద్భుతమైన చిత్రాలలో తారే జమీన్ పర్ ఒకటిగా నేను కనుగొన్నాను ఆడ్రీ హెప్బుర్న్ ప్రాతినిధ్యం వహిస్తున్న విధంగానే ఇతని (అమీర్ యొక్క)చిత్రం కూడా పిల్లల శ్రేయస్సుకోసం అదే ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తోంది, అది ఆమెకు చాలా ముఖ్యమైనది, అందుచేత ఈ ముఖ్యమైన వేడుకల సందర్భంలో తారే జమీన్ పర్ ఎంపిక ఉత్తమమైనది.[40]

ప్రదర్శనకు అత్యధికంగా వచ్చిన స్పందనకు ఆడ్రీ హెప్బుర్న్ యొక్క అభిమాని అయిన ఖాన్ బదులిస్తూ, "ఈ చిత్రానికి ఇక్కడ వచ్చిన ఈ విధమైన స్పందన నన్ను కదిలించింది, పొంగిపోయేటట్టు చేసింది" అని తెలిపాడు.[41] ఈ అనుభవాన్ని ఆయన తన బ్లాగ్ లో కూడా పొందుపరుచుకొని తెలుపుతూ:

బెర్లిన్ కి నా సుడిగాలి పర్యటనలో నేను అత్యంత సంతోషంగా ఉన్నాను, కొంతమంది బ్లాగ్ సమూహాలను చూసి నేను ఆశ్చర్యపోలేదు ఆడ్రీ హెప్బుర్న్ కు అంతపెద్ద అభిమానిని అయ్యుండి నేను అతని ఆహ్వానాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది, నేను అలా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బెర్లిన్ లోని నా అభిమానులను, ముఖ్యంగా బ్లాగర్లను కలిసే అవకాశం దొరికింది. అక్కడకు వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.[42]

అంతర్జాతీయ డిస్లెక్సియా సంఘం

తారే జమీన్ పర్ సంయుక్త రాష్ట్రాలలో (సియాటెల్, వాషింగ్టన్) 2008 అక్టోబరు 29న అంతర్జాతీయ డిస్లెక్సియా సంఘం కోసం ప్రదర్శించింది. ఖాన్ తెలియచేస్తూ అక్కడ దాదాపు 200 మంది ప్రజలు ప్రేక్షకులలో ఉన్నారు, అతను "మేము చేసిన పనికి విదేశీయులు ఏవిధంగా స్పందిస్తారో అని చూడటం ఉత్కంఠగా ఉంది" అని చెప్పారు. సినిమా హాలులో కాకుండా సమావేశ గదిలో ఈ చిత్రం చూపించడంపై, చిత్రంగా కాకుండా DVDగా పేర్కొనటం మీద ఆయన కొంత ఆందోళన చెందారు. ఆయన చెప్తూ "అందరూ నిలబడి సంపూర్ణమైన మేఘగర్జనలాంటి హర్షధ్వానాలు" తెలుపుతుండగా చిత్రం ముగిసింది. అది ఆయనని "పొంగిపోయేట్టు" చేసింది, అతను "ప్రేక్షకుల కన్నీళ్లు బుగ్గలమీద కారటం చూశారు" అని తెలిపారు. ఖాన్ ఇంకనూ సూచిస్తూ ఈ చిత్రానికి స్పందన "భారతదేశంలో ప్రేక్షకులు ఏవిధంగా స్పందించారో సరిగ్గా అలానే ఉంది" అని తెలిపారు.[43][44]

సౌండ్‌ట్రాక్

తారే జమీన్ పర్ యొక్క CD 2007 నవంబరు 5న విడుదలైనది. శంకర్-ఎహ్సాన్-లాయ్ ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు. ఈ చిత్రం దీని సౌండ్ ట్రాక్ కు సంబంధించి రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుంది: ఉత్తమ గేయ రచయితగా (ప్రసూన్ జోషి), ఉత్తమ నేపధ్య గాయకుడు (శంకర్ మహదేవన్ మా అనే పాటకొరకు) పొందారు.[10]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "తారే జమీన్ పర్"  శంకర్ మహదేవన్ దొమినిక్ సెరీజో, వివిన్నీ పోషా 4:28
2. "ఖోలో ఖోలో"  రామన్ మహదేవన్ 3:01
3. "బం బం బోలే"  షాన్, ఆమిర్ ఖాన్ 3:32
4. "జమే రహో"  విశాల్ దడ్లాని 1:79
5. "మా"  శంకర్ మహదేవన్ 3:14
6. "భేజా కం"  శంకర్ మహదేవన్, బగ్స్ భార్గవ, శంకర్ సచ్‌దేవ్, రాజగోపాల్ అయ్యర్, రవి ఖన్వికర్, లాయ్ మెండోన్సా, అమోల్ గుప్తే, కిరణ్ రావ్, ఆమిర్ ఖాన్, రామ్ మధావ్నీ 1:27
7. "మేరా జహాన్"  అద్నాన్ సమి, కోర్డో, అనన్య వాడ్కర్ 3:92
8. "ఇషాన్ థీమ్ సంగీతం"  లాయ్ మెండోన్సా, శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ 2:53

DVD

భారతదేశం

భారత దేశం లో తారే జమీన్ పర్ యొక్క DVDని UTV హోమ్ ఎంటర్టైన్మెంట్[45] ద్వారా 2008 జూలై 25న విడుదలచేశారు. దర్షీల్ సఫారీ చదివే ముంబాయిలోని గ్రీన్ లాన్స్ హై స్కూల్లో దీనిని ఆరంభించారు. అమీర్ ఖాన్, టిస్కా చోప్రా, విపిన్ శర్మ, సాచెట్ ఇంజనీర్ (ఇషాన్ కుటుంబ సభ్యులుగా పాత్రలు పోషించిన నటులు), చిత్రం యొక్క మిగిలిన నటులు, సభ్యులు హాజరైనారు. తన ఉపన్యాసంలో, అమీర్ ఖాన్ తెలియచేస్తూ: "దర్షీల్ చాలా సంతోషంగా, జీవంతో ఉట్టిపడే, ఉత్సాహపూరితమైన పిల్లాడు. అతని తల్లితండ్రులు, అధ్యాపకులు అతనితో వ్యవహరించే తీరువల్లనే అతను అలా ఉన్నాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. దర్షీల్ యొక్క ప్రధానోపాధ్యాయుడు Mrs. బజాజ్ ఉన్నతమైన సహాయ, సహకారాలను అందించారని నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏ పాఠశాలకైనా నిజమైన పరీక్ష ఏమిటంటే పిల్లలు యెంత సంతోషంగా ఉన్నారు అని, ఇక్కడ చూస్తూ ఉంటే, పిల్లలు నిజంగా చాల సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది."[46]

అంతర్జాతీయ ప్రచురణ

ఒక అంతర్జాతీయ DVD లైక్ స్టార్స్ ఆన్ ఎర్త్ అనే తర్జుమాను 2010 జనవరి 12న విడుదలచేశారు.[2] ది వాల్ట్ డిస్నీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ( UTV యొక్క 14.85 శాతం సముపార్జించింది)[47] రాబోయే కాలంలో విడుదల కాబోతున్నఉత్తర అమెరికా, బ్రిటన్,, ఆస్ట్రేలియాలో లైక్ స్టార్స్ ఆన్ ఎర్త్ కొరకు పమొఇనే కొరకు వీడియో హక్కులను కొనేశారు.[48] ఈ DVD హిందీ, ఆంగ్ల భాషలలో ఉప శీర్షికలను అందిస్తోంది. ఇంగ్లీష్ నేపధ్యంలోకి మార్చబడింది.[49]

గమనికలు

మరింత చదవడానికి

బాహ్య లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ