డెక్కన్ చార్జర్స్

వికీపీడియా నుండి
(డెక్కన్ ఛార్జర్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigationJump to search
{{{name}}}
సారధి:శ్రీలంక కుమార సంగక్కర
కోచ్:ఆస్ట్రేలియా డారిల్ లీమన్
నగరం:హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
రంగు(లు):DC
స్థాపన:2008
స్వంత మైదానం:
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం
    (సామర్థ్యం: 40,000)
  • ACA-VDCA మైదానం
    (సామర్థ్యం: 25,000)
  • బారాబత్తి మైదానం
    (సామర్థ్యం: 45,000)
యజమాని:డెక్కన్ క్రానికల్
IPL జయాలు:1 (2009)
CLT20 జయాలు:0 (Qualified 2009)
అధికారిక అంతర్జాలం:http://www.deccanchargers.com/

డెక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో 2009 నుండి 2012 వరకు హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన జట్టు. 2009 లో దక్షిణ ఆఫ్రికాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలలో ఇది విజేతగా నిలిచింది. 2010 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-3 పోటిలలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయి పోటీనుండి నిష్క్రమించింది. 2010 లో జరిగిన వేలంపాటలో ఈ జట్టుకు చెందిన అనేక మంది ఆటగాళ్ళను వేరే జట్లు కొనుగోలు చేశాయి.

2012లో దీని యజమానులు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టారు. మునుపటి సీజన్లలో జట్టు లోని ఆటగాళ్లను పదేపదే నిషేధించడం వల్ల వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, వచ్చిన ఏకైక బిడ్‌ను వాళ్ళు తిరస్కరించారు. 2012 సెప్టెంబరు 14 న, కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, IPL పాలక మండలి ఫ్రాంచైజీని రద్దు చేసింది.[1] సన్ టీవీ నెట్‌వర్కు, హైదరాబాద్ ఫ్రాంచైజీ బిడ్‌ను గెలుచుకుంది. ఈ సంగతిని బిసిసిఐ, 2012 అక్టోబరు 25 న ధ్రువీకరించింది.[2] కొత్త జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు.[3]

2020 జూలైలో బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీని రద్దు చేయడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. డెక్కన్ చార్జర్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కి బిసిసిఐ 2012 నుండి నష్టపరిహారంగా 10% వడ్డీతో సహా ₹4,814.67 కోట్లు చెల్లించాలని కోర్టు చెప్పింది.[4]

జట్టు వివరాలు (2010)

డెక్కన్ చార్జర్స్ జట్టు

బ్యాటింగ్ సభ్యులు

ఆల్ రౌండర్లు

వికెట్ కీపర్లు

బౌలింగ్ సభ్యులు

జట్టు సహాయ సభ్యులు
  • శిక్షకుడు: ఆస్ట్రేలియా డారిల్ లీమన్
  • ఉప శిక్షకుడు: India కన్వల్జిత్ సింగ్
  • ఫీల్డింగ్ శిక్షకుడు: యు.ఎస్.ఏ మైక్ యంగ్
  • వ్యాయామ శిక్షకుడు: ఆస్ట్రేలియా డాక్టర్.సీన్ స్లాటరీ
  • మానసిక శిక్షకుడు: ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్
క్రమ సంఖ్య.తేదీప్రత్యర్థివేదికఫలితం
1మార్చి 12కోల్కతా నైట్ రైడర్స్డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై11 పరుగుల తేడాతో ఓటమి.
2మార్చి 14చెన్నై సూపర్ కింగ్స్ఎమ్.ఎ.చిదంబరం స్టేడియం, చెన్నై31 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - శ్రీలంక చమిందా వాస్ - 4/21
3మార్చి 19కింగ్స్ XI పంజాబ్బారాబత్తి స్టేడియం, కటక్6 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 53 పరుగులు
4మార్చి 21ఢిల్లీ డేర్ డెవిల్స్బారాబత్తి స్టేడియం, కటక్10 పరుగుల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 3 వికెట్లు
5మార్చి 26రాజస్తాన్ రాయల్స్సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్8 వికెట్ల తేడాతో ఓటమి
6మార్చి 28ముంబై ఇండియన్స్డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై41 పరుగుల తేడాతో ఓటమి.
7ఏప్రిల్ 1కోల్కతా నైట్ రైడర్స్ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్కతా24 పరుగుల తేడాతో ఓటమి.
8ఏప్రిల్ 3ముంబై ఇండియన్స్బ్రబోర్న్ స్టేడియం, ముంబై63 పరుగుల తేడాతో ఓటమి.
9ఏప్రిల్ 5రాజస్తాన్ రాయల్స్విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్2 పరుగుల తేడాతో ఓటమి.
10ఏప్రిల్ 8రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ఎమ్. చిన్నస్వామి స్టేడియం, బెంగలూరు7 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India తిరుమలశెట్టి సుమన్ - 78 పరుగులు
11ఏప్రిల్ 10చెన్నై సూపర్ కింగ్స్విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్6 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ర్యాన్ హ్యారిస్ - 3/18
12ఏప్రిల్ 12రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్13 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India హర్మీత్ సింగ్
13ఏప్రిల్ 15కింగ్స్ XI పంజాబ్హెచ్.పి.సి.ఎ క్రికెట్ స్టేడియం, ధర్మశాల5 వికెట్ల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India రోహిత్ శర్మ - 68* పరుగులు ఔట్ కాకుండా
14ఏప్రిల్ 18ఢిల్లీ డేర్ డెవిల్స్ఫిరోజ్ షా కోట్ల స్టేడియం, ఢిల్లీ11 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 54 పరుగులు
15ఏప్రిల్ 22[సెమీ ఫైనల్]చెన్నై సూపర్ కింగ్స్డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై38 పరుగుల తేడాతో ఓటమి.
16ఏప్రిల్ 24 [మూడో స్థానం కోసం పోటీ]రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై9 వికెట్ల తేడాతో ఓటమి
మొత్తంగెలిచినవి 8, ఓడినవి 8

బయటి లింకులు

మార్గదర్శకపు మెనూ