టిను యోహానన్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
టిను యోహానన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1979-02-18) 1979 ఫిబ్రవరి 18 (వయసు 45)
కొల్లం జిల్లా, కేరళ[1]
ఎత్తు192 cమీ. (6 అ. 4 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 242)2001 డిసెంబరు 3 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2002 డిసెంబరు 19 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 145)2002 మే 29 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2002 జూలై 11 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999 – 2008కేరళ
2009రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుs]]
మ్యాచ్‌లు33
చేసిన పరుగులు137
బ్యాటింగు సగటు
100లు/50లు0/00/0
అత్యధిక స్కోరు8*5*
వేసిన బంతులు486120
వికెట్లు55
బౌలింగు సగటు51.2024.39
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు00
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు00
అత్యుత్తమ బౌలింగు2/563/33
క్యాచ్‌లు/స్టంపింగులు1/–0/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4

టిను యోహానన్ (జననం 1979 ఫిబ్రవరి 18) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతను కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలరు. కేరళ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారతదేశం తరపున టెస్టులు, వన్ డేలు ఆడిన మొదటి కేరళ ఆటగాడు. [2] అతను ప్రస్తుతం కేరళ క్రికెట్ జట్టు కోచ్. [3]

యోహానన్ పొడవాటి అథ్లెట్. అతను MRF పేస్ ఫౌండేషన్‌తో శిక్షణ పొందాక, 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి బ్యాచ్‌లో ఎంపికయ్యాడు. [4] అతను 2001 డిసెంబరులో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన తొలి టెస్టు ఆడాడు. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. [5] అతను తన మొదటి ఓవర్ నాలుగో బంతికి తన మొదటి టెస్టు వికెట్‌ తీసాడు. అతని ఆరంభం అద్భుతంగా ఉన్నప్పటికీ, ఫామ్ క్షీణించడంతో అతను భారత జట్టులో కొనసాగలేకపోయాడు. అతను 3 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్‌డేలు ఆడాడు. అతని టెస్ట్ బౌలింగ్ సగటు ఒక వికెట్‌కి 51 పరుగులు.[5]


టిను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2009 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. [6]

జీవితం తొలి దశలో

టిను, లాంగ్ జంప్ క్రీడాకారుడైన TC యోహానన్ కుమారుడు. అతను కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన 1976 వేసవి ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన లాంగ్ జంపర్. [5] టినూ తన యవ్వనంలో క్రికెట్‌లో రాణించడమే కాకుండా, జూనియర్ రాష్ట్ర స్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ టోర్నమెంట్‌లలో హైజంప్ ఈవెంట్‌లలో బంగారు, రజత పతకాలను గెలుచుకున్నాడు. [7]

కెరీర్

టిను 2001 డిసెంబరు 3 న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. [8] అతని వన్‌డే అరంగేట్రం 2002 మే 29న వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌పై జరిగింది . టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ 5 వికెట్లు తీశాడు. [5] అతను 1999 - 2008 మధ్య కేరళకు ప్రాతినిధ్యం వహించాడు [3]

మూలాలు

మార్గదర్శకపు మెనూ