జీవా (తమిళ నటుడు)

(జీవా (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

జీవా,  (జననం: 1984 జనవరి 4) ఇతను ప్రముఖ భారతీయ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. అతని అసలు పేరు అమర్ చౌదరి. అతని తండ్రి ఆర్.బి.చౌదరి సినీ నిర్మాత. 1996లో అతని తండ్రి  నిర్మించిన సినిమాల్లోనే బాలనటునిగా తన కెరీర్ ప్రారంభించాడు.

జీవా
జీవా
జననం
అమర్ చౌదరి

4 జనవరి 1984
వృత్తినటుడు
జీవిత భాగస్వామిసుప్రియ
తల్లిదండ్రులు
బంధువులుజితన్ రమేష్ (సోదరుడు)

జీవా 2003లో ఆసాయ్ ఆసాయి అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత అతను నటించిన రామ్ (2005) సినిమాకుగాను సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు.[1] డిష్యుం (2006), ఇ (2006), కట్ట్రధు తమిజ్ (2007) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.[2]

సినిమా జీవితం

తొలినాళ్ళ కెరీర్: 2003–2009

జీవా తన తండ్రి నిర్మించిన సినిమాల్లో రెండు చిన్న పాత్రల్లో బాలనటునిగా నటించాడు.2003లో ఆసాయ్ ఆసాయి అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.[3] ఆ తరువాత తితికుదే (2003), అమీర్ దర్శకత్వం వహించిన రామ్ (2005) వంటి సినిమాల్లో నటించాడు.[4][5] రామ్ సినిమా గోవాలో జరిగిన సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడటమే కాక, ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడం విశేషం.

ఆ తరువాత జీవా డిష్యుం (2006) సినిమాలో నటించాడు.[4][6] అతను అదే ఏడాది మలయాళ సినీ రంగంలో కీర్తి చక్ర సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమానే తమిళ్ లో అరన్ పేరుతో డబ్ చేశాడు.[7] ఆ తరువాత ఇ సినిమాలో నటించాడ.2007లో కత్తరదు తమిజ్ సినిమాలో నటించాడు .[8][9] ఈ సినిమాలో ప్రభాకర్ పాత్రలో అతని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2007లో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది.[10][8][9][11] ఈ సినిమా కోసం గెడ్డం పెంచుకుని, వేషం మార్చుకున్నాడు.

దాంతో అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఇతనిని మానసికంగా చాలా కుంగదీసాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు .[12][13] ఈ పాత్రలో తను చాలా లీనమైపోయానని వివరించాడు.[13][14] ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది.[15]

2009

2009లో ఎం.రాజేష్ దర్శకత్వంలో శివ మనసుల శక్తి సినిమాలో నటించాడు. 2010లో కచేరీ అరంబం సింగం పులి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. 2011లో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కో సినిమాలో నటించాడు ఈ సినిమాలోని అతని నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.[16][17] ఆ తరువాత అతను చేసిన రోవితరం, వందనం వెండరాన్ సినిమాలు విజయం సాధించాయి. కానీ విమర్శనాత్మకంగా మిశ్రమ ఫలితాలు లభించాయి.[18][19][20]

2012లో ఎస్.శంకర్ దర్శకత్వంలో నంబన్ అనే కామెడీ సినిమాలో నటించాడు. ఈ సినిమా అతి పెద్ద హిట్ అవడమే కాక, విమర్శనాత్మకంగా మంచి విజయం సాధించింది. జీవా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.[21] మిస్స్కిన్ దర్శకత్వంలో  ముగమూడి, గౌతమ్ మీనన్దర్శకత్వంలో నీతానే ఎన్ పొన్ వసంతం సినిమాల్లో నటించాడు.[22] ఆ తరువాత డేవిడ్, ఎంద్రెండ్రుం పున్నగై సినిమాల్లో కనిపించాడు. 2014లో అతను నటించిన యాన్ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత నటించిన పొక్కిరీ రాజా సినిమా తన 25వ చిత్రం. ఈ సినిమా విజయవంతం కాకపోవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా పెద్ద అపజయంగా నిలిచింది. ప్రస్తుతం [ఎప్పుడు?] నయనతారతో కలసి తిరునాల్ సినిమాలో నటిస్తున్నాడు

ఇతర రంగాల్లో

స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటేషన్ మూడో సీజన్ లో సంగీతా, ఐశ్వర్య రజనీకాంత్ లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2011లో తన అన్న జితిన్ రమేష్ తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలుపెడతామని ప్రకటించాడు. తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించాడు.[23]

వ్యక్తిగత జీవితం

సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి, మహ్జాబీన్ లకు 1984 జనవరి 4, న తమిళనాడులోని చెన్నైలో జీవా జన్మించాడు.అతని అసలు పేరు అమర్. నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు. వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ కు అతని పెద్ద అన్నయ్య బి.సురేష్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా, మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో ఉన్నాడు.

2007 నవంబరు 21 న అతని ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను జీవా వివాహం చేసుకున్నాడు .[24] సుప్రియా ఎంబిఎ చదివి, ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. 1994లో టి నగర్ లో స్కూలులో చదువుకునేటప్పుడు వారిద్దరికీ మొదటి పరిచయం అయింది.[25] 2010లో ఈ జంటకు స్పర్శ్ అనే కొడుకు పుట్టాడు.[26]1998 నుంచి 2002 వరకు ఆర్. శేఖర్ వద్ద మంసురియా కుంగ్ ఫూ నేర్చుకున్నాడు.[27]

సినిమాలు

చిత్రంసంవత్సరంపాత్రదర్శకుడునోట్స్Ref
ఆసాయ్ ఆసాయి2003వినోద్రవి మరియా[28]
తితికుదే2003చిన్ను (వేణు)బృందా సారథి[29]
రామ్2005రామ కృష్ణఅమీర్ సుల్తాన్[30]
డిష్యుమ్2006భాస్కర్శశి[31]
కీర్తి చక్ర2006హవిల్దర్ జైకుమార్మేజర్ రవిమలయాళం సినిమా;
తమిళ్ లో అరన్
[32]
2006ఈశ్వరన్ (ఇ)ఎస్.పి.జననాధన్[33]
పోరి2007హరిసుబ్రమణియం శివ[34]
కత్తరదు తమిజ్2007ప్రభాకర్రామ్[35]
రామేశ్వరమ్2007జీవన్ఎస్.సెల్వం[36]
తెనవట్టు2008కొట్టైసామివి.వి.కాతిర్[37]
శివ మనసుల శక్తి2009శివఎం.రాజేశ్[38]
కచేరి అరంబమ్2010పారితిరైవన్నన్[39]
బాస్ ఎంగిర భాస్కరన్2010శివరాజేశ్అతిథి పాత్ర[40]
సింగం పులి2011అశోక్ కుమార్, శివసాయి రమణి[41]
కో2011అశ్విన్ కుమార్కె.వి.ఆనంద్[42]
రోతిరమ్2011శివగోకుల్[43]
వందాన్ వెండ్రాన్2011అర్జున్ఆర్.కణ్ణన్[44]
నంబన్2012సెవర్కోడి సెంథిల్ఎస్.శంకర్[45]
ముగమూడి2012ఆనంద్ (బ్రూస్లీ)మిస్స్కిన్[46]
నీథానే ఎన్ పొంవసంతం2012వరుణ్ కృష్ణన్గౌతమ్ మీనన్[47]
ఎటో వెళ్ళిపోయింది మనసు2012రైలులో సహపాసింజర్గౌతమ్ మీనన్అతిథి పాత్ర (తెలుగు)[48]
డేవిడ్2013డేవిడ్బెజోయ్ నంబియార్[49]
ఎంద్రెంద్రుం పున్నగై2013గౌతమ్ శ్రీధర్ఐ.అహ్మద్[50]
జిల్లా2014స్వంతపాత్రఆర్.టి.నీసన్పాటు ఒన్ను పాటలో అతిథిపాత్ర[51]
యాన్2014చంద్రశేఖర్రవి.కె.చంద్రన్[52]
సైజ్ జీరో2015స్వంతపాత్రప్రకాశ్ కోవెలమూడిఅతిథిపాత్ర (తెలుగు)[53]
పొక్కిరి రాజా2016సంజీవిరామ్ ప్రకాశ్ రాయప్ప[54]
తిరునాళ్2016బ్లేడ్ గణేశ్రాంనాథ్[55]
సంగిలి బుంగిలి కదవ తోరే2016ఇకె రాధనిర్మాణానంతర పనుల్లో ఉంది[56]
కవలై వెండమ్ \ ఎంతవరకు ఈ ప్రేమ (తెలుగులో)2016డీకే[57]
కీ2017కాలేశ్నిర్మాణంలో ఉంది
నెంజుముండు నెర్మైయుండు2017అరుణ్ కుమార్కేవలం పేరు ప్రకటించారు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ