జార్జియా (రాష్ట్రం)

అమెరికా రాష్ట్రం

జార్జియా అమెరికాకు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. బ్రిటీషు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి పదమూడు రాష్ట్రాలలోనూ జార్జియా ఒకటి. పదమూడు కాలనీలలోనూ జార్జియా ఆఖరుగా ఏర్పడ్డ కాలనీ. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని అమోదించిన నాలుగవ రాష్ట్రం జార్జియా. అమెరికా అంతర్యుద్ధ కాలంలో అమెరికా నుండి విడివడి కాన్ఫెడరసీలో చేరిన రాష్ట్రాలలో జార్జియా కూడా ఉంది. అంతర్యుద్ధంలో ఓటమి అనంతరం తిరిగి అమెరికా యూనియన్ లో చేరిన ఆఖరు రాష్ట్రం జార్జియా.ఈ రాష్ట్రపు అతి పెద్ద నగరం రాజధాని అట్లాంటా.

జార్జియాకు దక్షిణాన ఫ్లోరిడా, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ కరోలినా పడమరగా అలబామా, ఉత్తరాన టెన్నెస్సీ, ఉత్తర కరోలినా రాష్ట్రాలున్నాయి. ఈ రాష్టానికి ఉత్తర భాగంలో బ్లూ రిడ్జ్ పర్వతాలున్నాయి.

59,411 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో జార్జియా అమెరికా రాష్ట్రాలన్నిటిలోకీ 24 వ అతి పెద్ద రాష్ట్రం.

చరిత్ర

ఐరోపా దేశీయుల వలసలు ఆరంభమైనాక స్పెయిను వారు, ఫ్రెంచి వారు, బ్రిటీషు వారు ఈ రాష్ట్రంలో కాలనీలు ఏర్పరచుకున్నారు. స్పెయిను వారికి బ్రిటీషు వారికి మధ్య చిన్న చిన్న కొట్లాటల ఈ రాష్ట్రం బ్రిటీషు వారి వశమైంది.

ఇతరాలు

పీచ్ రాష్ట్రం అన్నది జార్జియా ముద్దుపేర్లలో ఒకటి."Georgia on my mind" అన్న పాట జార్జియా రాష్ట్రీయ గీతం. జార్జియా అన్న మహిళను ఉద్దేశించి రాయబడిన ఈ పాట రే ఛార్లెస్ చేత ఆలపింపబడిన మీదట రాష్ట్ర శాసనసభలో చర్చానంతరం రాష్ట్రీయ గీతంగా ఆమోదింపబడింది.


🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ