జగత్‌సింగ్‌పూర్

ఒడిశా రాష్ట్రం జగత్‌సింగ్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం

జగత్‌సింగ్‌పూర్ ఒడిషా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు ప్రధాన కార్యాలయం కూడా. ఇది 1993 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. గతంలో ఇది కటక్ జిల్లాలో ఒక ఉపవిభాగంగా ఉండేది. పారాదీప్ పోర్ట్, చమురు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఉన్నాయి. దేవి, అలకా, బిలుఖై, కుసుమి, హన్సువా, కువాన్రియా, లునిఝరా నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి

జగత్‌సింగ్‌పూర్
—  పట్టణం  —
జగత్‌సింగ్‌పూర్ is located in Odisha
జగత్‌సింగ్‌పూర్
జగత్‌సింగ్‌పూర్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాజగత్‌సింగ్‌పూర్
Named forజగత్ సింగ్
జనాభా (2011)
 - మొత్తం51,688
భాషలు
 - అధికారికఒరియా
Time zone IST (UTC+5:30)
Vehicle registrationOD-21

భౌగోళిక శాస్త్రం

జగత్‌సింగపూర్ 20°16′N 86°10′E / 20.27°N 86.17°E / 20.27; 86.17 వద్ద , సముద్రమట్టం నుండి 15 మీటర్ల ఎత్తున ఉంది.

రవాణా

జగత్‌సింగ్‌పూర్ పట్టణం నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న గోరఖ్‌నాథ్ స్టేషన్ సమీప రైల్వే స్టేషను.[1] సమీప విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం . బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పారాదీప్‌కి చార్టర్ ఎయిర్ సర్వీస్‌ను పవన్ హన్స్ అందిస్తుంది. జగత్‌సింగ్‌పూర్ ఇతర నగరాలతో రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పట్టణం నుండి ఒడిషాలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు బస్సు సేవలను నిర్వహిస్తోంది.

జనాభా వివరాలు

జగత్‌సింగ్‌పూర్ పట్టణాన్ని 21 వార్డులుగా విభజించారు. సెన్సస్ ఇండియా 2011 విడుదల చేసిన నివేదిక ప్రకారం జగత్‌సింగ్‌పూర్ మునిసిపాలిటీలో 33,631 జనాభా ఉంది. అందులో 17,239 మంది పురుషులు కాగా 16,392 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2859. ఇది జగత్‌సింగ్‌పూర్ మొత్తం జనాభాలో 8.50%. జగత్‌సింగ్‌పూర్ మున్సిపాలిటీలో, లింగ నిష్పత్తి 951. పిల్లల్లో లింగ నిష్పత్తి దాదాపు 961గా ఉంది. పట్టణంలో అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 89.32%. పురుషుల్లో అక్షరాస్యత 93.45% కాగా స్త్రీలలో ఇది 84.98%.[2]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ