చిరంజీవి (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
చిరంజీవి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.రాజేంద్రన్
నిర్మాణం కె. లక్ష్మీనారాయణ
కె.వి రామారావు
తారాగణం చిరంజీవి,
భానుప్రియ,
మాగంటి మురళీమోహన్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అజయ్ క్రియేషన్స్
భాష తెలుగు

చిరంజీవి 1985 ఏప్రిల్ 18 న విడుదలైన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు.[1] భానుప్రియ చిరంజీవి లతో పాటు, విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించింది. ఇది కన్నడ చిత్రం నానే రాజా (1984) కు రీమేక్.

కథ

చిరంజీవి (చిరంజీవి) నిజాయితీ గల పోలీసు ఎస్పి (సత్యానారాయణ) కొడుకు. అతడి చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రి అతణ్ణి అల్లారుముద్దుగా పెంచాడు. సరదాగా, చలాకీగా ఉండే చిరంజీవికి ఒకే బలహీనత ఉంది - తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేడు.

అతడు విజయశాంతితో ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉన్న సమయంలో ఏదో సంఘటనలో ఆమె చిరూ తండ్రిని విమర్శిస్తుంది. తట్టుకోలేని చిరు ఆమెను కొడతాడు. ఆ దెబ్బకు ఆమె గోడకు కొట్టుకుని చనిపోతుంది. తప్పు తెలుసుకున్న చిరంజీవి సంఘటనను మరుగుపరచి తండ్రిఉకి తెలియకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నంలో చిరు, తాను వెతుకుతున్నది తన కొడుకునే అని తెలియకుండా అతణ్ణి వెంటాడే తండ్రి -మిగతా సినిమా అంతా ఈ దొంగాపోలీసు ఆటే. చివర్లో చిరంజీవి అతడి తండ్రి చేతుల్లోనే మరణిస్తాడు.

భానుప్రియ విజయశాంతి సోదరిగా గుడ్డి పాత్రలో నటించింది.[2]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకుడు: సి.వి.రాజేంద్రన్
  • నిర్మాత: కె లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
  • నిర్మాణ సంస్థ: అజయ్ క్రియేషన్స్
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: వి. జయరాం

పాటలు

  • రాజావై వెలుగు, మా రాజై బ్రతుకు

మూలాలు

చిరంజీవి

మార్గదర్శకపు మెనూ