చలపతిరావు తమ్మారెడ్డి

సినీ నటుడు, నిర్మాత

చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు (1944 మే 8 - 2022 డిసెంబరు 25) సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి . 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కాగా తన చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. ఎన్టీఆర్ కృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ జగన్నాటకం పెళ్లంటే నూరేళ్లపంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు యమగోల యుగపురుషుడు డ్రైవర్ రాముడు అనార్కలి బాలకృష్ణుడు జస్టిస్ చౌదరి సర్దార్ రాముడు బొబ్బిలి పులి చట్టంతో పోరాటం దొంగరాముడు అల్లరి అల్లుడు అల్లరి నిన్నే పెళ్లాడతా నువ్వే కావాలి సింహాద్రి బన్నీ బొమ్మరిల్లు అరుంధతి సింహ దమ్ము లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నా చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబర్ 25న తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు

చలపతిరావు
చలపతిరావు
చలపతిరావు తమ్మారెడ్డి
తమ్మారెడ్డి చలపతిరావు
జననం
తమ్మారెడ్డి చలపతిరావు [1]

(1944-05-08) 1944 మే 8 (వయసు 80)
కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు
మరణం2022 డిసెంబరు 25(2022-12-25) (వయసు 78)
హైదరాబాదు
మరణ కారణంగుండెపోటు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు , నిర్మాత
జీవిత భాగస్వామిఇందుమతి
పిల్లలుఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రవిబాబు
తల్లిదండ్రులు
  • మణియ్య (తండ్రి)
  • వియ్యమ్మ (తల్లి)

వ్యక్తిగత వివరాలు

ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.

పాక్షిక సినీ జాబితా

నటుడుగా

నిర్మాతగా[17]

  1. కలియుగ కృష్ణుడు
  2. కడపరెడ్డెమ్మ
  3. జగన్నాటకం
  4. పెళ్లంటే నూరెళ్ల పంట
  5. ప్రసిడెంట్ గారి అల్లుడు
  6. అర్ధరాత్రి హత్యలు
  7. రక్తం చిందిన రాత్రి

మరణం

చలపతిరావు 78 సంవత్సరాల వయసులో హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.[18] ఆయన భార్య ఇందుమతి గతంలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయింది. ఆయనకు కొడుకు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.[19]

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ