గ్లెన్ టర్నర్

న్యూజీలాండ్ క్రికెటర్

గ్లెన్ మైట్‌ల్యాండ్ టర్నర్ (జననం 1947, మే 26) న్యూజీలాండ్ తరపున క్రికెట్ ఆడాడు.

గ్లెన్ టర్నర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్లెన్ మైట్‌ల్యాండ్ టర్నర్
పుట్టిన తేదీ (1947-05-26) 1947 మే 26 (వయసు 77)[1]
డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 174)1969 27 February - West Indies తో
చివరి టెస్టు1983 11 March - Sri Lanka తో
తొలి వన్‌డే (క్యాప్ 9)1973 11 February - Pakistan తో
చివరి వన్‌డే1983 20 June - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1964/65–1975/76Otago
1967–1982Worcestershire
1976/77Northern Districts
1977/78–1982/83Otago
కెరీర్ గణాంకాలు
పోటీTestODIFCLA
మ్యాచ్‌లు4141455313
చేసిన పరుగులు2,9911,59834,34610,784
బ్యాటింగు సగటు44.6447.0049.7037.70
100లు/50లు7/143/9103/14814/66
అత్యుత్తమ స్కోరు259171*311*171*
వేసిన బంతులు126442196
వికెట్లు0059
బౌలింగు సగటు37.8016.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు00
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు00
అత్యుత్తమ బౌలింగు3/182/4
క్యాచ్‌లు/స్టంపింగులు42/–13/–409/–125/–
మూలం: Cricinfo, 2010 25 August

అంతర్జాతీయ క్రికెట్

సౌత్ ఐలాండ్ వర్సెస్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 పరుగులు చేసిన తర్వాత,[2][3] గ్లెన్ టర్నర్ 1969 మార్చిలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు.[4] దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు.[5]

1972లో వెస్టిండీస్‌ పర్యటనలో నాలుగు డబుల్ సెంచరీలు సాధించాడు.[6] 759 బంతులు ఎదుర్కొన్న నాల్గవ టెస్టులో 259 పరుగులు చేయడం టెస్ట్ క్రికెట్‌లో రెండవ సుదీర్ఘ ఇన్నింగ్స్ గా నిలిచింది.[7] న్యూజీలాండ్ అల్మానాక్ ప్లేయర్-ఆఫ్-ది-ఇయర్‌గా గుర్తించబడ్డాడు.[3]

1974లో, ఒక టెస్ట్ మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మొదటి న్యూజీలాండ్ ఆటగాడిగా నిలిచాడు. ఇది టెస్ట్ మ్యాచ్‌లో మొదటిసారిగా ఆస్ట్రేలియాను ఓడించడానికి న్యూజీలాండ్‌కు సహకరించింది.[6]

వన్డేలో 150కి పైగా స్కోర్ చేసిన మొదటి ఆటగాడిగా, వన్డే చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 200కి పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డును కూడా కలిగి ఉన్నాడు.[8]

41 టెస్టుల్లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఏడు సెంచరీలతో సహా 44.64 సగటును సాధించాడు.

క్రికెట్ కోచ్

1985 - 1987 మధ్యకాలంలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు మేనేజర్ లేదా కోచ్‌గా పనిచేశాడు.,ఆస్ట్రేలియాలో జట్టు మొదటి, (నేటి వరకు) ఏకైక సిరీస్ విజయం సాధించింది. 1986 ఇంగ్లాండ్ పర్యటన, వెస్టిండీస్ పర్యటన న్యూజీలాండ్, 1987 ప్రపంచ కప్ లలో పాల్గొన్నాడు. 1991 - 1994 మధ్యకాలంలో న్యూజీలాండ్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేశాడు. 1995, 1996లలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. 1996 ప్రపంచ కప్‌లో జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.[9]

రచయిత

క్రికెట్‌లో తన ప్రస్థానంపై ఐదు పుస్తకాలు రాశాడు:

  • మై వే (1975)
  • గ్లెన్ టర్నర్స్ సెంచరీ ఆఫ్ సెంచరీస్ (రే కెయిర్న్స్‌తో, 1983)
  • ఓపెనింగ్ అప్ (బ్రియాన్ టర్నర్‌తో, 1987)
  • లిఫ్టింగ్ ది కవర్స్ (బ్రియాన్ టర్నర్‌తో, 1998)
  • క్రికెట్ గ్లోబల్ వార్మింగ్ (లిన్ మెక్‌కానెల్‌తో, 2020)[10]

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ