గోరఖ్‌పూర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం

గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్ ఈశాన్యం లోని పూర్వాంచల్‌ ప్రాంతంలో రాప్తీ నది ఒడ్డున ఉన్న నగరం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 273 కి.మీ. దూరంలో ఉంది. ఇది గోరఖ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం, ఈశాన్య రైల్వే జోన్కు, గోరఖ్‌పూర్ డివిజనుకూ ప్రధాన కార్యాలయం. ఈ నగరంలో 1963 నుండి భారత వైమానిక దళ స్థావరం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ మత గ్రంథాల ప్రచురణకర్త గీతా ప్రెస్ గోరఖ్‌పూర్‌లోనే ఉంది.[3]

గోరఖ్‌పూర్
నగరం
గోరఖ్‌‌నాథ మఠం, తారామండల్, గీతా ప్రెస్
గోరఖ్‌‌నాథ మఠం, తారామండల్, గీతా ప్రెస్
గోరఖ్‌పూర్ is located in Uttar Pradesh
గోరఖ్‌పూర్
గోరఖ్‌పూర్
Coordinates: 26°45′49″N 83°24′14″E / 26.7637152°N 83.4039116°E / 26.7637152; 83.4039116
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాగోరఖ్‌పూర్
Named forగోరఖ్‌నాథ్
Government
 • BodyGorakhpur Municipal corporation
Elevation
84 మీ (276 అ.)
జనాభా
 (2011)[1]
 • Total6,73,446
 • Rank66
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
2730xx
టెలిఫోన్ కోడ్+91-0551
లింగనిష్పత్తి1000/903 /
సగటు వార్షిక ఉష్ణోగ్రత26 °C (79 °F)

భౌగోళికం

గోరఖ్‌పూర్ నేపాల్ సరిహద్దు నుండి 100 కి.మీ దూరంలో ఉంది  వారణాసి నుండి 193 కి.మీ, పాట్నా నుండి 260 కి.మీ, లక్నో నుండి 273 కి.మీ. దూరంలో ఉంది.[4]

శీతోష్ణస్థితి

నగర శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) కిందకు వస్తుంది.[5]

తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని వరద బాధిత జిల్లాల్లో గీరఖ్‌పూర్ జిల్లా ఒకటి. గత 100 సంవత్సరాల డేటా ప్రకారం వరదల తీవ్రత, తరచుదనం లలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తోంది. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు తీవ్ర వరద ఘటనలు సంభవిస్తాయి. జిల్లా జనాభాలో సుమారు 20% మంది వరదల బాధితులే. కొన్ని ప్రాంతాలలో నైతే ఏటా సంభవిస్తాయి. పేదలకు భారీగా ప్రాణనష్టం, అనారోగ్యం, జీవనోపాధి నష్టం కలిగిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Gorakhpur (1981–2010, extremes 1901–2012)
నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F)30.0
(86.0)
35.4
(95.7)
42.4
(108.3)
44.4
(111.9)
49.4
(120.9)
46.5
(115.7)
43.2
(109.8)
39.4
(102.9)
38.5
(101.3)
37.4
(99.3)
36.8
(98.2)
30.5
(86.9)
49.4
(120.9)
సగటు అధిక °C (°F)22.0
(71.6)
26.4
(79.5)
32.6
(90.7)
38.0
(100.4)
38.3
(100.9)
36.7
(98.1)
32.9
(91.2)
32.9
(91.2)
32.7
(90.9)
32.8
(91.0)
29.9
(85.8)
25.0
(77.0)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F)8.9
(48.0)
11.7
(53.1)
16.1
(61.0)
21.4
(70.5)
24.5
(76.1)
26.1
(79.0)
25.9
(78.6)
25.9
(78.6)
24.9
(76.8)
20.9
(69.6)
14.9
(58.8)
10.4
(50.7)
19.3
(66.7)
అత్యల్ప రికార్డు °C (°F)1.7
(35.1)
2.8
(37.0)
8.3
(46.9)
12.2
(54.0)
16.6
(61.9)
16.1
(61.0)
18.1
(64.6)
20.2
(68.4)
17.4
(63.3)
12.5
(54.5)
6.7
(44.1)
2.8
(37.0)
1.7
(35.1)
సగటు వర్షపాతం mm (inches)14.4
(0.57)
13.9
(0.55)
7.4
(0.29)
11.3
(0.44)
45.2
(1.78)
185.5
(7.30)
383.4
(15.09)
339.5
(13.37)
228.8
(9.01)
42.8
(1.69)
2.2
(0.09)
8.3
(0.33)
1,282.7
(50.50)
సగటు వర్షపాతపు రోజులు1.21.30.70.93.07.013.912.49.02.10.30.652.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST)68554032425775777668666961
Source: India Meteorological Department[6][7]

జనాభా

గోరఖ్‌పూర్ నగరంలో మతం[8]
మతంశాతం
హిందూ మతం
  
77.9%
ఇస్లాం
  
20.6%
క్రైస్తవం
  
0.7%
ఇతరాలు
  
0.8%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గోరఖ్‌పూర్ మొత్తం జనాభా 6,73,446. వీరిలో 3,53,907 మంది పురుషులు, 3,19,539 మంది మహిళలు.1000 మగవారికి 903 ఆడవారున్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 69,596. గోరఖ్‌పూర్ అక్షరాస్యత 75.2%, అందులో పురుషుల అక్షరాస్యత 79.4%, స్త్రీ అక్షరాస్యత 70.6%. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 83.9%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 88.7%, స్త్రీల అక్షరాస్యత 78.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 62,728, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,929. గోరఖ్‌పూర్‌లో 2011 లో 1,12,237 గృహాలు ఉన్నాయి.[1]

రవాణా

రైల్వేలు

గోరఖ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది.

ఈ స్టేషన్ క్లాస్ ఎ -1 రైల్వే స్టేషన్ సౌకర్యాలను అందిస్తుంది. 2013 అక్టోబరు 6 నాటికి, గోరఖ్‌పూర్ ప్లాట్‌ఫారము ప్రపంచంలోని పొడవైన రైల్వే ప్లాట్‌ఫారము. పునర్నిర్మించిన గోరఖ్‌పూర్ యార్డ్ ప్రారంభోత్సవం తరువాత, దీని పొడవు 1355 మీటర్లుంది .[9][10][11][12]

గోరఖ్‌పూర్ ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం.[13]

వైమానిక

భారత వైమానిక దళం యొక్క వైమానిక దళం స్టేషన్ 1963 లో గోరఖ్‌పూర్‌లో స్థాపించారు. దీన్ని ప్రజా రవాణా కోసం విస్తరించారు. మహాయోగి గోరఖ్‌నాథ్ విమానాశ్రయం అని దీనికి పేరు పెట్టారు.[14]

మెట్రో

ప్రతిపాదిత గోరఖ్‌పూర్ మెట్రో వ్యవస్థలో రెండు కారిడార్లు ఉంటాయి. అవి శ్యామ్ నగర్-సుబా బజార్, గులార్హియా- కాచేహ్రీ చౌరాహా. రెండూకలిపి 27.41 కి.మీ. (17.03 మై.) పొడవుంటాయి. 27 మెట్రో స్టేషన్లుంటాయి

నగర ప్రముఖులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ