గోకరాజు గంగరాజు

నరసాపురం నుండి 16వ లోక్ సభ సభ్యులు. భారతీయ జనతా పార్టీ.

గోకరాజు గంగరాజు భారతదేశ రాజకీయనాయకుడు, 16వలోక్‌సభ సభ్యుడు. అతడు 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1] అతడు లైలా గ్రూపు కంపెనీలకు వ్యవస్థాపకుడు. ప్రస్తుతం దక్షిణ జోన్ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.

గోకరాజు గంగరాజు
గోకరాజు గంగరాజు

వ్యాపారవేత్త


ముందుకనుమూరి బాపిరాజు
నియోజకవర్గంనర్సాపురం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 May 2014

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానంజి.వి.కే.రంగరాజు, జి.రామరాజు
నివాసంవిజయవాడ
పూర్వ విద్యార్థిఆంధ్రా విశ్వవిద్యాలయం
మతంహిందూ
May, 2014నాటికి

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా గంగరాజు పారిశ్రామిక వేత్తగా, సమాజ సేవకునిగా గుర్తింపు పొందాడు. అతడు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ల ద్వారా అంకిత భావంతో సేవలనందిస్తున్నాడు. అతడికి సహకారమిస్తున్న స్నేహితుడు వరప్రసాద్ (శాసనసభ్యుడు). అతడు 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీ లో డిగ్రీని పొందాడు.

అతడి తండ్రి గోకరాజు రంగరాజు ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా, పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, టిటిడి బోర్డు చైర్మన్‌గా రెండుసార్లు తన సేవలనందించాడు.

అతడికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు సెక్రటరీగా గా ఉన్నాడు. బి.సి.సి.ఐ ఆర్థిక కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. బి.సి.సి.ఐ ద్వారా నిర్వహింపబడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క ప్రభుత్వ కౌన్సిల్ లో సభ్యునిగా కూడా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికె ఇన్ ఇండియా (బి.సి.సి.ఐ) కు ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం ఉన్నాడు.[2]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ