గొల్లపల్లి వెంకటదాసు

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
గొల్లపల్లి వెంకటదాసు
గొల్లపల్లి వెంకటదాసు
జననం1916
గొల్లపల్లి, గోపాలపేట మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
మరణంసెప్టెంబరు 4, 1992
తండ్రిబాలయ్య
తల్లినారాయణమ్మ

గొల్లపల్లి వెంకటదాసు తెలంగాణ రాష్ట్రంకు చెందిన వాగ్గేయకారుడు.[1]

జీవిత విశేషాలు

వెంకటదాసు 1916వ సంవత్సరంలో బాలయ్య, నారాయణమ్మ దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లా, గోపాలపేట మండలం, గొల్లపల్లి గ్రామంలో జన్మించాడు. సమీప గ్రామంలోని నంబి శ్రీనివాసులు, నరసింహులు దగ్గర చదువు, శౌవకుల సాయన్న దగ్గర మహాభారతం, రామాయణంలు, వట్టెం గ్రామంలోని దశరథం దగ్గర ఛందస్సు, వ్యాకరణం నేర్చుకున్నాడు.[2]

సాహిత్య ప్రస్థానం

పశువుల కాపరిగా ఉన్న వెంకటదాసు బొల్లి శిల శిఖరంపైనున్న గుహలో శ్రీరాముని విగ్రహం చూసి చాలారోజులపాటు ఆగుహలోనే ఉన్నాడు. అనంతరం యెరాని శ్రీకృష్ణ దేశికుడు దగ్గర ఉపదేశం పొందాడు. తారక రామాయణము, భగవద్గీతలతోపాటు ఇతర 238 కీర్తనలను రాశాడు. శ్రీరాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు మొదలైన దేవతలను కొలుస్తూ ఈయన కీర్తనలు ఉంటాయి.

మరణం

ఈయన 1992, సెప్టెంబరు 4న మరణించాడు.

మూలాలు

మార్గదర్శకపు మెనూ