గీతా ఫోగట్

గీతా ఫోగట్ (జననం 1988 డిసెంబరు 15)[1] ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010లో జరిగిన కామన్ వెల్త్ ఆటల్లో భారతదేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చిన ఏకైక క్రీడాకారిణి గీతా కావడం విశేషం. ఒలంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే.[5]

గీతా ఫోగట్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంగీతా
పూర్తిపేరుగీతా కుమారి ఫాగట్
జాతీయతIndia భారతీయురాలు
జననం (1988-12-15) 1988 డిసెంబరు 15 (వయసు 35)[1]
బలాలీ, హర్యానా, భారతదేశం [1]
ఎత్తు5 అ. 4 అం. (163 cమీ.)[1]
బరువు62 కి.గ్రా. (137 పౌ.)[1]
భార్య(లు)
పవన్ కుమార్
(m. 2016)
క్రీడ
దేశంభారతదేశం
క్రీడకుస్తీ
పోటీ(లు)ఫ్రీ స్టైల్ రెజ్లింగ్
కోచ్మహావీర్ సింగ్ పాగట్
Updated on 15 September 2015.

వ్యక్తిగత జీవితం, కుటుంబం

హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న బలాలీ గ్రామంలో హిందూ జాట్  కుటుంబంలో జన్మించారు గీతా. ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ మాజీ కుస్తీ క్రీడాకారుడే కాక, ఆమెకు కోచ్ కూడా.[6][7]

ఆమె చెల్లెలు బబితా కుమారి, వినేశ్ ఫోగట్ లు కూడా కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు.[8][9]

కెరీర్

2009 కామెన్ వెల్త్ కుస్తీ చాంపియన్ షిప్

2009 డిసెంబరు 19 నుంచి 21 వరకు పంజాబ్లోని జలంధర్ లో జరిగిన కామన్ వెల్త్ కుస్తీ చాంపియన్ షిప్ లో గీతా బంగారు పతకం గెలుచుకున్నారు.[10]

2010 కామన్ వెల్త్ క్రీడలు

2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఇమేలీ బెంస్టెడ్ ను ఓడించి, మహిళా కుస్తీ చాంపియన్ షిప్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన ఘనత స్వంతం చేసుకున్నారు గీతా.[11][12]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ