గాడ్ ఫాదర్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
గాడ్ ఫాదర్
దర్శకత్వంమోహన్ రాజా
స్క్రీన్ ప్లేమోహన్ రాజా
దీనిపై ఆధారితంలూసిఫర్ - మలయాళం సినిమా
నిర్మాతఆర్. బి.చౌదరి
ఎన్వీ ప్రసాద్‌
తారాగణంచిరంజీవి
సల్మాన్ ఖాన్
నయనతార
సత్యదేవ్ కంచరాన
ఛాయాగ్రహణంనీరవ్ షా
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
సూపర్ గుడ్ ఫిల్మ్స్‌
కొణిదెల ప్రొడక్షన్స్
విడుదల తేదీs
5 అక్టోబరు 2022 (2022-10-05)(థియేటర్)
19 నవంబరు 2022 (2022-11-19)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

గాడ్ ఫాదర్ 2022లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా. 2019లో మలయాళంలో హిట్టైన 'లూసిఫర్' సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 అక్టోబరు 5న విడుదల కాగా, 2022 నవంబరు 19న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]

అధికార పార్టీకి చెందిన అత్యున్నత నాయకుడు చనిపోవడంతో పార్టీ ఎన్నికల, నాయకత్వం విషయంలో భారీ శూన్యతను ఏర్పడుతుంది. అతని తరువాత ఎవరు వస్తారనేది సినిమా కథ. హైదరాబాద్, ఊటీ, ముంబైలలో చిత్రీకరణ జరుపుకోవడంతో ప్రధాన ఫోటోగ్రఫీ ఆగస్టు 2021లో ప్రారంభమైంది. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్ల బడ్జెట్‌కు గాను ₹119 కోట్లు వసూలు చేసింది.

నటీనటులు

పాటల జాబితా

  • తార్ మార్ టక్కర్ మార్, రచన:అనంత శ్రీరామ్, గానం . శ్రేయా ఘోషల్
  • నజ భజ, రచన: అనంత్ శ్రీరామ్, గానం. శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర
  • బ్లాస్ట్ బేబీ, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. దామిని భట్ల, బ్లాజే
  • పదర సైనికా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శ్రీరామచంద్ర
  • అన్నయ్య, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.వైష్ణవి కొవ్వూరి
  • గాడ్ ఫాదర్ ,(టైటిల్ సాంగ్)

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: సూపర్ గుడ్ ఫిల్మ్స్‌
    కొణిదెల ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఆర్. బి.చౌదరి
    ఎన్వీ ప్రసాద్‌
  • కథ: మురళి గోపి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: నీరవ్ షా

మూలాలు

బయటి లింకులు

మార్గదర్శకపు మెనూ