గడియారం

వ్యక్తిగత గడియారం

గడియారం (ఆంగ్లం: Watch) మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము, నిత్యావసర వస్తువు.

21 వ శతాబ్దపు గడియారం.

ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల, సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు. కొన్ని గోడ గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తాయి.

పాతకాలంలోని యాంత్రికమైన గడియారాలు స్ప్రింగ్ తో తిరిగేవి. వీటికి రోజూ లేదా రెండురోజుల కొకసారి 'కీ' ఇవ్వాల్సి వచ్చేది. కొన్ని రకాలలో ధరించిన వాని చేతి కదలికల నుండి తయారైన యాంత్రిక శక్తిని ఉపయోగించి పనిచేస్తాయి. ఆధునిక కాలంలో ఇవి ఎక్కువగా బాటరీలతో నడుస్తున్నాయి.

కొన్ని గడియారములలో మనము ఎప్పుడు అవసరము అనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మనము నిద్ర లేవడానికి అలారం పెట్టడం.

పూర్వము ఎండ-నీడల సహాయముతో కాలమును గణించేవారు. అంతే కాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు బాగాలుగా ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రాలడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది.

ప్రస్తుత కాలంలో ముల్లులు లేకుండా అంకెల గడియారములు (డిజిటల్ గడియారాలు) కూడా ఉన్నాయి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్ లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అలాగే సమయాన్ని మాటలలో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటువంటివి అంధులకు చాలా ఉపయోగకరము.

గడియారంలో భాగాలు

మువ్‌మెంట్ (కదలికలు)

మూవ్‌మెంట్ అనేది కాలగమనాన్ని కొలిచి ప్రస్తుత సమయాన్ని చూపే గడియారంలోని భాగం. కదలికలు గడియారంలో యాంత్రికమైనవి కావచ్చు, వైద్యుత మైనవి కావచ్చు, కొన్ని సార్లు రెండు కలిసి కూడా మూవ్‌మెంట్ ఉండవచ్చు. ప్రస్తుతం చాలా గడియారాలు వైద్యుత కదలిక ద్వారా దర్శని (డిస్ప్లే) లో ముళ్ళను తిప్పుతూ ఉంటాయి.

యాంత్రిక కదలికలు

వైద్యుత కదలికలు

పవర్ సప్లై

డిస్ప్లే

వినియోగాలు

గడియారాలలో రకాలు

Timex Datalink USB Dress edition from 2003 with a dot matrix display; the Invasion video game is on the screen.
  • చేతి గడియారం
  • గోడ గడియారం
  • డిజిటల్ గడియారం
  • ఇసుక గడియారం
  • సూర్య గడియారం
  • స్ట్రీట్ క్లాక్ (వీధి గడియారం)
  • కారు తాళంచెవి గడియారం: వాచీలో 8 నుంచి 9 అంకెల మధ్యలో స్థలాన్ని తాకితే కారు డోర్లు తెరుచుకుంటాయి. 3 నుంచి 4 అంకెల మధ్యలో తాకితే డోర్లు మూసుకుంటాయి. అదే ఒకేసారి రెండింటినీ తాకితే కారు ఫ్లాష్‌ లైట్లు వెలుగుతాయి. (ఈనాడు 22.2.2010)

చరిత్ర

1500 : జర్మనీ : పీటర్ హెన్లెన్ మొదటి జేబు గడియారము తయారు చేసెను.

1485 : లియమనార్డొ డా విన్సి ఫుజీ (fusee) ని గీసెను .

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ