కోయీ మిల్ గయా

కోయీ మిల్ గయా హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక, కామ్య పంజాబీ తదితరులు ప్రధానపాత్రల్లో విడుదలైన హిందీ చలన చిత్రం. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించగా అతని సోదరుడు రాజేష్ రోషన్ సంగీతం అందించాడు.

కోయీ.. మిల్ గయా
థియేట్రికల్ పోస్టర్
దర్శకత్వంరాకేష్ రోషన్
రచనజావేద్ సిద్ధిఖీ
(డైలాగ్)
స్క్రీన్ ప్లేసచిన్ భౌమిక్
రాకేష్ రోషన్
హనీ ఇరానీ
రాబిన్ భట్
కథరాకేష్ రోషన్
నిర్మాతరాకేష్ రోషన్
తారాగణంహృతిక్ రోషన్
రేఖ
ప్రీతీ జింటా
రజత్ బేడీ
ఛాయాగ్రహణంసమీర్ ఆర్య
రవి కె. చంద్రన్
కూర్పుసంజయ్ వర్మ
సంగీతంరాజేష్ రోషన్
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్
పంపిణీదార్లుఫిల్మ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్
(ఆల్ ఇండియా)
యష్ రాజ్ ఫిల్మ్స్
(ప్రపంచవ్యాప్తంగా) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
(USA)
విడుదల తేదీ
8 ఆగస్టు 2003 (2003-08-08)
సినిమా నిడివి
166 minutes
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్300 మిలియను (US$3.8 million)[1]
బాక్సాఫీసు800 మిలియను (US$10 million)[2]

నిర్మాణం

అభివృద్ధి

ప్రముఖ భారతీయ చిత్ర దర్శకుడు, రచయిత సత్యజిత్ రే 1962లో సందేశ్ వారపత్రికలో ది ఏలియన్ అనే కథను రాశారు. గ్రహాంతరవాసి బెంగాల్ లోని కుగ్రామంలో దిగి అక్కడి అమాయక బాలుడిని కలవడం వల్ల ఆ గ్రామంలో ఏలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయో ఇతివృత్తం. ది ఏలియన్ కథను కొలంబియన్ పిక్చర్ అనే సంస్థ మార్లోన్ బ్రాండో ప్రధానపాత్రధారిగా, సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమా తీయాలని అనుకున్నా, కొన్ని కారాణాల వల్ల తీయలేకపోయారు. కాని, ది ఏలియన్ కథని మాత్రం మైక్ విల్సన్ అనే వ్యక్తి తన పేరుతో రిజిస్టర్ చేసుకొని, మార్కెట్ చేసుకున్నారు. సినిమా మొదలవ్వకపోవడంతో సత్యజిత్ రే భారతదేశానికి తిరిగివచ్చారు. 1977లో 'క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది ధర్డ్ కైండ్', 1979లో 'ఏలియన్', 1982లో 'ఈ.టీ. ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్' (స్టీవెన్ స్పీల్‌బర్గ్) వంటి సినిమాలు ది ఏలియన్ కథ ఆధారంగా రూపొందిచబడ్డాయి. కాని వాటిద్వారా సత్యజిత్ రే కి వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎలాంటి లాభం చేకూరలేదు. ఆ చిత్రాలన్ని భారతదేశంలో 25 శాతం వసూళ్లు రాబట్టుకున్నాయి.

మూలాలు

ఇతర లింకులు