కొత్త భావయ్య

కొత్త భావయ్య చౌదరి (1897 - 1973) : రచయిత,చారిత్రక పరిశోధకుడు. కమ్మవారి చరిత్ర గ్రంథ కర్త. విద్యాదాత.

కొత్త భావయ్య చౌదరి
కొత్త భావయ్యచౌదరి
జననంజూన్ 2, 1897
గుంటూరు మండలం, సంగం జాగర్లమూడి
మరణం1973
ప్రసిద్ధిచారిత్రక పరిశోధకుడు
Notes
కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు

జననం,విద్య

తీరాంధ్ర దేశము, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి లో శివలింగయ్య రాజమ్మ దంపతులకు జూన్ 2, 1897లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. ఒక రోడ్డు ప్రమాదంలో దెబ్బతిని చేస్తున్న సర్వేయరు ఉద్యోగం మానుకొని చరిత్ర పరిశోధన చేపట్టారు.

స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.

చారిత్రిక పరిశోధన

వీరి పరిశోధనా రచనలలో ముఖ్యమైనది కమ్మవారి చరిత్ర. ఆంధ్ర, కర్ణాటక, తమిళ దేశములందు దొరికిన అనేక శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి, ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము (1939-1942)లో వ్రాసాడు[1]. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడింది.[2].

మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.

రచనలు

భావయ్య విరచితమైన 30 పైగా రాసిన పుస్తకములలో కొన్ని:

  • కమ్మవారి చరిత్ర
  • దేవరహస్యాలు
  • కాశ్మీర నేపాల దేశ చరిత్రలు
  • పశ్చిమ చాళుక్య చరిత్ర
  • వేంగీ చాళుక్య చరిత్ర,
  • సగర పట్టాభిషేకం
  • కాకతీయ రాజన్య చరిత్ర
  • ఆంధ్ర రాజులు[3],
  • గుంటూరు మండల ప్రాచీన చరిత్ర
  • శాయపనేనివారి చరిత్ర
  • పరశురామ నాటకము
  • వినోద కథలు
  • ప్రబోధ కుసుమావళి

మరణం

కవి పండితులు, చారిత్రిక పరిశోధకులు కొత్త భావయ్య చౌదరి గారు 23.7.1973 న మరణించాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ