కేంద్రక విచ్ఛిత్తి

కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) అంటే ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియ. ఇందులో గామా ఫోటాన్లు విడుదల అవుతాయి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది.

యురేనియం పరమాణు విచ్ఛిత్తి. యురేనియం (235), న్యూట్రాన్ ను స్వీకరించి అధిక శక్తిస్థాయి పొంది బేరియం, క్రిప్టాన్ లుగా విడిపోతుంది.

భార మూలకాలలో కేంద్రకం విడిపోతుందని 1938 డిసెంబరు 19న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఒట్టో హాన్, అతని సహాయకుడు ఫ్రిట్జ్ స్ట్రాస్మన్, ఇంకా ఆస్ట్రియన్-స్వీడిష్ పరిశోధకుడు లైస్ మీట్నర్ సంయుక్తంగా కనుక్కున్నారు. హాన్ పరమాణు కేంద్రకం విడిపోవడం గమనించాడు.[1][2]

పరమాణు ఇంధనం శక్తి సాంద్రత సాధారణ శిలాజ ఇంధనాలైన పెట్రోలు లాంటి వాటి కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ కేంద్రక విచ్ఛిత్తిలో భాగంగా విడుదల అయ్యే ఉప ఉత్పత్తులు రేడియో ధార్మికతను కలిగి ఉండటం వలన పరమాణు వ్యర్థాలను నిర్వహించడం ఒక సమస్య.

విచ్ఛిత్తి అనేది ఒక రకమైన పరమాణు పరివర్తనం, ఎందుకంటే ఈ చర్య నుండి వెలువడే శకలాలు అసలు మాతృ పరమాణువు వలె ఒకే మూలకం కావు. రెండు అంతకన్నా ఎక్కువ ఆవేశ శకలాలుగా విడిపోతాయి. చాలా సందర్భాల్లో ఈ విచ్ఛిత్తి రెండు శకలాలుగానే విడిపోయినా, వెయ్యిలో 2 నుంచి 4 సార్లు మాత్రం ఆవేశంతో కూడిన మూడు శకలాలుగా విడిపోవచ్చు. ఈ మూడింటిలో అతి చిన్న శకలం ఒక ప్రోటాన్ కానీ, ఆర్గాన్ పరమాణు కేంద్రకం కానీ అయి ఉంటుంది.

ఈ విచ్ఛిత్తి మానవీయంగా అయితే న్యూట్రాన్ తాడనం ద్వారా కలిగిస్తారు. అలా కాకుండా సహజ రేడియోధార్మిక క్షయం ద్వారా కూడా ఈ విభజన జరుగుతుంది. ఇది సాధారణంగా అత్యధిక ద్రవ్య పరమాణుసంఖ్య కలిగిన ఐసోటోపులలో జరుగుతుంది.

అణుధార్మిక చర్య

మానవ నిర్మిత అణు పరికరాలలో అంతా ఈ విభజన అణుధార్మిక చర్య రూపంలో జరుగుతుంది. ఇది ఒక తాడన ప్రక్రియ. ఇందులో పరమాణువు లోపలి కణాలు, కేంద్రకాన్ని ఢీకొని అది మార్పు చెందేలా చేస్తుంది.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ