కె. ఎం. రాధాకృష్ణన్

కె. ఎం. రాధాకృష్ణన్ ఒక తెలుగు సినిమా సంగీత దర్శకుడు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో నిపుణుడు. ఆనంద్, గోదావరి, చందమామ, మాయాబజార్ లాంటి సినిమాలకు సంగీతం అందించాడు.[2] 2006 లో గోదావరి సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించింది.[3] రాధాకృష్ణన్ కొన్ని ప్రకటనలకు, భక్తి పాటల ఆల్బములకు కూడా సంగీతాన్నందించాడు.

కె. ఎం. రాధాకృష్ణన్
సినివారంలో కె. ఎం. రాధాకృష్ణన్
జననం
గద్వాల, తెలంగాణ, భారతదేశం[1]
విద్యబిఎస్సీ
విద్యాసంస్థహైదరాబాదు మ్యూజిక్ కాలేజీ
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం
వెబ్‌సైటుhttp://kmradhakrishnan.com

వ్యక్తిగత జీవితం

రాధాకృష్ణన్ గద్వాలలో జన్మించాడు. మూడో తరగతి దాకా అక్కడే చదువుకున్నాడు. కొద్ది రోజులు కోయంబత్తూరు వెళ్ళి మళ్ళీ చదువు పూర్తి చేయడానికి గద్వాల తిరిగి వచ్చాడు. అతని తండ్రి 1973 నుంచి ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండటంతో అతనికి సంగీతం మీద ఆసక్తి కలిగింది. అంతే కాకుండా ఆయన నాటకరంగ నటుడు కూడా. సుమారు 500 ప్రదర్శనల దాకా ఇచ్చాడు. ఆయన రాధాకృష్ణన్ ను హిందుస్థానీ సంగీతం నేర్చుకోమని చెప్పాడు. చాగంటి లక్ష్మి దగ్గర రెండేళ్ళ పాటు శాస్త్రీయ సంగీతం సాధన చేశాడు. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డాడు. హైదరాబాదు మ్యూజిక్ కాలేజీ నుండి డిప్లోమా తీసుకున్నాడు. గాంధీ భవన్ లో సంగీత శిక్షకుడి కోసం కావలసిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆర్నాల్డ్ అనే గురువు దగ్గర రెండేళ్ళ పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. వెంగమాంబ అనే గురువు దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను సమ్మేళనం చేయడం సాధన చేశాడు. బి. ఎస్సీ పూర్తి చేసిన తరువాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి లో సబ్ బ్రోకరుగా పనిచేశాడు.[1]

కెరీర్

సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు సునీల్ కుమార్ రెడ్డి అనే సంగీత దర్శకుడు సైలెన్స్ ప్లీజ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఆయన తన సినిమాకు రాధాకృష్ణన్ నేపథ్య సంగీతం అవకాశం ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత హీరో అనే బాలల చిత్రానికి సంగీతం చేసే అవకాశం దొరికింది. తర్వాత శేఖర్ కమ్ముల అతనికి ఆనంద్, గోదావరి లాంటి సినిమాలకు సంగీతం చేసే అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాల్లో రాధాకృష్ణన్ అందించిన సంగీతం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా సినిమాలు విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించింది. రాధాకృష్ణన్ పాటలలో రాగాలు శాస్త్రీయ సంగీత మూలాలను కలిగి ఉంటాయి.[1]

సినిమాలు

మూలాలు

సంవత్సరంసినిమాభాషగమనికలు
2000సైలెన్స్ ప్లీజ్Silent filmనేపథ్య సంగీతం
2002హీరోతెలుగు
2004ఆనంద్తెలుగు
2004మేఘంతెలుగు
2005కాంచనమాల కేబుల్ టివితెలుగు
2006గోదావరితెలుగుఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం [3]
2006మనసు పలికే మౌన రాగంతెలుగు
2006మాయాబజార్తెలుగు
2007చందమామతెలుగు
2008సిద్దు ఫ్రం శ్రీకాకుళంతెలుగు
2008భలే దొంగలుతెలుగు[4]
2008బలాదూర్తెలుగు[5]
2011నాకూ ఓ లవరుందితెలుగు[6]
2014లక్ష్మీ రావే మా ఇంటికితెలుగు[7]
2018శుభలేఖ+లుతెలుగు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ