కార్బొనైల్ ఫ్లోరైడ్
కార్బొనైల్ ఫ్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఈ సమ్మేళనం యొక్క రసాయన సంకేత పదం COF2.
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము Carbonyl difluoride | |||
ఇతర పేర్లు Fluorophosgene Carbon difluoride oxide | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [353-50-4] | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FG6125000 | ||
SMILES | FC(F)=O | ||
| |||
ధర్మములు | |||
COF2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 66.01 g mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
సాంద్రత | 2.698 g dm−3 (gas), 1.139 g dm−3 (liquid at melting point) | ||
ద్రవీభవన స్థానం | −111.26 °C (−168.27 °F; 161.89 K) | ||
బాష్పీభవన స్థానం | −84.57 °C (−120.23 °F; 188.58 K) | ||
నీటిలో ద్రావణీయత | reacts violently with water[1] | ||
బాష్ప పీడనం | 55.4 atm (20°C)[1] | ||
నిర్మాణం | |||
C2v | |||
ద్విధృవ చలనం | 0.95 D | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | Highly toxic (Often fatal), Water reactive | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) | none[1] | ||
REL (Recommended) | TWA 2 ppm (5 mg/m3) ST 5 ppm (15 mg/m3)[1] | ||
IDLH (Immediate danger) | N.D.[1] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
భౌతిక ,రసాయనిక లక్షణాలు
కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయురూపంలో ఉండు ఒక సంయోగపదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ రంగులేని, ఘాటయిన వాసన ఉన్న, అత్యంత విష పూరితమైన సంయోగ పదార్థం.[2] కార్బొనైల్ ఫ్లోరైడ్ అణువు ఏకసమక్షేత్ర సౌష్టవాన్ని కలిగిఉన్నది.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్క అణుభారం 66.01 గ్రాములు/మోల్.[3] కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయువు యొక్క సాంద్రత 2.698 గ్రాములు/dm3.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్కద్రవీభవన స్థానం−111.26 °C (−168.27 °F;161.89K) ఈ సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K). కార్బొనైల్ ఫ్లోరైడ్ నీటితో తీవ్ర స్థాయిలో చర్య జరుపును.
ఉత్పత్తి విధానం
మొదట ఫాసిజెన్ వాయువును హైడ్రోజన్ ఫ్లోరైడ్‌తో చర్య నొందించి, పిమ్మట కార్బన్ మొనాక్సైడ్ తో ఆక్సికరణం చెందించటం వలన కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. అయితే ఈ చర్యలో అధిక స్థాయిలో ఆక్సీకరణ జరగడం వలన కార్బన్ టెట్రాఫ్లోరైడ్ ఏర్పడు అవకాశం కూడా కలదు. కార్బన్ మొనాక్సైడ్‌ను సిల్వర్ డై ఫ్లోరైడ్‌తో ఆక్సీకరణ చెయ్యడం ద్వారా కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుట అనుకూలమైన ఉత్పత్తి ప్రక్రియ.
- CO + 2 AgF2 → COF2 + 2AgF
నీటి సమక్షంలో కార్బొనైల్ ఫ్లోరైడ్ అస్థిరమైనది.నీటితో జలవిచ్ఛేదనము చర్యవలన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌గా వియోగం చెందును.[4]
రక్షణ
కార్బొనైల్ ఫ్లోరైడ్అత్యంత ప్రమాదకరమిన విషకారి. అతితక్కువ సమయంవరకు, 2 ppmవరకు ప్రభావానికి గురైన పర్వాలేదు.[5]