కల్పనా రంజని

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
కల్పన
కల్పనా రంజని
జననం
కల్పనా రంజని

5 అక్టోబరు 1965[1]
కేరళ, భారతదేశం
మరణం2016 జనవరి 25(2016-01-25) (వయసు 50)
హైదరాబాదు, భారతదేశం
ఇతర పేర్లుకల్పనారంజని
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1977–2016
జీవిత భాగస్వామిఅనిల్ కుమార్ (విడాకులు)
పిల్లలుశ్రీమాయి
తల్లిదండ్రులుచవర వి.పి.నాయర్, విజయలక్ష్మి
కుటుంబంకళారంజని (సోదరి)
ఊర్వశి (సోదరి)
కమల్ రాయ్ (సోదరుడు)
ప్రిన్స్ (సోదరుడు)

కల్పనా రంజని, (5 అక్టోబరు 1965 – 2016 జనవరి 25), దక్షిణ భారతీయ సినిమాలలో హాస్యనటిగా మంచి పేరు తెచ్చుకున్న నటీమణి. ఆమె మలయాళ సినిమాలలో ఎక్కువగా నటించారు.60వ జాతీయ సినిమా అవార్డులలో ఆమెకు జాతీయ ఉత్తమ సహాయనటిగా అవార్డు లభించింది. ఈ అవార్డు 2012లో నటించిన "తానిచల్ల నజన్" సినిమాకు లభించింది.[2] ఆమె సినిమా రంగంలో "కల్పన"గా సుపరిచితురాలు. ఆమె సినీనటీమణులైన అయిన "ఊర్వశి", "కళారంజని" ల సోదరి. ఆమె సినీ పరిశ్రమలో కల్పన పేరుతో కథానాయకిగా నటించాలని చేరింది. కానీ ఆమె హాస్య నటిగా స్థిరపండింది. ఆమె అనేక రియాల్టీ షోలలో పాల్గొంది. ఆమె ఉషా ఉతుప్తో కలసి ఒక సంగీత ఆల్బంలో పాల్గొన్నది.[3] ఆమె "నిజన్ కల్పన" అనే పేరుతో ఆమె జ్ఞాపకాలను ప్రచురించింది.[4] నాగార్జున-కార్తి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఊపిరి మూవీలో కల్పనా రంజని నటిస్తున్నారు. ప్రేమ, సతీ లీలావతి, బ్రహ్మచారి చిత్రాల్లో ఆమె అద్భుత నటనకు గాను అవార్డులు అందుకున్నారు.2012లో ఉత్తమ సహాయనటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.[5]

కెరీర్

ఆమె బాలనటిగా "విదరన్న మొట్టుకల్"లో సినీరంగంలోనికి ప్రవేశించారు.[1] ఆమె జి.అరవిందన్ దర్శకత్వం వహించిన 1980 లోని సినిమా "పొక్కువేయిల్"లో ముఖ్య నటిగా కెరీర్ ప్రారంభించారు. సినిమా కథానాయికగా నటించాలనే ఆమెను హాస్యనటిగా ఆదరించారు. ఆమె తమిళంలో 1985లో విడుదలైన "చిన్నవీడు"లో అద్భుతంగా నటించారు. ఆమె కెరీర్ లో మరచిపోని సినిమాలు "సతీ లీలావతి" 91985), "కలివీడు" (1996) [6]

వ్యక్తిగత జీవితం

ఆమె కేరళలో థియేటర్ ఆర్టిస్టులు అయిన చవర వి.పి.నాయర్, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆమె పెద్ద సోదరి "కళారంజని", చెల్లెలు "ఊర్వశి" కూడా సినిమా నటీమణులు. ఆమెకు కమల్ రాయ్, ప్రిన్స్ అనే ఇద్దరు సోదరులున్నారు. ఆమె సోదరులు కమల్ రాయ్, ప్రిన్స్ లు చిన్న వయస్సులలోనే అనగా 17, 27 యేండ్లకు మరణించారు.

ఆమె మలయాళ దర్శకుడు "అనిల్ కుమార్"ను 1998లో వివాహమాడి 2012 లో విడాకులు తీసుకున్నారు. ఆమెకు శ్రీమయి అనే కుమార్తె ఉంది. కుమార్తె ఆమె వద్ద ఉంటూ చదువుతున్నది.[7] ఆమె అనారోగ్య కారణముగా జనవరి 25 2016 న హాస్పటల్ లో చేరారు. కానీ అదే రోజు తన 50వ యేట మరణించారు.[8][9] ఆమె హైదరాబాదులోని ఒక హోటల్ లో ఉదయం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరినది.[10]

పురస్కారాలు

సినిమాలు

కేరళకు చెందిన కల్పనా ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, తెలుగు భాషలలో 300 చిత్రాలలో నటించారు. సతీ లీలావతి సినిమాతో ఆమె తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు.[11]

టెలివిజన్

ఆమె మలయాళ టెలివిజన్ షోలలో అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఆమె ఆసియా నెట్ కామెడీ రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

మలయాళ టెలివిజన్

  • సతీ లీలావతి (అమృత టి.వి)
  • కుడంబసమేతం మనికుట్టి (జైహింద్ టి.వి)
  • కొచు త్రెస్య కొచు
  • ఇన్ పాంచాలీ హౌస్ (సూర్య టి.వి)
  • హుక్క హువ్వ మిక్కడో (కైరాలి)

తమిళ టెలివిజన్

  • చిన్న పాప పెరియ పాప సీజన్ - 1సన్ టివి)
  • మమ్మ మప్పిలై (సన్ టివి)
  • తంగం (టివీ సీరియల్) (సన్ టివి)
  • అభిరామి (టివి సీరియల్) (కలైగ్నర్ టివి)

మూలాలు

ఇతర లింకులు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు

మార్గదర్శకపు మెనూ