కలరా

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
కలరా
వర్గీకరణ & బయటి వనరులు
విబ్రియో కలరే: కలరా వ్యాధికారకమైన బాక్టీరియా (SEM చిత్రపటం)
m:en:ICD-10{{{m:en:ICD10}}}
m:en:ICD-9{{{m:en:ICD9}}}
DiseasesDB2546
m:en:MedlinePlus000303
m:en:eMedicine{{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSHC01.252.400.959.347

కలరా (Cholera) అనునది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు. అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.

చరిత్ర

19 వ శతాబ్దంలో, కలరా భారతదేశంలోని గంగా డెల్టాలోని జలాశయం నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ వ్యాధితో అన్ని ఖండాల్లో లక్షలాది మంది ప్రాణాలు పోగుట్టుకున్నారు. 1961 లో దక్షిణాసియాలో ఈ వ్యాధి ప్రారంభమై, 1971 లో ఆఫ్రికా, 1991 లో అమెరికా దేశాలకు వ్యాప్తి జరిగింది. ప్రస్తుతం కలరాతో చాలా దేశాలలో వ్యాప్తిలో ఉంది[1].

అవగాహన

కలరా అనేది టాక్సిజెనిక్ బాక్టీరియం విబ్రియో కలరా సెరోగ్రూప్ ఒ 1 లేదా ఒ 139 తో పేగు సంక్రమణ వల్ల కలిగే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి సంవత్సరం 1.3 నుండి 4 మిలియన్ల మందికి కలరా వస్తుందని అంచనా వేయబడింది, 21,000 నుండి 143,000 మంది ప్రజలు ఈ కలరా వ్యాధితో  మరణిస్తున్నారు. కలరా వచ్చిన వ్యక్తులు కొంతవరకు  తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు లేదా లక్షణాలు ఉండవు, కానీ కలరా తీవ్రంగా ఉంటుంది. కలరాతో అనారోగ్యానికి గురయ్యే 10 మందిలో ఒక్కరికి  నీటి విరేచనాలు, వాంతులు, కాలు తిమ్మిరి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.కలరా బ్యాక్టీరియా నీటిలో లేదా కలరా బ్యాక్టీరియా సోకిన వ్యక్తి నుండి మలం (పూప్) ద్వారా కలుషితమైన ఆహారాలలో కనిపిస్తుంది. స్వచ్ఛమైన నీరు లేకపోవడం, పారిశుధ్య లోపం, తగినంత పరిశుభ్రత లేని ప్రదేశాలలో కలరా సంభవించే అవకాశం ఉండి, ఈ వ్యాధి వ్యాప్తి అయ్యే అవకాశం ఉన్నది. కలరా బ్యాక్టీరియా సముద్రాల, నదుల , తీరప్రాంత జలాలలోని వాతావరణంలో కూడా జీవించగలదు. ఒక వ్యక్తి నీరు త్రాగటం ద్వారా లేదా కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారాన్ని తినడం ద్వారా కలరా రావడం జరగవచ్చు. ఇన్ఫెక్షన్ నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదు. సురక్షితత్రాగే నీరు, పారిశుధ్య లోపం,తగినంత పరిశుభ్రత లేని ప్రదేశాలలో నివసించే వ్యక్తులు కలరా వచ్చే ప్రమాదం, అవకాశం ఉంది[2].

లక్షణాలు

కలరా సంక్రమణ తర్వాత కొన్ని గంటలు లేదా ఐదు రోజుల వరకు ప్రారంభమవుతాయి. తరచుగా, లక్షణాలు తేలికపాటివి. కానీ కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా ఉంటాయి. కరోనా సోకిన 20 మందిలో ఒకరికి వాంతులుతో పాటు తీవ్రమైన నీటి విరేచనాలు ఉంటాయి, దీనితో కలరా వచ్చిన వ్యక్తి తొందరగా నీరసము అవుతాడు. గుండె స్పందన వేగవంతముగా ఉండటం, స్పృహ లేకపోవడం, నోరు, గొంతు, ముక్కు, కనురెప్పల లోపలి భాగాలతో సహా పొడి శ్లేష్మ పొరలు,తక్కువ రక్తపోటు, అతి దాహం, కండరాల తిమ్మిరిగా ఉండటం కలరా వ్యాప్తి చెందిన వారిలో మనం గమనించవచ్చు[3].

చికిత్స

చాలావరకు కలరా కేసులను ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు. కలరా చికిత్స లో అనుసరించే పద్ధతులలో ఓ ఆర్ ఎస్ ద్రవం, (నోటి రీహైడ్రేషన్ లవణాలు) , ఎలక్ట్రోలైట్ ద్రావణాలు, ఇంట్రావీనస్ (IV) ఫ్లూయిడ్ రీహైడ్రేషన్, యాంటీబయాటిక్స్,జింక్ సప్లిమెంట్స్ వంటివి ఈ చికిత్సలు శరీరంలోని ద్రవాన్ని జోడించి రీహైడ్రేట్ చేస్తాయి. వాంతులు ,విరేచనాలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి[4].

నివారణ

కలరా వ్యాధి ప్రాణాంతకమైనా దీన్ని మన దైనందిన కార్యక్రమాలన్నింటిలో పరిశుభ్రతను పాటించడం ద్వారా సులభంగా నివారించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని శుద్ధం చేయడానికి మంచి సాంకేతిక పద్దతులు అమలులో ఉండటం వలన ఇది ఆ దేశాల్లో చాలా అరుదు గా కనిపిస్తుంది.

కలరా నివారణకు సురక్షితమైన, పరిశుభ్రమైన నీటి సరఫరా కీలకం గా భావించవచ్చు. ప్రజలకు నీటి సరఫరాలో తగినంత క్లోరినేషన్ చేయడం, క్లోరిన్ మాత్రలను న ఉపయోగం , సూచనలతో ఇళ్లలో పంపిణీ చేయడం, ప్రభుత్వాలు శుభ్రమైన నీటిని సరఫరా చేయడం, ప్రజలు నీటిని మరిగించి తాగడం, ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటితో ప్రజలు, ప్రభుత్వం చేయాల్సిన పనులుగా పేర్కొనవచ్చును[5].

మూలాలు

"https://www.search.com.vn/wiki/?lang=te&title=కలరా&oldid=4081861" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ